ఆర్‌ఆర్‌ఆర్‌ ఉగాది సర్‌ప్రైజ్‌: నవ్వులు చిందిస్తున్న చెర్రీ,ఎన్టీఆర్‌‌ | RRR Movie Ugadi Special Look Poster Out | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ ఉగాది సర్‌ప్రైజ్‌ మాములుగా లేదుగా

Published Tue, Apr 13 2021 10:51 AM | Last Updated on Tue, Apr 13 2021 12:30 PM

RRR Movie Ugadi Special Look Poster Out - Sakshi

రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్) నుంచి ఉగాది సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌కు సంబంధించిన కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ని కొంతమంది ఎత్తుకొని పైకి విసురుతూ సందడి చేస్తుండగా, ఇద్దరు హీరోలు చాలా సంతోషంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 

పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురంభీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. చెర్రీతో ఆలియా భట్‌ జోడీ కడుతుండగా తారక్‌కు జంటగా హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరిస్‌ నటించనున్నారు. అజయ్ దేవ్‌గన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు . 

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ ‘భీం ఫర్ రామరాజు', ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీం' వీడియోలు రికార్డులు క్రియేట్‌ చేయడంతో పాటు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. దసరా కానుకగా, అక్టోబర్ 13వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement