మెగా హీరో బర్త్‌డే.. సందడి చేసిన రామ్ చరణ్ దంపతులు! | Ram Charan and Upasana Attended Birthday Celebrations Of Mega Hero | Sakshi
Sakshi News home page

Ram Charan and Upasana: వైష్ణవ్‌ తేజ్ బర్త్‌డే.. స్పెషల్ అట్రాక్షన్‌గా రామ్ చరణ్ దంపతులు!

Published Sun, Jan 14 2024 12:14 PM | Last Updated on Sun, Jan 14 2024 12:40 PM

Ram Charan and Upasana Attended Birthday Celebrations Of Mega Hero - Sakshi

గతేడాది ఆదికేశవ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన మెగా హీరో పంజా వైష్ణవ్‌ తేజ్. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ  చిత్రం గతేడాది నవంబర్‌ 24న విడుదలైంది. రిలీజైన మొదటి రోజు నుంచి మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. కాగా.. ఉప్పెన చిత్రంతో సూపర్‌హిట్‌ కొట్టిన వైష్ణవ్‌ తేజ్ ఆ తర్వాత వచ్చిన కొండపొలం ,రంగరంగ వైభవంగా చిత్రాల్లో నటించారు.

(ఇది చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ స్టార్ హీరో సినిమా!)

తాజాగా మెగా హీరో 29వసంతంలోకి అడుగుపెట్టారు. జవనరి 13న వైష్ణవ్‌ తేజ్‌ బర్త్ డేను మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకల్లో ‍గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్ దంపతులు పాల్గొన్ని సందడి చేశారు. వైష్ణవ్‌ తేజ్‌తో సరదాగా ఫోటోలు దిగుతూ కనిపించారు.  ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు సైతం మెగా హీరోకు విషెస్ చెబుతున్నారు. కాగా.. ప్రస్తుతం రామ్‌ చరణ్‌.. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్‌ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement