RRR First Song Dosti: RRR First Song Release Date Announced, Sung With 5 Singers in 5 Languages - Sakshi
Sakshi News home page

RRR Movie :అదిరిపోయే అప్‌డేట్‌, ఆ సింగర్స్‌ వీరే

Published Tue, Jul 27 2021 11:23 AM | Last Updated on Tue, Jul 27 2021 12:36 PM

RRR Movie First Lyrical Song Release Date Announced - Sakshi

దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ల భారీ మల్టీస్టారర్‌ చిత్ర ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న  ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ దాదాపు పూర్తయ్యింది. 

ఇక ఈ సినిమా నుండి ఏమైన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్ వ‌స్తాయాని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ సినిమా తొలి పాటను ఫ్రెండ్‌షిప్‌ డే సందర్భంగా ఆగస్ట్‌ 1న ఉయదం 11గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ట్విటర్‌ వేదికగా తెలియజేస్తూ.. కీరవాణి బృందానికి చెందిన ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది. 

కాగా, ప్రమోషన్‌లో భాగంగా‘ఆర్‌ఆర్‌ఆర్‌ థీమ్‌ సాంగ్‌’ పేరిట చిత్రబృందం ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నారనే విషయం తెలిసిందే. ‘దోస్త్‌’ అంటూ సాగే ఈ థీమ్‌ సాంగ్‌లో చిత్ర యూనిట్ స‌భ్యులంద‌రూ పాల్గొన‌గా, రీసెంట్‌గానే హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఈ పాట‌ను చిత్రీక‌రించారని సమాచారం. ఆగస్ట్‌ 1న  ఈ పాటను విడుదల చేయనున్నారు. తాజాగా విడుదల చేసిన ఫోటోలో ఈ ప్రత్యేక పాటను ఎవరు ఆలపిస్తున్నారో కూడా తెలియజేశారు. తెలుగు, తమిళ్‌, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రూపొందుతుండటంతో ఒక్కో భాషలో ఒక్కో సింగర్‌తో ఈ పాటని పాడించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. హేమచంద్ర, అనిరుధ్‌ రవిచందర్‌, విజయ్‌ ఏసుదాసు, అమిత్‌ త్రివేది, యాజిన్‌ నైజర్‌ ఆ పాటను ఆలపించినట్లు ఫోటో ద్వారా తెలియజేశారు. స్నేహం విలువని తెలియజేసే గీతమిదని చిత్రబృందం . ఈ పాన్‌ ఇండియా చిత్రం అక్టోబర్‌ 13న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement