అయోధ్య చేరుకున్న మెగాస్టార్ దంపతులు | Megastar Chiranjeevi Off To Ayodhya With His Wife and Son Ram Charan | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: ప్రత్యేక విమానంలో అయోధ్యకు వెళ్లిన చిరంజీవి, చరణ్‌..

Published Mon, Jan 22 2024 8:45 AM | Last Updated on Mon, Jan 22 2024 10:40 AM

Megastar Chiranjeevi Off To Ayodhya With His Wife and Son Ram Charan - Sakshi

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు హాజరు కానున్నారు. 500 ఏళ్లనాటి భారతీయుల కల సాకారమవుతున్న వేళ.. ‍అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. ఇలాంటి మహత్తర కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న చిరంజీవి, సురేఖ దంపతులు, గ్లోబల్‌ స్టార్ రామ్ చరణ్‌  ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారు. మధ్యాహ్నం.. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మెగాస్టార్ కుటుంబం పాల్గొననుంది. మెగాస్టార్, రామ్ చరణ్ అయోధ్యకు పయనమైన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

కాగా.. ఇప్పటికే అయోధ్య ఆహ్వానం రావడాన్ని తన పూర్వ జన్మ సుకృతమని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. నా ఆరాధ్య దైవం హనుమంతుడు నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లుగా భావిస్తున్నానని చిరంజీవి తన్మయత్వానికి లోనయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement