RRR Promotions: NTR Arrest Scene Is Highlight Of RRR Movie, Rajamouli Says - Sakshi
Sakshi News home page

RRR Director Rajamouli: ఆ సీన్‌ సినిమాకే హైలైట్‌.. జక్కన్న మాటలతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ!

Published Thu, Mar 24 2022 12:30 PM | Last Updated on Thu, Mar 24 2022 1:33 PM

NTR Arrest Scene Is Highlight Of RRR Movie, Rajamouli Says - Sakshi

Rajamouli Reveals Interesting News On RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌... ఇప్పుడే దేశమంతా ఈ సినిమా గురించే చర్చిస్తోంది.యావత్ సినీ అభిమానులందరు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా  ఎట్టకేలకు ఈ శుక్రవారం (మార్చి 25) థియేటర్లలో  సందడి చేయనుంది.ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ వరుస ఇంటర్వ్యూలతో సినిమాకు భారీ హైప్‌ తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌తో పాటు దర్శకుడు రాజమౌళి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు.గత వారం రోజుల నుంచి గ్యాప్‌ లేకుండా...దేశమంతా తిరుగుతూ ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి ప్రచారం చేశారు. ప్రతి ఈవెంట్‌లోనూ ఏదో ఒక ఆసక్తికర విషయాలను తెలియజేస్తూ...ఆర్‌ఆర్‌ఆర్‌పై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

తాజాగా ‘అర్జున్‌రెడ్డి’ఫేమ్‌ సందీప్‌ రెడ్డి ఇంటర్వ్యూలో పాల్గొన్న జక్కన్న...ఆర్‌ఆర్‌ఆర్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్‌ మ్యాటర్‌ని రివీల్‌ చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ అరెస్ట్‌ సీన్‌.. అదిరిపోయేలా ఉంటుందట. కొమరంభీమ్‌(ఎన్టీఆర్‌)ను బ్రిటీష్‌ అధికారిగా ఉన్న అల్లూరి(రామ్‌ చరణ్‌)అరెస్ట్‌  చేసే సన్నివేశంలో ఓ 1000 మంది దొమ్మి తరహాలో కొంటుకుంటూ ఉంటారు. వారిని చెదరగొట్టడానికి రామ్‌ చరణ్‌ లాఠీతో అందరిని కొడుతుంటాడట. ముందుగా ఈ సీన్‌ని ఓ హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌కి అప్పగించాడట జక్కన్న. అయితే ఆయన తీసిన సీన్‌.. జక్కన్నకు నచ్చలేదట. దీంతో ఆ ఫైట్‌ సీన్‌ని స్టంట్‌ మాస్టర్‌ సాల్మాన్‌కు అప్పగించాడట.సాల్మాన్‌ చేస్తాడో లేదో అనే అనుమానంతోనే ఆయనకు ఇస్తే.. అద్భుతంగా షూట్‌ చేసి జక్కన్నను ఇంప్రెస్‌ చేశాడట. దాదాపు నెల రోజుల పాటు కష్టపడి టెస్ట్‌ షూట్‌ చేసి రాజమౌళికి చూపించాడట. అది నచ్చడంతో ఆ సీన్‌  షూట్‌ని సాల్మన్‌కి అప్పగించాడట. దాదాపు 2000 మంది ఉన్న ఈ సీన్‌ సినిమాకు హైలెట్‌ అవుతుందని జక్కన్న చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్‌ అరెస్ట్‌ సీనే... సినిమాకు హైలెట్‌ అని చెప్పడంతో నందమూరి అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement