ఆ వార్త విని తనకు కన్నీళ్లు ఆగలేదని మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. రాంచరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారన్న శుభవార్త విన్నాక చాలా సంతోషం కలిగిందని ఆయన అన్నారు. కానీ ఆ సమయంలో తాను తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ తెలిపారు.
మెగాస్టార్ మాట్లాడుతూ.. ' ఈ సందర్భం కోసం మేం ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నాం. రామ్‌చరణ్, ఉపాసన ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ పర్యటన ముగించుకుని మా ఇంటికి వచ్చారు. అప్పుడే ఉపాసన తల్లి కాబోతున్న విషయాన్ని మాకు చెప్పారు. ఆ వార్త విని నేను, సురేఖ చాలా ఆనందంగా ఫీలయ్యాం. ఆ సందర్భంలో నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఉపాసనకు మూడో నెల వచ్చాకే ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాం.' అని అన్నారు.
ప్రస్తుతం చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment