Grammy
-
'మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు'.. మెగాస్టార్ ట్వీట్!
ఇటీవల ప్రకటించిన ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డుల్లో శక్తి బ్యాండ్ సత్తాచాటింది. ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు 2024లో ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్‌కు మొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్‌లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్‌కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్రామ్, జాకీర్ హుస్సేన్‌కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్‌కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్(యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్‌లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. మెగాస్టార్ ప్రశంసలు.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వారికి అభినందనలు తెలిపారు. గ్రామీ అవార్డులతో మువ్వన్నెల భారతజెండా మరింత ఎత్తుకు ఎగురుతుందని అన్నారు. 'గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ గెలుచుకున్న అద్భుతమైన శక్తి టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా శంకర్ మహదేవన్‌తో నాకు వ్యక్తిగత అనుబంధం ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన నా కోసం అద్భుతమైన పాటలు పాడారు. మీరు మా అందరికీ గర్వకారణం, మీ అద్భుతమైన విజయాలు కోట్లాది మంది భారతీయులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని మెగాస్టార్ ఆకాక్షించారు. The Indian flag 🇮🇳 flies high at the #GRAMMYs Joining the party a bit late, but Hearty Congrats to the amazing Team #Shakti for winning the ‘Global Music Album of the year’! Kudos to Ustad @ZakirHtabla , @Shankar_Live #SelvaGanesh , #GaneshRajagopalan for seizing ‘This… — Chiranjeevi Konidela (@KChiruTweets) February 8, 2024 -
చెమట, స్టెరాయిడ్స్ బాధలతో సొంత కాస్మొటిక్ బ్రాండ్: ఈమె తొలి గ్రామీ విన్నర్ కూడా!
2024 గ్రామీ అవార్డుల్లో మన భారతీయ సంగీత దిగ్గజాలకు చెందిన దిస్ మూమెంట్ (శక్తి ఆల్బమ్) అవార్డు గెల్చుకోవడం విశేషంగా నిలిచింది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, పలువురు లెజెండ్స్ కూడా జాకీర్ హుస్సేన్, శంకర్‌మహదేవన్ బృందంపై ప్రశంసలు కురిపించారు. అంతర్జాతీయ వేదికపై తమదైన ముద్ర వేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. దిగ్గజ స్వరకర్త, రవిశంకర్ మన దేశానికి తొలి గ్రామీ అవార్డును అందించిన ఘనతను సాధించారు. మరి గ్రామీ అవార్డును గెలుచుకున్న తొలి మహిళ ఎవరో తెలుసా? ఇపుడిదే నెట్టింట ఆసక్తి కరంగా మారింది. మరి ఆమె ఎవరు? ఏ విభాగంలో గ్రామీ గెల్చుకుంది అనే వివరాలను ఒకసారి చూద్దాం. 25 ఏళ్లకేగ్రామీ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ మహిళ, చెన్నైకి చెందిన గాయని తన్వీషా. 2010లో లాస్ ఏంజిల్స్‌లోని స్టేపుల్స్ సెంటర్లో జరిగిన 52వ గ్రామీ అవార్డుల్లో ఆమె ఈ అవార్డును గెల్చుకున్నారు. బాలీవుడ్ మూవీ స్లమ్‌డాగ్ మిలియనీర్ పాట " జై హో "కోసం స్పానిష్ సాహిత్యాన్ని అందించినందుకు ఉత్తమ పాట అవార్డు దక్కించుకున్నారు. ప్రముఖ గాయకుడు, స్వరకర్త, AR రెహమాన్, గీత రచయిత గుల్జార్‌తో అవార్డును పంచుకుంది. ఈ అవార్డు తన్వి కెరీర్‌కు పెద్ద మైలురాయిగా నిలిచింది. గ్రామీతో పాటు, ఆమె లండన్‌లో 2009లో BMI అవార్డును కూడా అందుకుంది. తన్వీషా డిసెంబర్ 1, 1985న తమిళనాడులో జన్మించింది. చాలా తక్కువ వ్యవధిలో భారతీయ సంగీత పరిశ్రమలో బాగా పాపులర్ అయిన తన్వీషా అనుకోకుండా సింగర్‌గా మారింది. రెహమాన్‌తో యువ మూవీ ‘ఫనా’తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత మాత్రమే సంగీతంలో శిక్షణ తీసుకొని మరింత రాటు దేలింది. తమిళం, హిందీ , తెలుగు భాషల్లో ప్రముఖ గాయనిగా పేరు తెచ్చుకుంది. ఎళుతు చిత్రం కోసం "యక్కై తిరి" మొదలు ఫనా, పప్పు కాన్ట్ డ్యాన్స్, రెహ్నా తూ, బూమ్ బూమ్ రోబోడా, మవ్వాలి కవ్వాలి, కేదా కారి లాంటి పాటలతో బాగా పేరు తెచ్చుకుంది. అలాగే స్పానిష్ , పోర్చుగీస్ భాషలతో పాటు అరబిక్‌లో కూడా పాడింది. గ్రామీ అవార్డు తరువాత యువన్ శంకర్ రాజా , అమిత్ త్రివేది లాంటి దిగ్గజ సంగీత దర్శకుల వద్ద అవకాశాలు దక్కించుకుంది. అంతేకాదు అనేక అంతర్జాతీయ వేదికలపై కూడా మెరిసింది. ఐకానిక్ అమెరికన్ రాపర్ స్నూప్ డాగ్‌తో కలిసి స్నూప్ డాగ్ మిలియనీర్ పాట, జెరెమీ హాకిన్స్, చే పోప్, డేవిడ్ బాటియో లాంటి మరెన్నో అంతర్జాతీయ ప్రాజెక్ట్‌లతో పాపులర్ అయింది. స్కిన్‌కేర్ బ్రాండ్ తాన్షా స్టూడియోస్‌కు నాంది తన్వి షా అద్భుతమైన ప్రతిభావంతులైన గాయని మాత్రమే కాదు, తాన్షా స్టూడియోస్ అనే స్కిన్‌కేర్ బ్రాండ్‌ను నిర్వహిస్తున్న వ్యాపారవేత్త కూడా. దీని వెనుక పెద్ద కారణమే ఉంది. చెమట, దుర్వాసనకు సంబంధించిన సమస్యలతో బాధపడేదట తన్వీ. దీని చికిత్సకు స్టెరాయిడ్లను వాడాలని వైద్యులు సూచించడంతో ఎలాంటి హాని లేని కొత్త బ్రాండ్ సృష్టించాలనే ఆలోచన వచ్చింది. దీంతో సహజ చర్మ సంరక్షణకోసం సల్ఫేట్లు, పారాబెన్స్, అల్యూమినియం లాంటి ప్రమాదకర రసాయనాలు లేని తాన్షాను బ్రాండ్‌ను తీసుకొచ్చింది. -
మరో మంకీపై ముచ్చటపడుతున్న సింగర్
లాస్ఏంజిల్స్: గ్రామీ అవార్డు విన్నర్, యువ పాప్ సంచలనం జస్టీన్ బీబర్వన్నీ విచిత్రమైన కోరికలు. 'సారీ' హిట్‌మేకర్ ఇప్పటికే ఓ కోతిని పెంచుకున్నాడు. కాపుచిన్ జాతికి చెందిన కోతికి 'ఓజీ మ్యాలీ' అని పేరు పెట్టి.. ఎంతో ఇష్టంగా చూసుకునేవాడు. తాను ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకెళ్లేవాడు. అలా 2013 మార్చిలో జర్మనీకి 'మ్యాలీ'తో కలిసి వెళ్తుండగా.. అటవీ అధికారులు అడ్డుకున్నారు. ఆ కోతిని అతడి నుంచి వేరుచేసి జూకు తరలించారు. అప్పటినుంచి పెట్ లేకుండా కాలం వెళ్లబుచ్చుతున్న ఈ 21 ఏళ్ల సింగర్ తాజాగా మరో కోతిని పెంచుకోవాలని భావిస్తున్నట్టు చెప్పాడు. అతని ప్రకటనపై జంతు హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. కోతిని పెంచుకోవాలన్న ఆలోచనను మానుకోవాలని సూచిస్తున్నాయి. కోతిని అతడు సరిగ్గా సంరక్షించలేడని, అందుకు బదులు ఏదైనా పెంపుడు జంతువును అతడు ఎంచుకోవచ్చునని చెప్తున్నాయి. 'మరోసారి ఇలాంటి పిచ్చి ప్రయత్నం చేయకు. నీ ప్రైవేటు నివాసంలో కోతిని పెంచుతూ దాని అవసరాల్నీ తీర్చడం అంతగా సాధ్యం కాదు. ఇది కోతికి, నీకు ప్రమాదకరం. నీ అభిమానులను కూడా ఇబ్బందిపెట్టే అంశం.' అని నార్త్ అమెరికా ప్రిమేట్ సాంచ్యురీ అలయెన్స్ (ఎన్ఏపీఎస్ఏ) ఓ ప్రకటనలో బీబర్‌కు సలహా ఇచ్చింది. బీబర్ మాత్రం తన ఓజీ మ్యాలీ దూరమవ్వడంపై బాధ వ్యక్తంచేస్తూ.. మళ్లీ దానిని ఎలాగైన తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని అంటున్నాడు. లేకపోతే మరో కోతిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటానని చెప్తున్నాడు.