'మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు'.. మెగాస్టార్ ట్వీట్! | Megastar Chiranjeevi Congratulates Grammy Award Winners | Sakshi
Sakshi News home page

Megastar Chiranjeevi: ఆయనతో నాకు వ్యక్తిగత అనుబంధం: మెగాస్టార్

Published Thu, Feb 8 2024 9:20 PM | Last Updated on Fri, Feb 9 2024 7:43 AM

Megastar Chiranjeevi Congratulates Grammy Award Winners - Sakshi

ఇటీవల ప్రకటించిన ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డుల్లో శక్తి బ్యాండ్‌ సత్తాచాటింది. ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు 2024లో ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌ నగరంలో ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్‌ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్‌ చౌరాసియా, గాయకుడు శంకర్‌ మహదేవన్, వయోలిన్‌ కళాకారుడు గణేశ్‌ రాజగోపాలన్, డ్రమ్స్‌ కళాకారుడు సెల్వగణేశ్‌ వినాయక్‌రామ్‌ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్‌ హుస్సేన్‌కు మొత్తం మూడు, రాకేశ్‌ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం.   

‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్‌లో విడుదల చేసిన ‘దిస్‌ మూమెంట్‌’ అనే ఆల్బమ్‌కు గాను శంకర్‌ మహాదేవన్, గణేశ్‌ రాజగోపాలన్, సెల్వగణేశ్‌ వినాయక్‌రామ్, జాకీర్‌ హుస్సేన్‌కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్‌ మూమెంట్‌’ ఆల్బమ్‌కు గాను శక్తి బృందం ‘బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్‌ హుస్సేన్‌కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఫెర్ఫార్మెన్స్‌(పాష్తో), బెస్ట్‌ కాంటెపరరీ ఇన్‌స్ట్రుమెంటల్‌ ఆల్బమ్‌(యాజ్‌ వీ స్పీక్‌)  కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్‌ వీ స్పీక్‌ ఆల్బమ్‌లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. 

మెగాస్టార్ ప్రశంసలు..

తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి వారికి అభినందనలు తెలిపారు. గ్రామీ అవార్డులతో మువ్వన్నెల భారతజెండా మరింత ఎత్తుకు ఎగురుతుందని అన్నారు. 'గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ గెలుచుకున్న అద్భుతమైన  శక్తి టీమ్‌కు  హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా శంకర్‌ మహదేవన్‌తో నాకు వ్యక్తిగత అనుబంధం ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన నా కోసం అద్భుతమైన పాటలు పాడారు. మీరు మా అందరికీ గర్వకారణం, మీ అద్భుతమైన విజయాలు కోట్లాది మంది భారతీయులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని మెగాస్టార్ ఆకాక్షించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement