బిగ్‌ సర్‌ప్రైజ్‌, ఆచార‍్యలో అనుష్క స్పెషల్‌ రోల్‌! | Is Anushka Shetty Playing a Cameo In Chiranjeevi Acharya Movie | Sakshi
Sakshi News home page

Acharya Movie: బిగ్‌ సర్‌ప్రైజ్‌, ఆచార‍్యలో కనిపించనున్న అనుష్క శెట్టి!

Published Wed, Apr 27 2022 9:23 PM | Last Updated on Wed, Apr 27 2022 9:30 PM

Is Anushka Shetty Playing a Cameo In Chiranjeevi Acharya Movie - Sakshi

Anushka Shetty Playing Special Role In Acharya: మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తాజాగా నటించిన చిత్రం ‘ఆచార్య’. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్న ఈచిత్రంపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఇక పలు వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇంకా విడుదలకు రెండు రోజుల ఉండగా ప్రేక్షకులకు బిగ్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తూ ఓ ఆసక్తికర అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఇందులో హీరోయిన్‌గా చేసిన కాజల్‌ను తొలిగించిన విషయం తెలిసిందే.

చదవండి: హిందీ భాషపై సంచలన వ్యాఖ్యలు, అజయ్‌, సుదీప్‌ మధ్య ట్వీట్ల వార్‌

దీనికి బదులుగా ఓ సీన్‌ కోసం స్టార్‌ హీరోయిన్‌ అనుష్కను తీసుకున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. కాస్తా గ్లామర్‌ టచ్‌ కోసం చిత్రం బృందం ఓ అతిథి పాత్రకు అనుష్క శెట్టిని స్పంద్రించినట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క ఓ స్పెషల్‌ సాంగ్‌ లేదా ముఖ్య పాత్రలో కనిపించనుందని ఫిలీం దునియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే మూడేళ్లుగా అనుష్క వెండితెరకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన రీఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆమె ఫ్యాన్స్‌. ఈ నేపథ్యంలో అనుష్క అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు చిత్రం బృందం ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిందట.

చదవండి: నేరుగా ఓటీటీలో విడుదల కానున్న నాని సినిమా!, ఎక్కడంటే..

ఇదే నిజమైతే ఆచార్య చూసేందుకు థియేటర్‌కు వచ్చిన స్వీట్‌ ఫ్యాన్స్‌కు ఇది పెద్ద సర్‌ప్రైజ్‌ అనే చెప్పాలి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఏప్రిల్‌ 29 తేదీవరకు వేచి చూడాలి. కాగా ఆచార్య మూవీ ప్రమోషన్‌ భాగంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న డైరెక్టర్‌ కొరటాల ఈ మూవీ నుంచి కాజల్‌ను తీసేశామని స్పష్టత ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘‘ఆచార్య’పాత్రకు లవ్‌ ఇంట్రస్ట్‌ ఉంటే బాగుంటుందా? లేదా? అనే డౌట్‌ వచ్చింది. అదే సమయంలో కరోనా లాక్‌డౌన్‌ వచ్చింది. అప్పుడు బాగా ఆలోచించాను. నక్సలిజం సిద్ధాంతాలు ఉన్న వ్యక్తికి లవ్‌ ఇంట్రస్ట్‌ పెడితే బాగోదని ఉద్దేశించి ఆమెను తొలగించాం’’ అని తెలిపాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement