యాక్షన్‌ సీన్‌ కోసం 50 రోజులు నైట్‌ షూట్‌ | RRR Team Wraps Up Epic Action Sequence in 50 Days | Sakshi
Sakshi News home page

భారీ యాక్షన్‌ షెడ్యూల్‌ పూర్తి చేసిన ఆర్‌ఆర్‌ఆర్‌

Published Mon, Nov 30 2020 5:10 PM | Last Updated on Mon, Nov 30 2020 6:32 PM

RRR Team Wraps Up Epic Action Sequence in 50 Days - Sakshi

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. తాజాగా 50 రోజుల భారీ యాక్షన్ షెడ్యూల్‌ని పూర్తి చేసుకుంది. ఇందుకు సంబంధించిన షూటింగ్‌ అంతా రాత్రి వేళలోనే జరిగింది. త్వరలోనే మరో షెడ్యూల్‌ని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ట్వీట్‌ చేసింది. ‘గుడ్‌బై వింటర్‌ నైట్స్‌.. ప్రధాన యాక్షన్‌ సీక్వెన్స్‌ షెడ్యూల్‌ కోసం దాదాపు 50 రోజులు నైట్‌ షూట్‌ చేశాం. ఇప్పుడు కొత్తది మొదలవబోతోంది. ఈ కొత్త షెడ్యూల్‌ అద్భుతమైన ప్రదేశాల్లో తెరకెక్కనుంది’ అంటూ సెట్స్‌ని కూల్చివేస్తున్న వ్యక్తులకు సంబంధించిన వీడియోను షేర్‌ చేసింది ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాకుండా, రే స్టీవెన్సన్, అల్లిసన్ డూడీ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వారు మిస్టర్ అండ్ మిసెస్ స్కాట్ పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. (చదవండి: చలి చంపుతుంటే...!)

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రియ, అజయ్‌ దేవగన్, సముద్రఖని ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సెంథిల్‌ కెమెరామేన్‌. ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదలకానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement