jakeer hussain
-
'మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు'.. మెగాస్టార్ ట్వీట్!
ఇటీవల ప్రకటించిన ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డుల్లో శక్తి బ్యాండ్ సత్తాచాటింది. ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డులు 2024లో ఏకంగా ఐదుగురు భారత కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్ఏంజెలిస్ నగరంలో ఈ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ప్రఖ్యాత తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేశ్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వగణేశ్ వినాయక్‌రామ్‌ను గ్రామీ అవార్డులు వరించాయి. జాకీర్ హుస్సేన్‌కు మొత్తం మూడు, రాకేశ్ చౌరాసియాకు రెండు గ్రామీలు లభించడం విశేషం. ‘శక్తి’ అనే సంగీత బృందం 2023 జూన్‌లో విడుదల చేసిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్‌కు గాను శంకర్ మహాదేవన్, గణేశ్ రాజగోపాలన్, సెల్వగణేశ్ వినాయక్రామ్, జాకీర్ హుస్సేన్‌కు ఒక్కొక్కటి చొప్పున గ్రామీలు లభించాయి. ‘దిస్ మూమెంట్’ ఆల్బమ్‌కు గాను శక్తి బృందం ‘బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్’ కేటగిరీలో గ్రామీని గెలుచుకుంది. జాకీర్ హుస్సేన్‌కు దీంతోపాటు మరో రెండు గ్రామీలు దక్కాయి. బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఫెర్ఫార్మెన్స్(పాష్తో), బెస్ట్ కాంటెపరరీ ఇన్స్ట్రుమెంటల్ ఆల్బమ్(యాజ్ వీ స్పీక్) కేటగిరీ కింద రెండు గ్రామీలు ఆయన వశమయ్యాయి. పాష్తో, యాజ్ వీ స్పీక్ ఆల్బమ్‌లకు గాను చౌరాసియాకు రెండు గ్రామీలు లభించాయి. మెగాస్టార్ ప్రశంసలు.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి వారికి అభినందనలు తెలిపారు. గ్రామీ అవార్డులతో మువ్వన్నెల భారతజెండా మరింత ఎత్తుకు ఎగురుతుందని అన్నారు. 'గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్' అవార్డ్ గెలుచుకున్న అద్భుతమైన శక్తి టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. అంతే కాకుండా శంకర్ మహదేవన్‌తో నాకు వ్యక్తిగత అనుబంధం ఉన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఆయన నా కోసం అద్భుతమైన పాటలు పాడారు. మీరు మా అందరికీ గర్వకారణం, మీ అద్భుతమైన విజయాలు కోట్లాది మంది భారతీయులకు ఎంతో స్ఫూర్తినిస్తాయని మెగాస్టార్ ఆకాక్షించారు. The Indian flag 🇮🇳 flies high at the #GRAMMYs Joining the party a bit late, but Hearty Congrats to the amazing Team #Shakti for winning the ‘Global Music Album of the year’! Kudos to Ustad @ZakirHtabla , @Shankar_Live #SelvaGanesh , #GaneshRajagopalan for seizing ‘This… — Chiranjeevi Konidela (@KChiruTweets) February 8, 2024 -
మౌలిక విద్యకు మూలపురుషుడు
జాతీయ ప్రయోజనాలను కాపాడే కీలక సాధనం విద్య మాత్రమే... విద్య యజమాని... రాజకీయం సేవిక మాత్రమే అని ఘంటాపథంగా చెప్పిన విద్యావేత్త ఆయన. మౌలిక విద్యకు మూలపురుషుడిగా విఖ్యాతి పొందిన డాక్టర్ జాకీర్ హుస్సేన్ మన దేశానికి మూడో రాష్ట్రపతి. రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి ముస్లిం జాకీర్ హుస్సేన్ కావడం విశేషం. జాకీర్ హుస్సేన్ 1897 ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లో జన్మించారు. జాకీర్ హుస్సేన్ పదేళ్ల ప్రాయంలోనే ఆయన తండ్రి ఫిదా హుస్సేన్ ఖాన్ అకాల మరణం చెందారు. మరో నాలుగేళ్లకే తల్లి నాజ్నీన్ బేగం కన్నుమూశారు. జాకీర్ హుస్సేన్ బాల్యంలోనే ఆయన కుటుంబం ఉత్తరప్రదేశ్‌కు వలసపోయింది. హైదరాబాదీ జాకీర్ హుస్సేన్ ఇటావాలోని ఇస్లామియా హైస్కూల్లో జాకీర్ హుస్సేన్ ప్రాథమిక విద్య సాగింది. ఆ తర్వాత అలీగఢ్‌లోని ఆంగ్లో-మహమ్మదన్ ఓరియంటల్ కాలేజీలో (ప్రస్తుతం అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ) డిగ్రీ పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం జర్మనీ వెళ్లి, బెర్లిన్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో డాక్టరేట్ చేశారు. విద్యారంగంపై యువకుడిగా ఉన్నప్పటి నుంచే అమితమైన ఆసక్తి, తపన గల జాకీర్ హుస్సేన్, తన 23వ ఏటనే విశ్వవిద్యాలయ స్థాపనకు నడుం బిగించారు. నేషనల్ ముస్లిం వర్సిటీ పేరిట దీనిని తొలుత అలీగఢ్‌లో 1920 ఫిబ్రవరి 29న ప్రారంభించారు. ఐదేళ్ల తర్వాత దీనిని ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతానికి, మరో పదేళ్లకు అక్కడి నుంచి ఢిల్లీలోనే జామియా నగర్ ప్రాంతానికి తరలించారు. అప్పటి నుంచి ఇది జామియా మిలియా ఇస్లామియాగా మారింది. జామియా మిలియా ఇస్లామియా మూతబడే పరిస్థితుల్లో, దాని పునరుద్ధరణ కోసం జాకీర్ హుస్సేన్ జర్మనీ నుంచి భారత్ వచ్చి, ఆ వర్సిటీ వైస్‌చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు. రెండు దశాబ్దాలకుపైగా ఆ పదవిలో కొనసాగి, జామియా మిలియా ఇస్లామియా పురోగతికి దోహదపడ్డారు. నిరంతర సంస్కరణాభిలాషి స్వాతంత్య్రోద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో జాకీర్ హుస్సేన్ ఆనాటి ఉద్యమ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించేవారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా తన నేతృత్వంలోని జామియా మిలియా ఇస్లామియాలో విలువలతో కూడిన విద్యకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. మరోవైపు తాను చదువుకున్న ఆంగ్లో మహమ్మదన్ ఓరియంటల్ కాలేజీ వ్యవహారాల్లోనూ క్రియాశీలంగా వ్యవహరించేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, అలీగఢ్ ముస్లిం వర్సిటీ వైస్‌చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఎనిమిదేళ్లు ఈ పదవిలో కొనసాగాక 1956లో పదవీ విరమణ చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా అప్పటి ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. ఏడాది తర్వాత బీహార్ గవర్నర్‌గా నియమించింది. ఐదేళ్లు ఆ పదవిలో కొనసాగాక, 1962లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లకు 1967 మే 13న రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా తన తొలి ప్రసంగంలోనే ‘యావత్ భారతదేశమే నా ఇల్లు. దేశ ప్రజలే నా కుటుంబ సభ్యులు’ అని ప్రకటించి, దేశ ప్రజలను ఆకట్టుకున్నారు. అయితే, పదవి చేపట్టిన రెండేళ్లకే 1969 మే 3న జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. పదవిలో ఉండగా అస్తమించిన తొలి రాష్ట్రపతి ఆయనే. జాకీర్ సోదరులకూ భాగ్యనగరంతో బంధం జాకీర్ హుస్సేన్‌కు ఆరుగురు సోదరులు. వారిలో ముజఫర్ హుస్సేన్ హైదరాబాద్‌లోనే న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. అయితే, క్షయవ్యాధితో 28 ఏళ్ల వయసులోనే అకాల మరణం చెందారు. మరో సోదరుడు డాక్టర్ యూసఫ్ హుస్సేన్ ఖాన్ ఉస్మానియా వర్సిటీలో ఉర్దూ ప్రొఫెసర్‌గా చాలాకాలం పనిచేశారు. ఆ తర్వాత అలీగఢ్ ముస్లిం వర్సిటీ ప్రో చాన్సలర్‌గా పనిచేశారు. విద్యావేత్త అయిన జాకీర్ హుస్సేన్‌కు సాహిత్యంపై అమితాసక్తి ఉండేది. గాలిబ్ కవితా సంకలనాన్ని వెలుగులోకి తెచ్చిన ఘనత ఆయనదే. -
కోఆప్షన్ సభ్యుల ఎన్నికలో వైఎస్ఆర్సీపీ హవా
నందికొట్కూరు: పురపాలక సంఘం కో ఆప్షన్ సభ్యులుగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. శనివారం పురపాలక సంఘంలో నిర్వహించిన ఎన్నికలో కరుణరత్నమ్మ, జాకీర్ హుసేన్, మేధావి వర్గంలో కృష్ణారెడ్డిలు కోఆప్షన్ సభ్యులుగా గెలుపొందారు. పురపాలక సంఘంలోని 23వార్డుల్లో వైఎస్ఆర్సీపీ 15 గెలుపొందింది. అయితే..రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ నాయకుడిగా ఉన్న మాండ్ర శివానందరెడ్డి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ ఎన్నికల్లో కోఅప్షన్ సభ్యులుగా తన వర్గం వారిని గెలిపించుకోవాలని 7గురు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను తన వైపు తిప్పుకున్నారు. అయితే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యే ఐజయ్య మాండ్ర ఎత్తులకుపై ఎత్తులు వేశారు. మాజీ ఎమ్మెల్యే లబ్బివెంకటస్వామి వర్గానికి చెందిన టీడీపీ కౌన్సిలర్ల మద్దతుతో కోఆప్షన్ మెంబర్లుగా వైఎస్ఆర్సీపీ వర్గీయుల ఎన్నికకు మార్గం సుగమమం చేశారు. ఎన్నిక అనంతరం ఎమ్మెల్యే, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్సీపీ పురపాలక సంఘం చైర్మన్ సుబ్బమ్మ, వైస్ చైర్మన్ షేక్ అబ్దుల్ మున్నాఫ్, 2వ వార్డు గులాం మొహిద్దీన్ మగ్బూల్, వైఎస్ఆర్సీపీ 3, 4, 5, 6, 15, 18, కౌన్సిలర్లు దూదేకుల సత్తార్‌మియ్య బోయ సువర్ణమ్మ,షేక్ ముర్తుజావల్లి, సికారి నీలమ్మ,ఎస్ రామలక్ష్మమ్మ, భాస్కరరెడ్డి వైఎస్ఆర్సీపీ కోఆప్షన్ సభ్యులకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ నరసింహమార్తి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు..