ఒలింపిక్ క్రీడాకారులకు మెగాస్టార్‌ అభినందనలు.. వినేశ్‌ పోగాట్‌పై ప్రశంసలు! | Megastar Chiranjeevi Congratulates Olympics Winners and participants | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: 'నువ్వు నిజమైన ఫైటర్'.. వినేశ్‌ పోగాట్‌పై మెగాస్టార్ ప్రశంసలు!

Published Sat, Aug 10 2024 9:15 PM | Last Updated on Sun, Aug 11 2024 11:51 AM

Megastar Chiranjeevi Congratulates Olympics Winners and participants

ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు మెగాస్టార్ అభినందనలు తెలిపారు. అలాగే ఇండియా తరఫున పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న  117 మంది క్రీడాకారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మెడల్స్ సాధించిన వారిపై ప్రశంసలు కురిపించారు. మనూభాకర్, సరబ్‌జీత్‌ సింగ్‌, నీరజ్ చోప్రా, స్వప్నిల్ కుశాలే, అమన్ షెరావత్‌, ఇండియా హాకీం టీమ్‌ను అభినందించారు. వినేశ్‌ ఫొగాట్‌ నీవు నిజమైన పోరాట యోధురాలివంటూ కొనియాడారు. ఈ సందర్భంగా వారి ఫోటోలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ఈ ఏడాది పారిస్ ఒలింపిక్స్‌ చూసేందుకు చిరంజీవి తన ఫ్యామిలీతో కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. 
 
ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్‌ హీరోయిన్లుగా కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న సంక్రాంతి కానుకగా  ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement