టాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో రామ్‌చరణ్-ఉపాసన ఒకరు. ఉపాసన షాపింగ్ చేసుకుంటే చరణ్ బ్యాగులు మోయడం.. భర్తకు అవార్డు వస్తుందంటే గర్భంతో ఉన్నా సరే ఉపాసన విదేశాల్లో వాలిపోవడం.. ఇలాంటివి చూసిన జనాలు భార్యాభర్తలంటే ఇలా ఉండాలని అనుకోవడం చాలా మామూలు విషయం. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి ఎంతో విలువిస్తాడు చరణ్. కూతురు పుట్టాక అయితే వీలైనంతవరకు తనతో ఆడుకోవడానికే సమయం కేటాయిస్తున్నాడు.
సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్
అటు ఉపాసన సైతం కేవలం గృహిణిగా మిగిలిపోలేదు. అపోలో హాస్పిటల్స్‌లో కీలక పదవిలో ఉంది. అలాగే బి పాజిటివ్ మ్యాగజైన్‌కు చీఫ్ ఎడిటర్‌గానూ వ్యవహరిస్తోంది. ఓ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె చేసే సేవా కార్యక్రమాలకైతే లెక్కే లేదు. ఇలా ఇద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నా సరే పర్సనల్ లైఫ్‌ను మాత్రం కరెక్ట్‌గా మేనేజ్ చేసుకుంటున్నారు. తాజాగా ఉప్సీ ఎక్స్(ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టింది.
నా విజయం వెనుక..
'ప్రతి మగవాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందని అందరూ అంటుంటారు. నేనేమంటానంటే.. ప్రతి మహిళ విజయం వెనుక ఆమెకు అండగా, రక్షణగా నిలబడే ఒక మగవాడు ఉంటాడు' అంటూ రామ్‌చరణ్‌ను ట్యాగ్ చేసింది. దీనికి ఇండియా ఫోర్బ్స్ మ్యాగజైన్‌పై భర్తతో దిగిన ఫోటోను జత చేసింది. ఇందులో ఉప్సీ సోఫాలో కూర్చోగా చరణ్ ఆమె కాళ్ల దగ్గర కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారగా.. భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవం, సపోర్ట్ ఇచ్చిపుచ్చుకుంటే ఇలా ఆదర్శ దంపతులుగా నిలుస్తారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
They say, behind every successful man there is a woman.
— Upasana Konidela (@upasanakonidela) December 28, 2023
I say, behind every successful woman there is a supportive & secure man. @AlwaysRamCharan @ForbesIndia pic.twitter.com/vtEtjZiedM
చదవండి: వెండితెర వెలుగుల రాణి.. సంచలన విషయాన్ని బయటపెట్టింది
Comments
Please login to add a commentAdd a comment