
మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ లెజెండ్.

తనదైన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.

అప్పట్లోనే చిరంజీవి నటించని హీరోయిన్ లేదంటే అతియోశక్తి కాదేమో.

తాజాగా ఆయనకు ఏఎన్నార్ జాతీయ పురస్కారం వరించింది.

అయితే ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌గా ఆమె తల్లి కూడా మెగాస్టార్ సరసన నటించింది.

ఆమె తమిళ, మలయాళం సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుందామె.

ఆమె తెలుగులో ఓకే ఒక్క చిత్రంలో కనిపించింది.

అదే మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం పున్నమినాగు.

ఈ సినిమాలో చిరు సరసన కీర్తి సురేశ్ మదర్ మేనక సురేశ్ హీరోయిన్‌గా నటించారు.

గతేడాది 'భోళా శంకర్' ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్ ఈ విషయం గురించి రివీల్ చేసింది.

'పున్నమినాగు' సినిమా గురించి అమ్మ చాలా విషయాలు చెప్పిందని తెలిపింది.

షూటింగ్ సెట్‌లో మెగాస్టార్ సలహాలు, సూచనలు ఇచ్చేవారట.

చిన్న పాపకి చెప్పినట్లు అన్ని విషయాలు చెప్పారట.

ఇదే విషయం చిరంజీవితో చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ సర్ ప్రైజ్ చేసిందని కీర్తి చెప్పుకొచ్చింది.

భోళాశంకర్ మూవీలో చిరంజీవికి చెల్లిగా కీర్తి సురేశ్ నటించిన సంగతి తెలిసిందే.