ram chran
-
సినీ తారల ‘వ్యాపారం’.. సైడ్ బిజినెస్‌తో కోట్లు గడిస్తున్న స్టార్స్ వీరే!
జీవిక కోసం వృత్తిని.. మానసిక ఉల్లాసం కోసం ప్రవృత్తిని సాగించడం సాధారణమే! కానీ ప్రవృత్తినే వృత్తిగా చేపట్టి.. ఆర్థిక భద్రత కోసమో లేక తమలోని వ్యూహ దక్షతను చాటుకోవడానికో వ్యాపారంలోకి దిగడం కొంచెం విశేషమే! ఆ ‘విశేషం’గా చెప్పకోదగ్గవాళ్లలో చాలామంది సామాన్యులు.. కొంతమంది సినీకళాకారులూ ఉన్నారు. అలాంటి సామాన్యులు ఇంకెంతోమంది సామాన్యులకు స్ఫూర్తి! సెలబ్రిటీల పాపులారిటీ.. వాళ్ల సొంత విషయాల పట్ల ప్రేక్షకులకున్న కుతూహలం దృష్ట్యా వాళ్ల వ్యాపారాల పరిచయం...! కొలువున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనేది పాత తరం తీసుకున్న జాగ్రత్త. కెరీర్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు పొదుపు చేసుకోవడమే కాదు నాలుగు వ్యాపారాల్లో మదుపూ చేయడం నేటి తరం వేస్తున్న తెలివైన అడుగు. ఇదివరకటిలా సర్కారు ఉద్యోగాలు కావు.. రిటైర్మెంట్ భద్రత లేదు. అంతదాకా ఎందుకు రిటైర్ అయ్యే వరకు ఒకటే కొలువులో కొనసాగే పరిస్థితీ లేదు. అందుకే కెరీర్ ఊపులో ఉన్నప్పుడే నాలుగు దారులు చూసిపెట్టుకోవాల్సిన స్థితి. మిగిలిన ఉద్యోగాల సంగతి ఎలా ఉన్నా క్రియేటివ్, గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్లకు మాత్రం ఈ ముందుచూపు తప్పనిసరైంది. ముఖ్యంగా సినిమా రంగం. మునుపటిలా నటీనటులు, టెక్నీషియన్స్ నిర్మాణ సంస్థల ఉద్యోగులుగా ఉండట్లేదు. అప్పటిలా ఇప్పుడు ఒకొక్కరు ఏళ్ల తరబడి వెండితెరను ఏలడంలేదు. ఇప్పుడు కెరీర్ నిలకడగా లేకపోయినా, పలు వేదికల మీద అవకాశాలకైతే కొదవ లేదు. నిన్న, మొన్నటి తరాలకు నిలకడ ఉన్నా, నేటితో పోల్చుకుంటే పారితోషికాలు తక్కువే! ఆ సంపాదనను జాగ్రత్తగా వాడుకున్న వాళ్లు ఎంతమందో.. లెక్కలేకుండా దానధర్మాలు చేసి చివరి దశలో కష్టాలపాలైన వాళ్లూ అంతేమంది. వాటన్నింటినీ పాఠాలుగా తీసుకుంది నేటి తరం. పది సినిమాల తోనే వెండితెర అవకాశాలకు ఎండ్ పడినా.. ఆ పదికే పారితోషికం కోట్లలో అందుతోంది. దాన్నే పెట్టుబడిగా మలచుకుని వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. లేదంటే బాగా నడుస్తున్న వ్యాపారాల్లో భాగస్వాములవుతున్నారు. అలాగని నటనా తృష్ణకు ఫుల్స్టాప్ ఏం పెట్టట్లేదు. నచ్చిన స్క్రిప్ట్ వస్తే సినిమా సైన్ చేస్తున్నారు. ఇతర వేదికల మీది అవకాశాలనూ అందుకుంటూ నటనా తృష్ణను తీర్చుకుంటున్నారు. కేవలం సినిమాలు చేస్తూనే వ్యాపారాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ.. సత్తా చాటుతున్నవారూ ఉన్నారు. తెర మీద నటనతో ప్రేక్షకులను అలరిస్తూ.. వ్యవసాయంతో తమను అలరింపచేసుకుంటున్న వాళ్లూ ఉన్నారు. మరి ఎవరెవరు ఏమేం చేస్తున్నారో తెలుసుకుందాం.. సరదాగా.. రామ్ చరణ్.. ఒక విజయవంతమైన వ్యాపారవేత్త! గుర్రాలు, వాహనాలను అమితంగా ఇష్టపడే చరణ్‌కి ‘హైదరాబాద్ పోలో క్లబ్ అండ్ రైడింగ్ క్లబ్’, ‘ట్రూజెట్’ ఎయిర్‌లైన్స్ సంస్థలు ఉన్నాయి. ఓవైపు నటుడిగా రాణిస్తూనే.. మరోవైపు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’, స్నేహితుడు విక్రమ్ రెడ్డితో కలసి ‘వి మెగా పిక్చర్స్’ను స్థాపించి నిర్మాతగానూ విజయం సాధిస్తున్నాడు. అల్లు అర్జున్.. కూడా మంచి వ్యాపారవేత్త. హైదరాబాదులోని ‘బఫెలో వైల్డ్ వింగ్స్’, ‘బి–డుబ్స్’ రెస్టారెంట్స్‌తో ప్రారంభమైన తన వ్యాపార సామ్రాజ్యం, అంతర్జాతీయస్థాయికి ఎదిగింది. ప్రముఖ ‘ఎమ్. కిచెన్’తో అనుసంధానమై ‘800 జూబ్లీ’ పేరుతో మరో నైట్ క్లబ్ కూడా ఉంది. ఈ మధ్యనే ఏషియన్ సినిమాస్‌తో చేతులు కలిపి ‘ఏఏఏ సినిమాస్’ అనే మల్టీప్లెక్స్నూ ప్రారంభించాడు. విజయ్ దేవరకొండ.. ప్రేక్షకుల్లో తనంటే ఉన్న క్రేజీనెస్నే పెట్టుబడిగా పెట్టి ‘రౌడీ’ పేరుతో సొంత బ్రాండ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడది ప్రముఖ ఆన్లైన్ స్టోర్ ‘మింత్రా’తో అనుసంధానమై దేశవ్యాప్తంగా విస్తరించింది. దుస్తులతోపాటు, కాఫీ మగ్గులు, మల్టులు, ఫుట్ వేర్ కూడా ఇందులో లభిస్తాయి. మహబూబ్‌నగర్‌లో విజయ్‌కి ‘ఏవీడీ సినిమాస్’ మల్టీప్లెక్స్ కూడా ఉంది. మహేశ్ బాబు.. ‘జి.మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్’ అనే నిర్మాణ సంస్థతో పాటు ‘ఏఎమ్‌బీ సినిమాస్’ పేరుతో ఒక మల్టీప్లెక్స్నూ ప్రారంభించాడు. హైదరాబాద్‌లోని అతిపెద్ద మాల్స్‌లో ఇదీ ఒకటి. పెద్ద హీరోలు కూడా.. యువతరమే కాదు.. సీనియర్ హీరోలూ బిజినెస్‌లో బాబులే. ఇంకా చెప్పాలంటే కుర్ర హీరోలకు స్ఫూర్తిదాతలు. టాలీవుడ్ మన్మథుడు నాగార్జునకు ‘ఎన్గ్రిల్స్’ రెస్టారెంట్. ‘ఎన్ కన్వెన్షన్ సెంటర్’ ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవికి ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’లో వాటాలు ఉన్నాయి. అలాగే విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జగపతిబాబుకు ఒక ఫర్నిచర్ బిజినెస్, మోహన్‌బాబుకు సొంత ప్రొడక్షన్ హౌస్‌తో పాటు ‘శ్రీ విద్యానికేతన్’ విద్యాసంస్థలు ఉన్నాయి. ప్రకాశ్‌రాజ్‌కు ‘లైఫ్ అట్ ప్రకాశం’ రిసార్టు ఉంది. అలాగే సందీప్ కిషన్‌కి ‘వివాహ భోజనంబు’ రెస్టారెంట్ ఉంది. పరభాషా తారలేం తక్కువ కాదు తెలుగు హీరోల్లోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ హీరోలదీ ఇదే బాట. జీన్స్ సినిమాతో ఫేమస్ అయిన ప్రశాంత్.. తమిళనాడులోనే అతిపెద్ద జ్యూలరీ మాల్ యజమాని. ‘రియల్ గోల్డ్ టవర్’ గా పిలిచే పది అంతస్తుల ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లో విలాసవంతమైన ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ‘నేనే అంబానీ’ ఆర్యకు చెన్నైలో ‘సీ షెల్’ రెస్టారెంట్, ‘ది షో పీపుల్’ నిర్మాణ సంస్థ ఉన్నాయి. హీరో జీవా కూడా ఈ మధ్యనే ‘ఫైడింగ్ రూమీ’ పేరుతో ఒక రూఫ్‌టాప్ రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. టాలీవుడ్ హీరోయిన్స్.. సమంత.. ఈ స్టైల్ క్వీన్ ఏ వేడుకకు హాజరైనా అక్కడకి వచ్చినవారి చూపులన్నీ ఆమె ఆహార్యంపైనే ఉంటాయి. ఫ్యాషన్‌ను అంతగా ప్రేమించే సమంత స్వయంగా ‘సాకీ’ పేరుతో ఒక ఫ్యాషన్ లేబుల్‌ని ప్రారంభించింది. చెన్నైలో ‘ఏకమ్ ఎర్నీ లెర్నింగ్ సెంటర్’ పేరుతో కొన్ని విద్యాసంస్థలనూ నిర్వహిస్తోంది. కాజల్ అగర్వాల్.. తన చెల్లితో కలసి ‘మర్సాలా’ జ్యూలరీ బ్రాండ్, భర్తతో కలసి హోమ్ డెకర్ లేబుల్ ‘కిచడ్’ను ప్రారంభించి రెండు చేతులా సంపాదిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్.. ఫిట్నెస్ విషయంలో స్ట్రిక్ట్‌గా ఉండే ఈ నటి ‘ఎఫ్45’ ఫిట్నెస్ హెల్త్ హబ్, జిమ్ సెంటర్‌నూ ప్రారంభించింది. ఈ జిమ్‌కి చెందిన మూడు బ్రాంచీల్లో రెండు హైదరాబాదులోని గచ్చిబౌలి, కోకాపేట్లో ఉండగా మరొకటి విశాఖపట్నంలో ఉంది. తమన్నా.. పదిహేనేళ్ల వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్.. బిజినెస్ ఉమన్‌గానూ సక్సెస్ సాధించింది. 2015లో ‘వైట్ అండ్ గోల్డ్’ పేరుతో బంగారు ఆభరణాల వ్యాపారం మొదలుపెట్టి దిగ్విజయంగా సాగిపోతోంది. కీర్తి సురేష్.. ‘భూమిత్ర’ పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్ స్థాపించింది. ఇది సహజసిద్ధ ఔషధాలతో తయారైన స్కిన్ కేర్ ఉత్పత్తులను అందిస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకునే మరికొంతమంది హీరోయిన్స్ ఉన్నారు. తాప్సీ.. చెల్లి షాగన్, స్నేహితురాలు ఫరా పర్వరేష్తో కలసి ‘ది వెడ్డింగ్ ఫ్యాక్టరీ’ పేరుతో ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని ప్రారంభించి, ఎంతోమంది సెలబ్రిటీలకు పెళ్లి చేసింది. శ్రియా శరణ్‌కు ‘శ్రీ స్పందన’ బ్యూటీ సెలూన్, స్పాలు ఉన్నాయి. ఇలియానా.. గోవాలో రెస్టారెంట్లు, బేకరీలు రన్ చేస్తూ సక్సస్‌ఫుల్‌గా సాగుతోంది. ప్రణీత సుభాష్, నిక్కీ గాల్రానీ.. ఈ ఇద్దరికీ బెంగళూరులో వేర్వేరు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక నయనతార, త్రిష, నమిత, అనుష్కలు పలు ప్రముఖ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలోనూ వాటాలు పెట్టి తమ సంపాదనను మరిన్ని రెట్లు పెంచుకుంటున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్.. దీపికా పదుకోణ్.. బాలీవుడ్లోనే కాదు అటు హాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న ఆమె 2015లో.. ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ మింత్రాతో కలసి సొంత ఫ్యాషన్ లేబుల్ ‘ఆల్ ఎబౌట్ యు’ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ ఎత్నిక్, వెస్టర్న్ వేర్ దుస్తులు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘కేఏ ఎంటర్ ప్రైజెస్’ అనే నిర్మాణ సంస్థనూ స్థాపించి.. నిర్మాతగానూ సక్సెస్ అయింది. అనుష్క శర్మ.. 2017లో ‘నుష్’ పేరుతో ఒక ఫ్యాషన్ లేబుల్‌ను ప్రారంభించింది. ఈ బ్రాండ్ జాకెట్స్, డెనిమ్స్ వంటి వెస్టర్న్వేర్కి అమ్మాయిల్లో మంచి గుర్తింపు ఉంది. సొంతంగా ‘క్లీన్ స్లేట్ ఫిల్మ్స్’ పేరుతో చిత్ర నిర్మాణమూ చేపట్టింది. ప్రియాంకా చోప్రా.. బాలీవుడ్, హాలీవుడ్‌లోనే కాదు వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతోంది. న్యూయార్క్‌లో ‘సోనా ఇన్ న్యూయార్క్’ రెస్టారెంట్‌ను తెరచి లాభాలు గడిస్తోంది. సొంత హెయిర్ కేర్ బ్రాండ్ ‘అనామోలీ’, ప్రొడక్షన్ హౌస్ ‘పర్పుల్ పెబల్’ కూడా లాభాల్లో ఉన్నాయి. ప్రీతీ జింటా.. ‘కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ’ ఐపీఎల్ జట్టుకి ఓనర్. సౌత్ ఆఫిక్రాకు చెందిన ‘స్టెలెన్‌బాష్ కింగ్స్ టీమ్’కి కూడా ఆమే యజమాని. వీటితోపాటు ముంబైలో రెండు రెస్టారెంట్లు, ‘పీఎన్‌జడ్‌ఎన్’ పేరుతో ఒక నిర్మాణ సంస్థా ఉన్నాయి. సుస్మితా సేన్.. సినిమాల్లోనే కాదు, వ్యాపార రంగంలోనూ దిట్టే. ముంబైలో ‘బెంగాలీ మాసీస్ కిచెన్’ రెస్టారెంట్, ‘సేన్సాజీవన్’ స్పాలను తెరచి లాభాలను అందుకుంటోంది. సొంత నిర్మాణ సంస్థ ‘తంత్ర ఎంటర్టైన్మెంట్’కూ మంచి పేరే ఉంది. సోనమ్ కపూర్.. చిత్రచిత్రమైన ఫ్యాషన్ వస్త్రాలతో షాకింగ్ క్వీన్‌గా పేరు తెచ్చుకున్న ఆమె అదే స్టైల్‌తో 2017లో ‘సోనమ్ రేసన్ లేబుల్’ను స్థాపించింది. అన్ని రకాల శరీరాకృతుల వారినీ ఫ్యాషన్ ఐకాన్స్‌గా చూపించాలనే లక్ష్యంతో ఈ బ్రాండ్ రూపుదిద్దుకుంది. ఇండో వెస్టర్న్ అవుట్‌ఫిట్‌కి ఈ లేబుల్ పెట్టింది పేరు. ట్వింకిల్ ఖన్నా.. తన తల్లి పేరుతో ‘డింపుల్ కపాడియా’ అనే కొవ్వొత్తుల కంపెనీతో పాటు, ముంబైలోని ‘ది వైట్ విండో’ అనే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని నడుపుతోంది. ‘గ్రేజింగ్ గోట్ పిక్చర్స్’ పేరుతో నిర్మాణ సంస్థనూ స్థాపించి ఎన్నో సినిమాలను నిర్మించింది. ఆశా భోంస్లే.. 2012లో.. దుబాయ్‌లో ‘ఆశాస్’ పేరుతో ఒక రెస్టారెంట్‌ని ప్రారంభించింది. ఇదిప్పుడు ఆరు దేశాల్లో ప్రముఖ భారతీయ రెస్టారెంట్‌గా పేరు పొందింది. దేశీ, పాశ్యాత్యా వంటకాలను అందించడం ఈ రెస్టారెంట్ ప్రత్యేకత. శిల్పా శెట్టి.. పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉండి.. బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. ఒక యోగా స్టూడియో తెరచింది. ఈ మధ్యనే ‘రాయల్టీ క్లబ్’ పేరుతో విలాసవంతమైన రెస్టారెంట్, ‘ఎన్ఎస్’ పేరుతో ఫ్యాషన్ లేబుల్నూ ప్రారంభించింది. లారా దత్తా.. నటిగా కంటే ప్రొడ్యూసర్‌గా మంచి గుర్తింపు పొందింది. ‘భీగీ బసంతి’ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించి ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించింది. ఈ మధ్యనే ‘డీవీడీ’ పేరుతో ఒక జిమ్, ‘ఛబ్రా 555’ అనే శారీస్ షోరూమ్‌ను తెరచింది. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా సుపరిచితమైన నటి కృతి సనన్ ‘టేకినిక్’ పేరుతో ఓ ఫ్యాషన్ లేబుల్‌ను ప్రారంభించింది. అలాగే శ్రద్ధా కపూర్‌కి ‘ఇమారా’ లేబుల్ ఉంది. బాలీవుడ్ తారలైన మలైకా అరోరా, బిపాసా బసు, సుసానే ఖాన్.. ఈ ముగ్గురూ కలసి ‘ది లేబుల్ ఆఫ్ లైఫ్’ పేరిట ఒక క్లాతింగ్ లైఫ్‌స్టైల్ బ్రాండ్‌ని ప్రారంభించారు. నటి కరిష్మా కపూర్ ‘బేబీ ఓఈ.కామ్’ అనే ఈ కామర్స్ పోర్టల్‌కి ఓనర్. ఈ వెబ్సైట్లో చిన్నపిల్లలు, తల్లులకు అవసరమైన వస్తువులు లభిస్తాయి. ఇదేవిధంగా నటి సన్నీ లియోనీకి ‘ఐఎమ్బేషరమ్. కామ్’ అనే ఆన్లైన్ అడల్ట్ స్టోర్ ఉంది. ఇక్కడ అడల్ట్ టాయ్స్, దుస్తులు లభిస్తాయి. బాలీవుడ్ హీరోస్.. షారుఖ్ ఖాన్.. క్రీడా రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాడు. 2008 ఐపీఎల్లో ‘కోల్కత్తా నైట్ రైడర్స్’ క్రికెట్ టీమ్‌ని కొనుగోలు చేసి మంచి లాభాలనే పొందాడు. సొంత నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ పేరుతో ఎన్నో సినిమాలనూ నిర్మించాడు. ఇందులో ప్రముఖ నటి జూహీ చావ్లాకూ భాగస్వామ్యం ఉంది. సల్మాన్ ఖాన్.. ‘బీయింగ్ హ్యూమన్’ పేరుతో సొంత క్లాతింగ్ బ్రాండ్ ఉంది. దీనికి పలు ప్రముఖ నగరాల్లో బ్రాంచీలు ఉన్నాయి. ఈ బ్రాండ్ అలంకరణ వస్తువులను కూడా అందిస్తోంది. హృతిక్ రోషన్.. 2013లో ‘హెచ్ఆర్ఎక్స్’ అనే జిమ్ వేర్ బ్రాండ్‌ని ప్రారంభించాడు. ఇందులో జిమ్ వేర్‌తోపాటు జిమ్‌కి సంబంధించిన వస్తువులు, సైకిళ్లు, షోషకాహార పదార్థాలు, ఫుట్ వేర్ దొరుకుతాయి. ఈ మధ్యనే ముంబైలో ‘సెంటర్ కల్ట్’ పేరుతోనూ ఓ జిమ్‌ను తెరచాడు. అభిషేక్ బచ్చన్.. సినిమాల్లో కంటే వ్యాపార రంగంలోనే బాగా రాణిస్తున్నాడు. పలు ప్రముఖ కంపెనీలలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, 2014 ప్రో కబడ్డీ లీగ్‌లో మొదట విజయం సాధించిన జైపూర్ పింక్ పాంథర్ టీమ్‌ని కొనుగోలు చేశాడు. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్‌లోని ‘చెన్నైయిన్ ఎఫ్‌సీ’యజమాని కూడా. ఈ జట్టు కూడా లీగ్‌లో తొలి విజేత. సునీల్ శెట్టి.. ఇతనికీ రకాల బిజినెస్‌లు ఉన్నాయి. ముంబైలో ‘మిస్చిఫ్ డైనింగ్ బార్’, ‘క్లబ్ హెచ్‌టుఓ’ రెస్టారెంట్, బార్లు ఉన్నాయి. సొంతంగా ‘పాప్‌కార్న్ ఎంటర్టైన్మెంట్’ నిర్మాణ సంస్థ, ‘ఎస్టు రియాలిటీ’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ‘హకీం అలీమ్ సెలూన్స్’లలో 50శాతం వాటాలూ ఉన్నాయి. అర్జున్ రామ్‌పాల్.. ఢిల్లీలోని అతిపెద్ద లాంజ్ బార్ అండ్ రెస్టారెంట్ ‘ఎల్ఏపీ’ యజమాని. పదిహేడు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ రెస్టారెంట్లో ఫర్నిచర్ డిజైనింగ్ చేసిన డిజైనర్స్‌లో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఒకరు. దీనితోపాటు అతనికి.. ఈవెంట్ మేనేజింగ్ కంపెనీ ‘చైసింగ్ గణేశ’ కూడా ఉంది. మిథున్ చక్రవర్తి.. ‘ఊటీ, గోవా, ముస్సోరీ వంటి నగరాల్లోని ‘మోనార్క్ గ్రూప్స్’ హోటళ్ల యజమాని. అజయ్ దేవ్గన్.. 2011లో ఒక ప్రైవేటు సంస్థతో కలసి గుజరాత్‌లోని ‘చార్నాకా’ అనే ఒక సోలార్ ప్రాజెక్ట్‌ని స్థాపించాడు. ఇప్పుడది మంచి లాభాల్లో ఉంది. వీటితోపాటు ‘అజయ్ దేవ్గన్ ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌస్, వీఎఫ్ఎక్స్ స్టూడియో ఉన్నాయి. అమితాబ్ బచ్చన్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ 1996లో ‘అమితాబ్ బచన్ కార్పొరేషన్ లిమిటెడ్’ పేరుతో ఒక ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించారు. కానీ, అది ఘోరమైన నష్టాలను తెచ్చిపెట్టింది. - దీపావళి -
వారసత్వం కోసం బిడ్డను కనడం లేదు.. ఉపాసన ఆసక్తికర పోస్ట్
మెగా కోడలు, గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మరికొద్ది రోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. ప్రస్తుతం ఆమె నిండు గర్భవతి. పెళ్లైన పదేళ్ల తర్వాత గర్భం దాల్చడంతో మెగా ఫ్యామిలీ ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక ఉపాసన ఇంట్లోనే ఉంటూ.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. (చదవండి: ఉపాసనపై కామెంట్స్.. ఓ వ్యక్తిని చితకబాదిన చెర్రీ ఫ్యాన్స్!) ఇదిలా ఉంటే.. మదర్స్ డే సందర్భంగా నేడు బేబీ బంప్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఉపాసన. ఈ సందర్భంగా ఆమె ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. తల్లి కావాలనే నా నిర్ణయం వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికతో లేదా నా వివాహాన్ని బలోపేతం చేయాలనే కోరికతో తీసుకున్నది కాదు. నా బిడ్డకు అంతతేని ప్రేమని పంచడంతో పాటు జాగ్రత్తగా చూసుకుంటానని మానసికంగా ప్రిపేర్ అయ్యాకనే తల్లిని కావాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉపాసన రాసుకొచ్చింది. (చదవండి: పెళ్లికి ముందే అమ్మతనం కోసం ఆరాటపడ్డ హీరోయిన్స్ వీళ్లే ) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఆ వార్త విని కన్నీళ్లు ఆపుకోలేకపోయా: మెగాస్టార్ ఎమోషనల్
ఆ వార్త విని తనకు కన్నీళ్లు ఆగలేదని మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. రాంచరణ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారన్న శుభవార్త విన్నాక చాలా సంతోషం కలిగిందని ఆయన అన్నారు. కానీ ఆ సమయంలో తాను తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ తెలిపారు. మెగాస్టార్ మాట్లాడుతూ.. ' ఈ సందర్భం కోసం మేం ఆరేళ్లుగా ఎదురు చూస్తున్నాం. రామ్‌చరణ్, ఉపాసన ఆర్ఆర్ఆర్ మూవీ జపాన్ పర్యటన ముగించుకుని మా ఇంటికి వచ్చారు. అప్పుడే ఉపాసన తల్లి కాబోతున్న విషయాన్ని మాకు చెప్పారు. ఆ వార్త విని నేను, సురేఖ చాలా ఆనందంగా ఫీలయ్యాం. ఆ సందర్భంలో నేను కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఉపాసనకు మూడో నెల వచ్చాకే ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాం.' అని అన్నారు. ప్రస్తుతం చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఈ సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పాటలు మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. -
జపాన్‌లో RRR టీం.. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ (ఫొటోలు)
-
బిగ్ సర్ప్రైజ్, ఆచార్యలో అనుష్క స్పెషల్ రోల్!
Anushka Shetty Playing Special Role In Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇంకా విడుదలకు రెండు రోజుల ఉండగా ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ ఓ ఆసక్తికర అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో హీరోయిన్గా చేసిన కాజల్‌ను తొలిగించిన విషయం తెలిసిందే. చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్, సుదీప్ మధ్య ట్వీట్ల వార్ దీనికి బదులుగా ఓ సీన్ కోసం స్టార్ హీరోయిన్ అనుష్కను తీసుకున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. కాస్తా గ్లామర్ టచ్ కోసం చిత్రం బృందం ఓ అతిథి పాత్రకు అనుష్క శెట్టిని స్పంద్రించినట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క ఓ స్పెషల్ సాంగ్ లేదా ముఖ్య పాత్రలో కనిపించనుందని ఫిలీం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మూడేళ్లుగా అనుష్క వెండితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన రీఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో అనుష్క అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు చిత్రం బృందం ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిందట. చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే.. ఇదే నిజమైతే ఆచార్య చూసేందుకు థియేటర్‌కు వచ్చిన స్వీట్ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఏప్రిల్ 29 తేదీవరకు వేచి చూడాలి. కాగా ఆచార్య మూవీ ప్రమోషన్ భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న డైరెక్టర్ కొరటాల ఈ మూవీ నుంచి కాజల్‌ను తీసేశామని స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘‘ఆచార్య’పాత్రకు లవ్ ఇంట్రస్ట్ ఉంటే బాగుంటుందా? లేదా? అనే డౌట్ వచ్చింది. అదే సమయంలో కరోనా లాక్డౌన్ వచ్చింది. అప్పుడు బాగా ఆలోచించాను. నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్ ఇంట్రస్ట్ పెడితే బాగోదని ఉద్దేశించి ఆమెను తొలగించాం’’ అని తెలిపాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్ఆర్ఆర్ కోసం జక్కన్న తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతంటే..
బాక్సాఫీస్ దగ్గర ఓటమి ఎరుగని ధీరుడు.. ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన గొప్ప డైరెక్టర్ ఎస్. ఎస్ రాజమౌళి. ఆయన నుంచి ఒక సినిమా వచ్చిందంటే.. అది కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాల్సిందే. తీసింది తక్కువ సినిమాలే అయినా..ప్రతీది ఒక అద్భుత కళాఖండమే. బాహుబలి చిత్రం అయితే.. ఏకంగా 2000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. ఇండియన్ మూవీస్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేసింది. అంతేకాదు బాహుబలి తర్వాత టాలీవుడ్ తలరాతే మారిపోయింది. మన సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ పెరిగింది. ఒకప్పుడు బాలీవుడ్ చిత్రాలను టాలీవుడ్లో రీమేక్ చేసేవారు. కానీ ఇప్పుడు మన చిత్రాలను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ మార్పుకి అంతో ఇంతో కారణం రాజమౌళి అనే చెప్పాలి. ఇప్పుడు ఈ దర్శకధీరుడు తెరకెక్కించిన మరో పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కోసం జక్కన్న చాలా కష్టపడ్డారు. కొవిడ్ కష్టాలను ఎదుర్కొంటూ సూమారు నాలుగేళ్లపాటు ఈ మూవీని తెరకెక్కించాడు. అయితే కష్టానికి తగినట్లే.. రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటాడట రాజమౌళి. ఆర్ఆర్ఆర్ కోసం డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ దాదాపు రూ. 80 కోట్లకు పైగానే పారితోషికం అందించిందని సమాచారం. ఇండియాలో ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక డైరెక్టర్ రాజమౌళి మాత్రమే కావడం గమనార్హం. మరోవైపు ఆర్ఆర్ఆర్ లాభాల్లో 30 శాతం వాటా కూడా అడిగినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. రాజమౌళికి మూడు వందల కోట్లకు పైనే రెమ్యునరేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈ సినిమాల్లో నటించిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు ఒక్కొక్కరికి రూ.45 కోట్లను రెమ్యునరేషన్‌గా అందించినట్లు సమాచారం. ఇక ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ నటీనటుల సంగమంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు రాజమౌళి. టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, రామ్ చరణ్, బాలీవుడ్ నుంచి ఆలియాభట్, అజయ్ దేవగన్ తోపాటు హాలీవుడ్ నటీనటులు ఒలివియో మోరీస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడీ, ఎడ్వర్డ్ సోనెన్ బ్లిక్ లు సందడి చేయబోతున్నారు. వీరితోపాటు అరుణ్ సాగర్, శ్రియా శరణ్, ఛత్రపతి శేఖర్, రాజీవ్ కనకాల, సముద్రఖనిలు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. మార్చి 25న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
RRR: ఆ సీన్ సినిమాకే హైలైట్.. జక్కన్న మాటలతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
Rajamouli Reveals Interesting News On RRR Movie: ఆర్ఆర్ఆర్... ఇప్పుడే దేశమంతా ఈ సినిమా గురించే చర్చిస్తోంది.యావత్ సినీ అభిమానులందరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం (మార్చి 25) థియేటర్లలో సందడి చేయనుంది.ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీమ్ వరుస ఇంటర్వ్యూలతో సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో పాటు దర్శకుడు రాజమౌళి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు.గత వారం రోజుల నుంచి గ్యాప్ లేకుండా...దేశమంతా తిరుగుతూ ఆర్ఆర్ఆర్ గురించి ప్రచారం చేశారు. ప్రతి ఈవెంట్లోనూ ఏదో ఒక ఆసక్తికర విషయాలను తెలియజేస్తూ...ఆర్ఆర్ఆర్పై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ‘అర్జున్‌రెడ్డి’ఫేమ్ సందీప్ రెడ్డి ఇంటర్వ్యూలో పాల్గొన్న జక్కన్న...ఆర్ఆర్ఆర్కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ మ్యాటర్‌ని రివీల్ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అరెస్ట్ సీన్.. అదిరిపోయేలా ఉంటుందట. కొమరంభీమ్(ఎన్టీఆర్)ను బ్రిటీష్ అధికారిగా ఉన్న అల్లూరి(రామ్ చరణ్)అరెస్ట్ చేసే సన్నివేశంలో ఓ 1000 మంది దొమ్మి తరహాలో కొంటుకుంటూ ఉంటారు. వారిని చెదరగొట్టడానికి రామ్ చరణ్ లాఠీతో అందరిని కొడుతుంటాడట. ముందుగా ఈ సీన్‌ని ఓ హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌కి అప్పగించాడట జక్కన్న. అయితే ఆయన తీసిన సీన్.. జక్కన్నకు నచ్చలేదట. దీంతో ఆ ఫైట్ సీన్‌ని స్టంట్ మాస్టర్ సాల్మాన్‌కు అప్పగించాడట.సాల్మాన్ చేస్తాడో లేదో అనే అనుమానంతోనే ఆయనకు ఇస్తే.. అద్భుతంగా షూట్ చేసి జక్కన్నను ఇంప్రెస్ చేశాడట. దాదాపు నెల రోజుల పాటు కష్టపడి టెస్ట్ షూట్ చేసి రాజమౌళికి చూపించాడట. అది నచ్చడంతో ఆ సీన్ షూట్‌ని సాల్మన్‌కి అప్పగించాడట. దాదాపు 2000 మంది ఉన్న ఈ సీన్ సినిమాకు హైలెట్ అవుతుందని జక్కన్న చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ అరెస్ట్ సీనే... సినిమాకు హైలెట్ అని చెప్పడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
మొహమాటం లేకుండా నన్ను విమర్శించేది ఆ ఇద్దరే : ఎన్టీఆర్
మరో వారం రోజుల్లో ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వరస ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా ప్రముఖ దర్శకుడు అలిల్ రావిపూడి ఆర్ఆర్ఆర్ టీమ్‌ని ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. చరణ్‌తో తనకు చాలా ఏళ్లుగా స్నేహంబంధం ఉందని చెప్పారు. ఈ విషయం ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డామని, కానీ ఒక్క రాజమౌళికి తెలియడంతో ఈ సినిమా తీశారని చెప్పుకొచ్చారు. అలాగే చిత్ర పరిశ్రమలో తనకు దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరు? ఎవరితో ఎక్కువ స్నేహ బంధం ఉంది అనే విషయాలను తెలియజేస్తూ.. ‘ఎలాంటి మొహమాటం లేకుండా నన్ను విమర్శించే వ్యక్తులు ఇద్దరే ఇద్దరు. వారిలో ఒకరు మానాన్న (హరికృష్ణ). రెండోది రాజమౌళి. నేను కెరీర్ పరంగా ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం జక్కన్ననే’అని తారక్ ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో పక్కనే ఉన్న చరణ్.. తారక్ కెరీర్లో భారీ విజయాలు సాధించిన సినిమాల్లో జక్కన్నవే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కాగా, రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్లో స్టూడెంట్ నెం.1(2001), సింహాద్రి(2003), యమదొంగ(2007), ఆర్ఆర్ఆర్ చిత్రాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. -
తెలుగు స్పీచ్ అదరగొట్టిన అలియా.. ట్రైలర్ పగిలిపోయిందంటూ కామెంట్
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను ఏర్పాటు చేశాయి. జక్కన్న చెక్కిన మరో విజువల్ వండర్ని ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో చూద్దామా అని సినీ ప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో ఆర్ఆర్ఆర్ టీమ్ ప్రమోషన్స్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ముంబై, బెంగళూరు సిటీల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన చిత్రబృందం.. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చడించింది. ఈ ప్రెస్మీట్లో బాలీవుడ్ భామ అలియా భట్ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేముందు ఆమె తెలుగులో మాట్లాడింది ‘అందరికి నమస్కారం. బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పగిలిపోయింది కదా.. ముంబైలో మాకు పిచ్చెక్కిపోయింది’అని అలియా అనగా.. ఆడిటోరియం విజిల్స్‌తో మారుమోగిపోయింది. కాగా, ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా సీత పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ కోసం ఆమె తెలుగు నేర్చుకుంది. ఏడాది పాటు ఓ ట్యూటర్ని పెట్టుకొని తెలుగు మాట్లాడడం నేర్చుకుంది. -
‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు
Chiranjeevi Interesting Comments On RRR Movie Trailer: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌లు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్`. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రయూనిట్ గురువారం విడుదల చేసింది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలో ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్ ఆద్యంతం అదరహో అనేలా సాగింది. ఈ ట్రైలర్‌పై సామాన్యుల నుంచి సెలబ్రెటీలు వరకు స్పందిస్తున్నారు. చదవండి: RRR Movie Trailer: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ అదరహో..యాక్షన్ సీక్వెన్స్ సూపర్బ్! మతిపోతోంది రాజమౌళి సార్ అంటూ సెలబ్రెటీలంతా ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సైతం తాజాగా ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌పై స్పందించాడు. రామ్ చరణ్ షేర్ చేసిన ట్రైలర్ పోస్ట్‌పై చిరంజీవి వెంటనే రీట్విట్ చేస్తూ.. ‘ఈ ట్రైలర్ బీభత్సాన్ని సృష్టించింది.. ఇక ప్రభంజనం కోసం జనవరి 7వ తేదీ వరకూ ఎదురుచూస్తుంటాను’ అంటూ ఆసక్తికర కామెంట్ చేశాడు. కాగా ఆర్ఆర్ఆర్ మూవీ 2022 జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోన్న సంగతి తెలిసిందే. RRR Trailer బీభత్సం ...ఇక ప్రభంజనం కోసం జనవరి 7 వరకు ఎదురుచూస్తుంటాను. — Chiranjeevi Konidela (@KChiruTweets) December 9, 2021 -
RRR Movie :అదిరిపోయే అప్డేట్, ఫస్ట్ సాంగ్ డేట్ ఫిక్స్, సింగర్స్ వీరే
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్ చిత్ర ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఇక ఈ సినిమా నుండి ఏమైన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వస్తాయాని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఆర్ఆర్ఆర్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సినిమా తొలి పాటను ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆగస్ట్ 1న ఉయదం 11గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీమ్ ట్విటర్ వేదికగా తెలియజేస్తూ.. కీరవాణి బృందానికి చెందిన ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది. కాగా, ప్రమోషన్లో భాగంగా‘ఆర్ఆర్ఆర్ థీమ్ సాంగ్’ పేరిట చిత్రబృందం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నారనే విషయం తెలిసిందే. ‘దోస్త్’ అంటూ సాగే ఈ థీమ్ సాంగ్‌లో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొనగా, రీసెంట్‌గానే హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో ఈ పాటను చిత్రీకరించారని సమాచారం. ఆగస్ట్ 1న ఈ పాటను విడుదల చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన ఫోటోలో ఈ ప్రత్యేక పాటను ఎవరు ఆలపిస్తున్నారో కూడా తెలియజేశారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హేమచంద్ర, అనిరుధ్ రవిచందర్, విజయ్ ఏసుదాసు, అమిత్ త్రివేది, యాజిన్ నైజర్ ఆ పాటను ఆలపించినట్లు ఫోటో ద్వారా తెలియజేశారు. స్నేహం విలువని తెలియజేసే గీతమిదని చిత్రబృందం . ఈ పాన్ ఇండియా చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. The First Song from #RRRMovie on August 1st, 11 AM.🤝#Dosti #Natpu #Priyam 🔥🌊 An @mmkeeravaani Musical.🎵 🎤@itsvedhem @anirudhofficial @ItsAmitTrivedi @IAMVIJAYYESUDAS #YazinNizar@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @LahariMusic @TSeries pic.twitter.com/dyBaFxQPxt — RRR Movie (@RRRMovie) July 27, 2021 -
ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై ‘డాక్టర్ బాబు’.. ఇదేం వాడకం బాబోయ్
RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ (రౌధ్రం రణం రుధిరం) చిత్రం నుంచి మంగళవారం ఓ కొత్త పోస్టర్ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ బండి నడుపుతుంటే.. రామ్ చరణ్ వెనకాల కూర్చొని చిరనవ్వులు చిందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. అంతేకాదు ఈ పోస్టర్‌పై ఇప్పటికే రకరకాల మీమ్స్ వస్తున్నాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అయితే రామ్ చరణ్, ఎన్టీఆర్లకు హెల్మెట్ పెట్టి.. ఈ పోస్టర్ని ప్రమోషన్ కోసం వాడేశాడు. దీనిపై ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా స్పందించింది. మీరు పెట్టిన కాప్షన్ పర్ఫెక్ట్గా లేదు. బండికి నంబర్ ప్లేట్ మిస్సయింది అంటూ ట్రాఫిక్ పోలీసులు ట్విట్‌కి రిప్లై ఇచ్చింది. ఇక నెట్టింట ఏది వైరల్ అయినా.. కార్తీకదీపం సీరియల్‌తో ముడిపెట్టే నెటిజన్స్.. ఆర్ఆర్ఆర్ కొత్త పోస్టర్ని‘డాక్టర్ బాబు’కోసం వాడేశారు. డాక్టర్ బాబు బుల్లెట్ తోలుతుంటే.. వెనుక దీపతోపాటు మోనిత కూడా కూర్చుని ఉన్నట్టుగా మీమ్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ప్రస్తుతం ఈ మీమ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక దీనిపై డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్ పరిటాల కూడా స్పందించాడు. ఈ మీమ్‌ని తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘ఇలాంటి పోస్టర్ని ఎలా చేసార్రా బాబూ.. నాకు ఈ ఘోరానికి ఎలాంటి సంబంధం లేదు’ అని కామెంట్ పెట్టాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికొస్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల భారీ మల్టీస్టారర్ చిత్రమిది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. ఒలివియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్ అంతా పూర్తయింది. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల మందుకు రానుంది. చదవండి: 'ఆర్ఆర్ఆర్' పోస్టర్‌ను మార్ఫింగ్ చేసిన డేవిడ్ భాయ్.. తారక్‌గా కేన్ మామ ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై ట్రాఫిక్ పోలీసుల సెటైర్.. టీమ్ ఫన్నీ రిప్లై -
ఆర్ఆర్ఆర్ ఉగాది సర్ప్రైజ్: నవ్వులు చిందిస్తున్న చెర్రీ,ఎన్టీఆర్
రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్ఆర్ఆర్) నుంచి ఉగాది సర్ప్రైజ్ వచ్చేసింది. రామ్ చరణ్, ఎన్టీఆర్‌కు సంబంధించిన కొత్త పోస్టర్ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ని కొంతమంది ఎత్తుకొని పైకి విసురుతూ సందడి చేస్తుండగా, ఇద్దరు హీరోలు చాలా సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్, కొమురంభీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. చెర్రీతో ఆలియా భట్ జోడీ కడుతుండగా తారక్‌కు జంటగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటించనున్నారు. అజయ్ దేవ్గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు . ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ ‘భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం' వీడియోలు రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దసరా కానుకగా, అక్టోబర్ 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. Wishing everyone a prosperous year ahead.. 💛💛💥 #ఉగాది#ಯುಗಾದಿ #GudiPadwa #नवसंवत्सर #தமிழ்ப்புத்தாண்டு #വിഷു #ਵੈਸਾਖੀ #RRRMovie @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies @PenMovies @LycaProductions pic.twitter.com/oHSlYWozNR — RRR Movie (@RRRMovie) April 13, 2021 -
ఫస్ట్‌కాల్ రామ్ చరణ్ నుంచే వచ్చింది: శర్వానంద్
‘‘శ్రీకారం’ కథ విన్నప్పుడు ఒక బాధ్యతగా ఈ సినిమా చేయాలనిపించింది. ఎందుకంటే ఇలాంటి కథలు మళ్లీ మళ్లీ రావు. ఈ సినిమా చేసినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా’’ అని శర్వానంద్ అన్నారు. శర్వానంద్, ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరో హీరోయిన్లుగా కిశోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్రీకారం’. గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో శర్వానంద్ మాట్లాడుతూ – ‘‘మాది రైతు కుటుంబమే. లాక్డౌన్ లో ఓ మూడు నెలలు నేను మా పొలం దగ్గరే గడిపాను. ‘శ్రీకారం’ సినిమా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. ఫస్ట్‌కాల్ నాకు చరణ్ (హీరో రామ్‌చరణ్) నుంచి వచ్చింది. వ్యవసాయాన్ని చులకనగా చూస్తున్నారు. చదువుకున్నవారు వ్యవసాయం చేస్తే టెక్నాలజీని ఊపయోగించి మరింత బాగా చేస్తారు’’ అని అన్నారు. ‘‘ప్రతి ఒక్కరూ తమ కథను తాము స్క్రీన్ పై చూసుకుంటున్నట్లుగా ఫీలై థియేటర్స్ నుంచి బయటకు వస్తారు’’ అని దర్శక, రచయిత కిశోర్ అన్నారు. ‘‘డైలాగ్స్ పెద్ద ఎస్సెట్. దర్శకుడిగా కిశోర్‌కు మంచి భవిష్యత్తు ఉంది’’ అని నిర్మాత గోపీ అన్నారు. ‘‘మంచి కథలనే ఎంచుకునే ఓ అరుదైన నటుడు శర్వానంద్. భూమికీ, మనిషికీ మధ్య ఉన్న ప్రేమకథే ‘శ్రీకారం’ సినిమా. ఈ భూమి మీద పైసా కూడా దోచుకోలేనిది ఒక్క రైతు మాత్రమే’’ అని అన్నారు డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా. ‘‘ప్రతి ఒక్కరూ తమ కుటుంబంతో వెళ్లి ఈ సినిమాను చూడండి’’ అన్నారు ప్రియాంకా అరుళ్ మోహనన్. -
యాక్షన్ సీన్ కోసం 50 రోజులు నైట్ షూట్
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. తాజాగా 50 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఇందుకు సంబంధించిన షూటింగ్ అంతా రాత్రి వేళలోనే జరిగింది. త్వరలోనే మరో షెడ్యూల్‌ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ట్వీట్ చేసింది. ‘గుడ్‌బై వింటర్ నైట్స్.. ప్రధాన యాక్షన్ సీక్వెన్స్ షెడ్యూల్ కోసం దాదాపు 50 రోజులు నైట్ షూట్ చేశాం. ఇప్పుడు కొత్తది మొదలవబోతోంది. ఈ కొత్త షెడ్యూల్ అద్భుతమైన ప్రదేశాల్లో తెరకెక్కనుంది’ అంటూ సెట్స్‌ని కూల్చివేస్తున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది ఆర్ఆర్ఆర్ టీమ్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాకుండా, రే స్టీవెన్సన్, అల్లిసన్ డూడీ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వారు మిస్టర్ అండ్ మిసెస్ స్కాట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. (చదవండి: చలి చంపుతుంటే...!) Goodbye winter nights!!!🥶 Wrapped up a major action sequence schedule after almost 50 days of night shoot...🔥🌊 Andddd nowww... Gearing up for a new schedule in some exotic locations :) #RRRMovie pic.twitter.com/MZnoQ0PcgN — RRR Movie (@RRRMovie) November 30, 2020 డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రియ, అజయ్ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సెంథిల్ కెమెరామేన్. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదలకానుంది. -
ఆర్ఆర్ఆర్ టీజర్‌పై సీతక్క ట్వీట్
తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. బాహుబలి వరుస హిట్స్ అనంతరం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం అభిమానలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య పోరాట యోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుండగా.. మన్యంపులి కొమురం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొమురం భీం జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్‌పై ఓ టీజర్‌ను విడుదల చేసింది. రామ్ చరణ్ వాయిస్ ఇచ్చిన ఈ టీజర్లో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో ఒదిగిపోయాడు. [ చదవండి : ఆర్ఆర్ఆర్ టీజర్: ఇవన్నీ ఇప్పటికే చూసేశాం, ఆ అగ్నిపర్వతం ఆ ఛానల్‌లోదే ] అభిమానుల భారీ అంచనాల నడుము విడుదలైన ఈ టీజర్‌పై పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు సైతం చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. దీనిలో భాగంగానే ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు సీతక్క సైతం ట్విటర్ వేదికగా స్పందించారు. కొమురం భీం పాత్రపై విడుదల చేసిన టీజర్‌ను జోడిస్తూ ఆర్ఆర్ఆర్ మూవీ టీంకు అభినందనలు తెలిపారు.‘మన్యం ముద్దుబిడ్డ. మా అన్న, మా ఆదర్శం కొమరం భీమ్ గారి జయంతిన నా ఘన నివాళులు. మా వీరుడు మన్యం పులి కొమరం భీమ్ గారి స్పూర్తితో తీస్తున్న చిత్ర యూనిట్ కి నా అభినందనలు’ అని ట్వీట్ చేశారు. 🔸మన్యం ముద్దుబిడ్డ 🔸మా అన్న, మా ఆదర్శం కొమరం భీమ్ గారి జయంతిన నా ఘన నివాళులు. 🔸మా వీరుడు మన్యం పులి కొమరం భీమ్ గారి స్పూర్తితో తీస్తున్న చిత్ర యూనిట్ కి నా అభినందనలు @ssrajamouli @AlwaysRamCharan @tarak9999 #seethakka #ntr #ramcharan #rajamouli #RRRMovie pic.twitter.com/tUqsK34dyW — Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) October 22, 2020 -
ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉంటారు చిరంజీవి
‘‘సముద్రమంత లోతున్న మంచితనం, శిఖరమంత ఎత్తున్న గొప్పతనం.. నా జీవితంలో మంచికీ చెడుకి మధ్య నిల్చున్న వ్యక్తి చిరంజీవి’’ అన్నారు దర్శకుడు రాఘవేంద్రరావు. చిరంజీవి జీవితంపై సీనియర్ జర్నలిస్ట్ వినాయకరావు రచించిన ‘మెగాస్టార్– ది లెజెండ్’ పుస్తకాన్ని ‘కళాబంధు’ టి.సుబ్బిరామిరెడ్డి ఆవిష్కరించి, దర్శకుడు రాఘవేంద్రరావుకి తొలి ప్రతిని అందజేశారు. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘హిమాలయాలంత ఎత్తుకి ఎదిగినా ఒదిగే ఉంటారు చిరంజీవి. అందుకే ఆయన 40 ఏళ్లుగా స్టార్‌గా ఉన్నారు. మరో 20 ఏళ్లు కూడా ఉంటారు’’ అన్నారు. ‘‘మొదటి 3–4 ఏళ్లే మేమిద్దరం బావ–బామ్మర్దిగా ఉన్నాం. ఆ తర్వాత స్నేహితుల్లా ప్రయాణించాం. చిరంజీవిగారితో నాది 40ఏళ్ల ఏమోషనల్ జర్నీ. కష్టపడే తత్వానికి నిదర్శనం ఆయన’’ అన్నారు అల్లు అరవింద్. ‘‘ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి జీవితాన్ని పుస్తకంగా మలచడానికి నా శాయశక్తులా ప్రయత్నించాను. ఈ పుస్తకం వెనుక మూడేళ్ల ప్రయాణం ఉంది’’ అన్నారు వినాయకరావు. ‘‘చిన్నతనంలో నాన్న ఎంత కష్టపడి పని చేసేవారో చూసే అవకాశం మాకు దొరికేది కాదు. ఇప్పటికీ మాకు ఏం అందించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ పుస్తకం ద్వారా నాన్నకు మరింత దగ్గరవుతాను అనుకుంటున్నాను. వినాయకరావుగారికి మా కుటుంబం, అభిమానులందరి తరఫున ధన్యవాదాలు’’ అన్నారు రామ్‌చరణ్. మురళీమోహన్, దర్శకుడు బి.గోపాల్, వీవీ వినాయక్, స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మరీ ముసలోడిలా కనిపిస్తున్నానా?: రామ్‌చరణ్
ఈ రోజు కొత్తింట్లోకి షిఫ్ట్ అవుతున్నారు చెర్రీ అండ్ ఫ్యామిలీ! కొత్తిల్లు అంటే పూర్తిగా కొత్త అని కాదు. ఫ్యామిలీ అంటే చెర్రీ, ఉపాసన మాత్రమే కాదు. మొత్తం మెగా ఫ్యామిలీ.. పెద్ద సెలబ్రేషన్‌తో.. రీమోడలింగ్ చేసిన ఇంట్లోకి వచ్చేస్తోంది. మతాబుల్లాంటి పిల్లలు.. స్టార్స్‌లా వెలుగుతున్న పెద్దలు కలిసి సాయంత్రం దీపావళిని జరుపుకోబోతున్నారు. ఈ సందర్భంగా.. ‘సాక్షి’... రామ్‌చరణ్‌ని కలిసింది. కొత్తింట్లోకి వెళ్లడానికి ముందే చెర్రీనిమీ ఇంటికి తీసుకొచ్చింది! హ్యాపీ దీపావళి. ‘సైరా’ నిర్మాతగా మీ అనుభవాలను షేర్ చేసుకోండి. నిర్మాత అనే ట్యాగ్‌ను నేనింకా యాక్సెప్ట్ చేయలేదు. ‘సైరా’ సినిమాను నేను నిర్మాతగా చేయలేదు. నాన్నగారి ఆలోచనకు చిన్న ఎక్స్‌టెన్షనే నిర్మాత అనే పాత్ర. ఆయన కలకి ఎక్స్టెన్షన్. కానీ ‘సైరా’ టీమ్‌లో పని చేసిన వాళ్లందరూ ‘చరణ్ బెస్ట్ ప్రొడ్యూసర్’ అని చెబుతున్నారు.. ఈ సినిమా ప్రీ–ప్రొడక్షన్, రెండు ఎపిసోడ్లకే(సుమారు 20 నిమిషాల నిడివి) 75 కోట్లు అయిపోయింది. వేరేవాళ్లైతే సినిమాను ఆపేస్తారు. నేను కూడా ఆపాలనే చూశాను. ఆపడం వల్ల వచ్చే నష్టమేంటి? కొనసాగించడంలో ప్లస్ ఏంటి? అని చూసుకున్నాం. ‘చిరంజీవిగారి సినిమా బడ్జెట్ సమస్యల వల్ల ఆగిపోయింది’ అనే మాట నేను పడకూడదు. ఆయన 30 ఏళ్ల కెరీర్లో ఇదో బ్లాక్మార్క్లా ఉండిపోతుంది. ఈ సినిమాకు లాభాలు రాకపోయినా నేను నిర్మాతగా ఫెయిల్ అవ్వను కానీ ఈ సినిమా ఆగిపోతే కొడుకుగా, మనిషిగా, నిర్మాతగా నేను ఫెయిల్ అయినట్టే. అందుకే దిగిపోయాం కాబట్టి చేసేద్దాం అని, పూర్తి చేశాం. నేనీ సినిమా లాభాల కోసం చేయలేదు అని చాలా సందర్భాల్లో చెప్పాను. నాన్న కోసమే ఈ సినిమా చేశాను. ఇక ముందు కూడా చేస్తాను. నిర్మాతంటే అనుకున్నదాంట్లో చేయాలి. మేం అనుకున్నదానికంటే లిమిట్ దాటేశాం. అందుకే నన్ను నేను పూర్తి స్థాయి నిర్మాతగా చూసుకోను. నాన్నగారి డ్రీమ్ సినిమా (సైరా) తీయాలని మీరెప్పుడనుకున్నారు? ‘ఖైదీ నంబర్ 150’ తర్వాతే. నెక్ట్స్ ఏం సినిమా చేయాలి? అని ఆలోచిస్తూ ఉంటే ‘ఒక కథ ఉందిరా అని ఆయన చెప్పారు, ఆ కథంతా విన్న తర్వాత చేయాలనుకున్నాను. ఏ నిర్మాతయినా నాన్నగారితో 7–8 నెలల్లో సినిమా తీసి ఏ పండగకో రిలీజ్ చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అనుకుంటారు. అటూ ఇటు అయినా ఫర్వాలేదు అనుకోవాలి. అంత ప్యాషనేట్‌గా ఫ్యామిలీ వాళ్లే తీయగలరు. అప్పట్లో అల్లు అరవింద్‌గారు నాతో ‘మగధీర’ సినిమాను చాలా ప్యాషనేట్‌గా నిర్మించారు. అందుకే ‘సైరా’ని నేను ప్యాషనేట్‌గా తీయాలనుకున్నాను. ‘నా సినిమా కలెక్షన్లను ఇక మీదట సినిమా పోస్టర్స్ మీద వేయను’ అని ఆ మధ్య అన్నారు. ఎందుకా నిర్ణయం? మంచిదే కదా. మేం చెప్పకపోయినా మార్కెట్, ట్రేడ్‌లో తెలుస్తూనే ఉంటుంది కదా. వెబ్సైట్లు ఉంటాయి. నేనొక్కడినే మాట్లాడకపోవడం వల్ల ఆగుతుందా? అఫీషియల్‌గా పోస్టర్స్ మీద ఉండవంతే. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడైనా సినిమా పోస్టర్స్‌లో ఆర్టిస్టులను, టైటిల్స్ మాత్రమే చూసాం. కేవలం మన ఇండియాలోనే పోస్టర్స్ మీద నంబర్స్ (సినిమా కలెక్షన్లు) వేస్తుంటాం. అది బిజినెస్‌కి సంబంధించినది. ఆర్ట్‌కి, ఆర్టిస్ట్‌కి సంబంధించినది కాదు. ‘రంగస్థలం’ సమయంలో మా అభిమానులకు, మహేశ్ అభిమానులకు సోషల్ మీడియాలో కలెక్షన్ల విషయంలో చిన్న గొడవలు ఏర్పడ్డాయి. నిజమైన నంబర్స్ ఏంటో మాకే తెలియదు. నిర్మాతలు ఇచ్చే నంబర్స్ కరెక్టా, ఫ్యాన్స్ వేసే నంబర్స్ కరెక్టా అనేది అర్థం కావడం లేదు. మంచి సినిమా తీశాం. హ్యాపీగా ఉన్నాం. మహేశ్ మంచి సినిమాలు తీస్తున్నాడు. అతను హ్యాపీగా ఉన్నాడు. ఇది కట్ చేయాలని అనుకున్నాను. పోస్టర్స్ మీద కలెక్షన్లను వేయడం ఆపేద్దాం అని నిర్ణయం తీసుకున్నాను. ఇండస్ట్రీలో నంబర్ గేమ్ కూడా కీలకమే కదా. అవును. కానీ పోస్టర్స్ మీద కలెక్షన్లు రావడం కాదు కదా? మేం కష్టపడిందంతా కొంతమంది అభిమానులు ఓవర్ షాడో చేసేసి, మా ఎఫర్ట్‌ని మించిపోయి గొడవలు ఎక్కువవుతున్నాయి. నేను అందరితో బావుంటాను. ఫ్యాన్ వార్స్ వల్ల మా మధ్య ఉన్న ఆ అనుబంధం మిస్ అవుతుందేమో అనిపిస్తుంది. అందుకే సినిమా చేశామా.. అక్కడితో చాప్టర్ క్లోజ్ అయిపోవాలి. ‘మా ఫ్యాన్స్ కోసం పోస్టర్ వేయండి’ అని నేను నా నిర్మాతను రెచ్చగొడితే ఎంతసేపు? ఈ బోర్డ్‌లో ‘చెర్రీ మామ, అన్నయ్యా యూ ఆర్ బెస్ట్’ అని ఉంది. పిల్లలు (చెల్లెళ్లు సుస్మిత, శ్రీజల కూతుళ్లు, బాబాయి నాగబాబు కూతురు నిహారిక, పవన్ కల్యాణ్ కుమార్తె ఆద్య) అందరూ వస్తారు. బోర్డ్ మీద వాళ్లకు తోచింది రాస్తుంటారు. చిన్న పిల్లలు కదా.. వాళ్లకు వచ్చిందే బెస్ట్, గుడ్ అనే పదాలు. నీహా (నిహారిక) ఏవేవో రాస్తుంటుంది (నవ్వుతూ). ‘నిన్ను డైరెక్ట్ చేయాలనుంది’ అని రాసింది ఆద్యా. పవన్ కల్యాణ్ గారి అమ్మాయి. తనకి డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. నన్ను హీరోగా పెట్టి సినిమా చేస్తానంటుంది. నేను ఆఫీస్‌లో లేనప్పుడు వస్తే. ఆ రోజుకి వాళ్లకి ఏది అనిపిస్తే అది రాస్తారు. నేను వచ్చినప్పుడు చూస్తాను. ఎన్టీఆర్‌గారితో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు. మీరిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఈక్వేషన్ కుదిరిందా? ఏమో. కథ వల్ల మాత్రం మేం దగ్గరవ్వలేదు. మేం ఫస్ట్ నుంచి దగ్గరగానే ఉన్నాం. రాజమౌళిగారు అలా ఆలోచించరు. కథకు మేం సూట్ అయ్యాం కాబట్టి మమ్మల్ని తీసుకున్నారు. వీళ్లిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి వీళ్లను పెడదాం అని అనుకోలేదు. కెరీర్ మొదట్లో (మగధీర) చేశారు. మళ్లీ ఇప్పుడు చారిత్రాత్మక సినిమా చేస్తున్నారు. ఎలా అనిపిస్తోంది? కెరీర్ స్టార్టింగ్‌లోనే పది సినిమాల అనుభవాన్ని నాకిచ్చారు రాజమౌళిగారు. హెవీ డ్రామా ఉన్న సినిమా అది. నాకు చాలా హెల్ప్ అయింది ఆ సినిమా. ఒకవేళ నాకు ‘మగధీర’ ఇప్పుడు ఇచ్చి ఉంటే ఇంకా బాగా చేసేవాణ్ణేమో. ‘ఆర్ఆర్ఆర్’లోనూ హెవీ డ్రామా ఉంటుంది. అద్భుతమైన అవకాశం. ఈ సినిమాలోని అల్లూరి సీతారామారాజు పాత్ర కోసం కొంచెం సన్నబడ్డాను. ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో ఉన్నారు. మాల వేసుకోవడం ఎలా అలవాటైంది? నాన్నగారు ఒకసారి నన్ను శబరిమల తీసుకెళ్లారు. 14 ఏళ్లప్పుడు అనుకుంటాను. ఆ తర్వాత నాన్న మాల వేసుకున్నప్పుడు ఒంట్లో బాగోలేకపోతే, ఆయన ఇరుముడిని కుటుంబ సభ్యులు శబరిమల తీసుకెళితే చాలన్నారు. దాని వల్ల రెండోసారి వేసుకున్నాను. నా టీనేజ్‌లో గ్యాప్ ఇచ్చి ‘చిరుత’ సినిమా తర్వాత నుంచి వేసుకుంటున్నాను. ఇది పదమూడోసారి. మాకున్న అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ స్టయిల్లో అయ్యప్ప మాల వేసుకుంటే బాగున్నట్లు ఉంటుంది అయ్యప్ప దీక్ష వల్ల ఆలోచనా విధానం మారుతుందా? కచ్చితంగా. మాలలో ఉన్న 40–45 రోజులు మాత్రం క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఫ్రెష్‌గా ఉంటాం. ‘మనం ఏం తింటున్నామో అదే మనం’ అనే సామెత ఉంటుంది. ప్రతి 3 నెలలకు మన బాడీ మారిపోతుంటుంది. తినేటప్పుడు ఎంత స్వచ్ఛంగా ఉంటామో ఈ 45 రోజుల్లో అంతే స్వచ్ఛంగా ఉంటాం. అది సరిగ్గా వర్ణించలేను. డీటాక్స్లాగా అనుకోండి. ఆయుర్వేదిక్ సెంటర్‌కి వెళ్ళినట్టు. మొత్తం కొత్త మనిషిలా మారిపోతాం. 24 గంటల్లో 18 గంటలు పని చేసినా మనకు అలుపు రాదు. ఏదైనా సంవత్సరం మాల వేసుకోవడానికి కుదరకపోతే? వెలితి అనిపిస్తుంది. సంక్రాంతి తర్వాత, నా పుట్టిన రోజుకి (మార్చి 27) లేకపోతే ఏడాది చివర్లో వేసుకుంటాను. ఈరోజు దీపావళి పండగ. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? చిన్నప్పటి నుంచి బాంబులు ఎక్కువ కాల్చేవాణ్ణి కాదు. భయంతో కాదు. పెద్దగా ఆసక్తి లేదు. కూర్చుని చూస్తుంటాను. అల్లు అర్జున్ బాగా కాల్చేవాడు. శిరీష్ వీళ్లంతా కాల్చుతుంటే చూస్తుంటా. నేను వాళ్లకు క్రాకర్స్ అందిస్తుంటాను. ఫ్యామిలీ అందరూ కలిసి ఒకేచోట ఉండటం చాలా ఇష్టం. దానికోసం ఎక్కువ ఎదురుచూస్తూ ఉంటాను. మీ అక్కాచెల్లెళ్లు, తమ్ముళ్లు.. ఇలా ఇల్లంతా చాలా సందడిగా ఉంటుందేమో? చాలా ఎక్కవమంది అయిపోయారు. (నవ్వుతూ). ఈసారి దీపావళి కొత్త ఇంట్లో చేసుకుంటున్నాం. మా ఇంటిని రీమోడలింగ్ చేయించాం. త్వరగా అయిపోతుందనుకున్నాం కానీ చాలా టైమ్ పట్టేసింది. దీపావళికి కొత్త ఇంట్లోకి వెళ్లిపోతున్నాం. సంక్రాంతి లోపల పూర్తిగా కొత్త ఇంట్లోకి మారిపోతాం. మీకు పిలల్లెప్పుడు? మరీ ముసలోడిలా కనిపిస్తున్నానా? నేను ఫాదర్‌లా అనిపించినప్పుడు ఆలోచిస్తా. ఈ మధ్య ఓ సందర్భంలో నిర్మాత డబ్బులిచ్చేంత వరకూ డబ్బులు అడగను. చరణ్ కూడా అలానే చేస్తున్నాడు అని మీ నాన్నగారు చెప్పారు. మీకు ఫలానా సినిమా చేస్తానని అడ్వాన్సులు తీసుకోను. సినిమా చేసేటప్పుడు నెల ఖర్చులకు మాత్రమే డబ్బు తీసుకుంటాను. అది నాకు ఎప్పటి నుంచో అలవాటు. నేనెప్పుడూ నమ్మిన ప్రొడ్యూసర్స్తోనే చేస్తాను. నమ్మిన వాళ్లతో చేస్తున్నప్పుడు వాళ్లు ఎక్కడికి వెళ్లిపోతారు? వాళ్ల ఆఫీస్‌లు, బిజినెస్‌లు అన్నీ ఇక్కడే. ఎక్కడికి పారిపోతారు. ఆ నమ్మకం నాకుంది. నేనెక్కువగా దానయ్యగారు, తిరుపతి ప్రసాద్, గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీస్, నాగబాబుగారు, దత్‌గారు వీళ్ళతోనే చేశాను. నెలనెలా ఇంత జీతం అని తీసుకోవడం వల్ల వాళ్ల వడ్డీలు ఎక్కువ అవ్వవు. సేఫ్‌గా ఉంటారు. రిలీజ్‌కి మూడు రోజుల ముందు బిజినెస్ ముగుస్తుంది. అప్పుడే తీసుకుంటాను. ఈ పద్ధతిని ఎప్పుడు అలవాటూ చేసుకున్నారు? నాన్నగారి దగ్గర కూడా అడ్వాన్స్ కాన్సెప్ట్ ఎక్కువ ఉండేది కాదు. వాళ్లు బలవంతంగా ఇస్తే తప్ప. ఆయన కూడా ఆయనకు ఇష్టమైన నిర్మాతలకే చేశారు. నేను కూడా ఈ సిస్టమ్‌కు అలవాటి పడిపోయాను. – డి.జి. భవాని -
టెన్ డేస్ బ్రేక్... సైరా
ఇప్పుడంటే బ్రాండెడ్ బట్టలు, బోలెడన్ని డిస్కౌంట్లు, ఫెస్టివల్ బంపర్ ఆఫర్లు ఉన్నాయి. కానీ, 30 ఏళ్ల క్రితం సీన్ వేరు. బ్రాండెడ్ ఉన్నప్పటికీ.. అందరికీ అందుబాటులో ఉండేవి కావు. ముఖ్యంగా పల్లెల్లో నేత దుస్తులే వాడేవారు. ఇప్పుడు టాప్ టు బాటమ్ బ్రాండెడ్ వేర్ వాడుతున్న రామ్‌చరణ్ నేత దుస్తుల గురించి తెలుసుకుంటున్నారు. ఒక్కసారి ఇన్సెట్లో ఉన్న ఫొటో చూడండి! పోగు.. పోగు కలిపి నేత బట్టలను ఇలా నేస్తారా? అని రామ్‌చరణ్ తెలుసుకుంటున్నట్లు ఉంది కదా! ఇది ‘రంగస్థలం’ సినిమా కోసం అని ఊహించే ఉంటారు. 1985 బ్యాక్‌డ్రాప్‌లో సుకుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం తాజా స్టిల్ ఇది. అదిరింది కదూ. ఇంతకీ ‘రంగస్థలం’ ఎందాకా వచ్చిందంటే.. ప్రస్తుతం ప్యాచ్‌వర్క్ జరుగుతోంది. హైదరాబాద్‌లో వేసిన విలేజ్ సెట్లో చిత్రీకరిస్తున్నారు. వచ్చే సోమవారం వరకూ ఈ షూట్ జరుగుతుంది. ఆ తర్వాత చిన్న బ్రేక్. టెన్ డేస్ రామ్‌చరణ్ వేరే సిన్మా ప్లాన్స్‌తో బిజీగా ఉంటారు. అంటే... ఇంకో సినిమా ఏమైనా కమిట్ అయ్యారనుకుంటున్నారేమో? హీరోగా కమిట్ అయ్యారు కానీ, ఈ బిజీ మాత్రం నిర్మాతగా. చిరంజీవి ‘సైరా’ ఈ నెల 6న ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసమే టెన్ డేస్ బ్రేక్. ‘రంగస్థలం’ కెమెరామేన్ రత్నవేలు ‘సైరా’కి కూడా వర్క్ చేయనున్నారు. పది రోజులు షూట్ తర్వాత ‘సైరా’కి చిన్ని బ్రేక్. వెంటనే ‘రంగస్థలం’ మొదలవుతుంది. ఆ షెడ్యూల్లో చిత్రీకరించే మూడు పాటలతో సినిమాకి గుమ్మడికాయ కొట్టేస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ఆది పినిశెట్టి నటిస్తోన్న విషయం తెలిసిందే. చరణ్‌కి బ్రదర్‌గా నటిస్తున్నారని వార్త షికారు చేస్తోంది. ‘అది నిజమే. ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ సూపర్’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
చరణ్ సినిమాలో అనుపమకు నో ఛాన్స్
ధృవ లాంటి బిగ్ హిట్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఓ డిఫరెంట్ సినిమాలో నటించనున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ లవ్ స్టోరికి ఓకె చెప్పాడు. ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. 90లలో జరిగే ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హీరోయిన్గా ఎవరిని ఫిక్స్ చేయాలన్న విషయంలో చిత్రయూనిట్ ఆలోచనలో పడింది. ముందుగా రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తుందన్న వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం రాశీపై ఫోటో షూట్ కూడా చేసిన యూనిట్ ఆమెను పక్కన పెట్టేశారు. తరువాత 'అ..ఆ..', 'ప్రేమమ్' సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుపమ పరమేశ్వరన్‌ను ఈ సినిమాకు హీరోయిన్గా తీసుకుంటున్నారన్న వార్త వినిపించింది. చాలా రోజులుగా ఈ సినిమాలో అనుపమనే హీరోయిన్ అన్న ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు కాదన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి హీరోయిన్ ఎంపిక జరగలేదని త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడిస్తామన్నారు యూనిట్. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి వరుస సూపర్ హిట్స్ అందించిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.