RRR Movie Press Meet: Alia Bhatt Speaks Superb Telugu - Sakshi
Sakshi News home page

RRR: తెలుగులో మాట్లాడిన అలియా.. పిచ్చెక్కిపోయిందంటూ కామెంట్‌

Published Sat, Dec 11 2021 2:05 PM | Last Updated on Sat, Dec 11 2021 3:52 PM

RRR Press Meet: Alia Bhatt Spok In Telugu - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’మూవీ వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలను ఏర్పాటు చేశాయి. జక్కన్న చెక్కిన మరో విజువల్‌ వండర్‌ని ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో చూద్దామా అని సినీ ప్రియులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ ప్రమోషన్స్‌ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ముంబై, బెంగళూరు సిటీల్లో ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేసిన చిత్రబృందం.. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చడించింది.

ఈ ప్రెస్‌మీట్‌లో బాలీవుడ్‌ భామ అలియా భట్‌ కూడా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె తెలుగులో మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేముందు ఆమె తెలుగులో మాట్లాడింది ‘అందరికి నమస్కారం. బాగున్నారా? నేను చాలా  బాగున్నాను. ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ పగిలిపోయింది కదా.. ముంబైలో మాకు పిచ్చెక్కిపోయింది’అని అలియా అనగా.. ఆడిటోరియం విజిల్స్‌తో మారుమోగిపోయింది. కాగా, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అలియా సీత పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ కోసం ఆమె తెలుగు నేర్చుకుంది. ఏడాది పాటు ఓ ట్యూటర్‌ని పెట్టుకొని తెలుగు మాట్లాడడం నేర్చుకుంది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement