టాలీవుడ్ సీనియర్ నటి ఇంట్లో శుభకార్యం.. హాజరైన మెగాస్టార్! | Megastar Chiranjeevi Attends Senior Actress Prabhas Son Marriage Ceremony, Pic Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

సీనియర్ నటి కుమారుడి పెళ్లి.. హాజరైన టాలీవుడ్ స్టార్స్!

Published Thu, Jan 4 2024 2:49 PM | Last Updated on Thu, Jan 4 2024 3:48 PM

Megastar Chiranjeevi Attended For The Marriage Ceremony - Sakshi

టాలీవుడ్  సీనియర్ నటి ప్రభ ఇంట్లో జరిగిన శుభకార్యంలో స్టార్ హీరోలు సందడి చేశారు. ఆమె కుమారుడు  రాజా రమేశ్ వివాహ వేడుకలో  మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ సందడి చేశారు.  హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు.  విజయవాడకు చెందిన సాయి అపర్ణను రాజా రమేశ్ పెళ్లాడారు.

హైదరాబాద్‌లోని గండిపేట గోల్కోండ రిసార్ట్స్‌లో వివాహా వేడుక ఘనంగా జరిగింది. ప్రభ – రమేష్ (దివంగత) దంపతుల ఏకైక కుమారుడు రాజా రమేశ్‌ అమెరికాలో స్థిరపడ్డారు. ఈ వేడుకలో చిరంజీవి, వెంకటేశ్‌తో పాటు మురళీ మోహన్, సుమన్, బోయపాటి శ్రీను, బెల్లంకొండ సురేష్ , ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి,, మోహనకృష్ణ, రేలంగి నరసింహారావు, రోజా రమణి, అన్నపూర్ణమ్మ  లాంటి ప్రముఖులు కూజా హాజరయ్యారు. 

సీనియర్ నటి ప్రభ తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏపీలోని తెనాలికి చెందిన ప్రభ 1974లో ‘నీడ లేని ఆడది’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నాలుగు భాషల్లో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించారు. సంప్రదాయ నృత్య కళాకారిణి అయిన ప్రభ సినిమాలతో పాటు సీరియల్స్ తో కూడా నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ అర్టిస్ట్‌గా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement