కొణిదెల... కామినేని కుటుంబాల్లో ఉపాసన చాలా ప్రత్యేకం.. మెగా ఇంటికి కోడలిగా ఆమె అడుగుపెట్టిన సమయం నుంచి ఆమె పేరు మరింత పాపులర్ అయింది. గ్లోబల్‌స్టార్ హీరో రాంచరణ్ సతీమణిగా బెస్ట్ కపుల్స్ అనిపించుకున్న ఉపాసన టాలీవుడ్‌తో పాటు వ్యాపార ప్రపంచంలో కూడా తనదైన ముద్ర వేసింది.
అపోలో హాస్పిటల్స్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోసిస్తున్న ఉపాసనకు మరో బాధ్యతను అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా విభాగానికి నేషనల్ అంబాసిడర్‌గా నియమితులైంది. ఈ విషయాన్ని నాగర్‌కర్నూల్ డీఎఫ్‌వో రోహిత్ గోపిడి తాజాగా తెలిపారు. అపోలో ఆసుపత్రి ట్రస్ట్ యందు వైస్ చైర్‌పర్సన్‌గా ఆమె విధులు నిర్వహిస్తుంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా, అపోలో హాస్పిటల్ ట్రస్ట్ మధ్య ఒప్పందం ప్రకారం నాలుగేళ్ల పాటు ఉపాసన ఈ బాధ్యతల్లో కొనసాగనుంది.
ఈ ఒప్పందం ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాల్లో గాయపడిన పులులు, ఏనుగులు వంటి ప్రాణులకు వైద్యం అందించడమే కాకుండా.. అటవీశాఖ సిబ్బందికి కూడా అపోలో ఆసుపత్రిలో ఉచిత చికిత్సను అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment