prabha
-
అవార్డ్ విన్నింగ్ సినిమా.. స్పందించిన నటి!
డైరెక్టర్ పాయల్ కపాడియా రూపొందించిన భారతీయ చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్'. ఈ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాంపిటీషన్లో అవార్డ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమా కూడా ఈ అవార్డును దక్కించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఓ భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును సొంతం చేసుకుంది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్ఠాత్మక పామ్ డి ఓర్ స్క్రీనింగ్ కాంపిటీషన్లో 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్' చిత్రం 'గ్రాండ్ ప్రిక్స్' అవార్డు దక్కించుకుంది.ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటి దివ్యప్రభ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో అను అనే నర్సు పాత్రలో దివ్య ప్రభ మెరిసింది. అయితే ఈ మూవీలో ఆమెకు సంబంధించిన న్యూడ్ సీన్స్‌కు సంబంధించిన క్లిప్స్ సోషల్ మీడియాలో లీకైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దివ్య ప్రభపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తాజాగా లీకైన వీడియోలపై నటి దివ్య ప్రభ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. ఈ చిత్రానికి సంతకం చేసినప్పుడే ఇలాంటి స్పందన వస్తుందని ఊహించానని తెలిపింది.దివ్య ప్రభ మాట్లాడుతూ..'ఇది నిజంగా చాలా దారుణం. నేను ఆ పాత్ర కోసం సైన్ చేసినప్పుడు కూడా కేరళలోని ఓ వర్గం ప్రజల నుంచి అలాంటి స్పందన వస్తుందని ముందే ఊహించా. ఒకవేళ ఆ పాత్రకు ఆస్కార్ వచ్చినప్పటికీ మలయాళీ మహిళలు అలాంటి పాత్రలు చేయకూడదు. ఆ లీక్ అయిన వీడియోలను షేర్ చేసిన వారు మనదేశ జనాభాలో 10 శాతం మంది ఉన్నారు. కానీ వారి మనస్తత్వం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఇలాంటి చర్యను వ్యతిరేకించే పురుషులు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నా. మలయాళీలు కూడా సెంట్రల్ ఫిల్మ్ బోర్డ్‌లో ఉన్నారు. మా చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఆమోదం లభించింది. అదే మాకు ముఖ్యం. ఒక నటిగా స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తా. ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్లో నా పాత్ర గురించి ముందే తెలుసు. కానీ కొంతమంది ఫేమ్ కోసమే చేశానని నన్ను విమర్శించారు. ఇప్పటికే అనేక అవార్డులను గెలుచుకున్నా. అలాగే విమర్శకుల ప్రశంసలు పొందిన సినిమాల్లో నటించా. ఫేమ్ కోసం నగ్నంగా నటించాల్సిన అవసరం లేదు' అని వివరించింది.కాగా.. ఈ చిత్రం నవంబర్ 22న థియేటర్లలో విడుదలైంది. ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ చిత్రంలో కని కస్రుతి, దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృధు హరూన్ ప్రధాన పాత్రలు పోషించారు. -
శివోహం..
శ్రీశైలంటెంపుల్/సాక్షి, నరసరావుపేట/రేణిగుంట(తిరుపతి జిల్లా)/నెల్లిమర్ల రూరల్/బీచ్‌రోడ్డు (విశాఖ జిల్లా): మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్రంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ప్రముఖ శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. శ్రీశైలంలో మల్లన్నకు సంప్రదాయబద్ధంగా తల పాగాలంకరణ, కోటప్పకొండలో భారీ విద్యుత్ ప్రభల ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీకాళహస్తీశ్వరాలయంలో విశేష అభిషేకాలు జరిపారు. వివిధ వాహనాలపై కొలువుతీరిన ఆది దంపతులు లక్షలాదిగా తరలివచ్చిన భక్తులను అనుగ్రహించారు... నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. స్వామి వారు నంది వాహనంపై ఊరేగారు. వివిధ జానపద కళాకారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రాత్రి 10 గంటల నుంచి స్వామివారికి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపించారు. ఆ వెంటనే మరో వైపు పాగాలంకరణ ప్రారంభమైంది. ఆలయంలోని విద్యుత్ దీపాలను ఆర్పి వేయగా.. బాపట్ల జిల్లా హస్తినాపురానికి చెందిన పృథ్వీ వెంకటేశ్వర్లు దిగంబరుడై పాగాను అలంకరించారు. పాగాలంకరణ జరుగుతున్నంత సేపు ఆలయంలో ఓం నమఃశివాయ అంటూ శివనామస్మరణ మారుమోగింది. రాత్రి 12 గంటల సమయంలో స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. పూజా కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు, శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు, జిల్లా కలెక్టర్ కె.శ్రీనివాసులు, జేసీ టీ.రాహుల్ కుమార్‌రెడ్డి, రాయలసీమ జోన్ డీఐజీ సీహెచ్.విజయరావు, ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంద్ర విమానం, చప్పరంపై స్వామివారి దర్శనం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వరాలయం శివనామస్మరణతో మార్మోగింది. తెల్లవారు జామున స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పెద్దసంఖ్యలోభక్తులు దర్శించుకున్నారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, ఆలయ ఈవో నాగేశ్వరరావు క్యూలైన్లను పర్యవేక్షించారు. కాగా ఉదయం స్వామి, అమ్మవార్లు ఇంద్ర విమానం, చప్పరంపై పురవీధుల్లో విహరించారు. రాత్రి శ్రీకాళహస్తీశ్వరుడు నంది వాహనంపై, జ్ఞానప్రసూనాంబదేవి సింహ వాహనంపై విహరిస్తూ భక్తకోటిని కటాక్షించారు. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఆలయంలో స్వామి, అమ్మవార్ల లింగోద్భవ దర్శనం(నిజరూప దర్శనం) ప్రారంభం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో దర్శనానికి బారులుతీరారు. రామతీర్థంలో శివనామస్మరణ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని వైష్ణవ పుణ్యక్షేత్రం రామతీర్థానికి శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా రాష్టం నుంచి భక్తులు పోటెత్తారు. సాక్షాత్తు శ్రీరాముడు రామక్షేత్రంలో శివుని మంత్రాన్ని జపించారన్నది భక్తుల విశ్వాసం. రామకోనేరు గట్టు, కల్యాణ మండపం, నీలాచలగిరి పరిసర ప్రాంతాల్లో కాగడాలు వెలిగించి రాత్రంతా జాగారం చేశారు. భోగాపురం, పూసపాటిరేగ, లావేరు, రణస్థలం, భీమిలి, విశాఖపట్నం ప్రాంతాల నుంచి మత్స్యకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి ప్రతిమను మధ్యలో ఉంచి చుట్టూ వృత్తంలా ఏర్పడి సంప్రదాయ బద్ధంగా నృత్యాలు చేశారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు బోడికొండ పర్వతంపై శిఖర జ్యోతిని వెలిగించారు. ఎస్పీ దీపిక పాటిల్, దేవదాయశాఖ కమిషనర్ రామ సత్యనారాయణ, తదితరులు ఉత్సవాలను పర్యవేక్షించారు. సాగర తీరంలో మహా కుంభాభిషేకం శివ నామస్మరణతో విశాఖ సాగరతీరం హోరెత్తింది. కేంద్ర మాజీ మంత్రి టి.సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో 39వ మహా కుంభాభిషేకం ఆర్కే బీచ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కుంభాభిషేకాన్ని శ్రీశారదపీఠం పీఠాధిపతులు శ్రీస్వరూపానందేంద్ర సరస్వతి, శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి, టి.సుబ్బరామిరెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు వీరభద్రస్వామి పూజ నిర్వహించారు. భక్తులకు రుద్రాక్షలు, పసుపుతాళ్లు పంపిణీ చేశారు. కోటప్పకొండలో ప్రభల ఉత్సవం పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ మహాశివరాత్రిని పురస్కరించుకుని శుక్రవారం భక్తజనసంద్రంగా మారింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు శ్రీత్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున రెండు గంటలకు బిందె తీర్థంతో స్వామి వారికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. కోటప్పకొండ ప్రత్యేకతను చాటే ప్రభల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 20 భారీ విద్యుత్ ప్రభలతో పాటు చిన్న చిన్న ప్రభలు ప్రభల నిధికి చేరాయి. ప్రభల వద్ద భక్తుల సందడితో కోలాహలం నెలకొంది. రాత్రి స్థానిక ఎమ్యెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీత్రికోటేశ్వరస్వామిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కంచిరెడ్డి సురే‹Ùరెడ్డి, బి.కృష్ణమోహన్, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రభుత్వ విప్‌లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంట్ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మురుగుడు హనుమంతురావు, వెంపాడ చిరంజివి దర్శించుకున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు, పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, జేసీ శ్యాంప్రసాద్ స్వామి వారి సేవలో పాల్గొన్నారు. -
Actress Prabha Son Marriage: టాలీవుడ్ సీనియర్ నటి ప్రభ కుమారుడి పెళ్లి.. హాజరైన మెగాస్టార్ (ఫొటోలు)
-
టాలీవుడ్ సీనియర్ నటి ఇంట్లో శుభకార్యం.. హాజరైన మెగాస్టార్!
టాలీవుడ్ సీనియర్ నటి ప్రభ ఇంట్లో జరిగిన శుభకార్యంలో స్టార్ హీరోలు సందడి చేశారు. ఆమె కుమారుడు రాజా రమేశ్ వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ సందడి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. విజయవాడకు చెందిన సాయి అపర్ణను రాజా రమేశ్ పెళ్లాడారు. హైదరాబాద్‌లోని గండిపేట గోల్కోండ రిసార్ట్స్‌లో వివాహా వేడుక ఘనంగా జరిగింది. ప్రభ – రమేష్ (దివంగత) దంపతుల ఏకైక కుమారుడు రాజా రమేశ్ అమెరికాలో స్థిరపడ్డారు. ఈ వేడుకలో చిరంజీవి, వెంకటేశ్‌తో పాటు మురళీ మోహన్, సుమన్, బోయపాటి శ్రీను, బెల్లంకొండ సురేష్ , ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి,, మోహనకృష్ణ, రేలంగి నరసింహారావు, రోజా రమణి, అన్నపూర్ణమ్మ లాంటి ప్రముఖులు కూజా హాజరయ్యారు. సీనియర్ నటి ప్రభ తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఏపీలోని తెనాలికి చెందిన ప్రభ 1974లో ‘నీడ లేని ఆడది’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. నాలుగు భాషల్లో దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించారు. సంప్రదాయ నృత్య కళాకారిణి అయిన ప్రభ సినిమాలతో పాటు సీరియల్స్ తో కూడా నటించారు. ప్రస్తుతం క్యారెక్టర్ అర్టిస్ట్‌గా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. -
ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో కోనసీమ ‘ప్రభల శకటం’
సాక్షి, న్యూఢిల్లీ, అంబాజీపేట: దేశ రాజధానిలో ఈనెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకాదశ రుద్రుల ప్రభల శకటం ఎంపికైంది. సంక్రాంతి సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే వేడుకలు, పంటలు చేతికి అందే సమయంలో రైతన్నల ఆనందోత్సాహాలను ప్రతిబింబించేలా శకటం ముస్తాబవుతోంది. కోనసీమలో కనుమ రోజు జగ్గన్నతోటలో జరిగే ఏకాదశ రుద్రుల ప్రభల చరిత్రను ప్రతిబింబించేలా శకటాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఏకాదశ రుద్రుల ప్రభల చరిత్రను వివరిస్తూ గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్ సభ్యులు రాష్ట్రపతికి లేఖ పంపారు. ప్రభల ఉత్సవంపై వారు రాసిన లేఖకు ప్రధాని మోదీ స్పందిస్తూ నాలుగు శతాబ్దాలుగా ప్రభల వేడుక నిర్వహించడం ఆనందదాయకమన్నారు. సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో గ్రామీణ ప్రాంతాలు పట్టుగొమ్మలుగా నిలుస్తున్నాయని అభినందించారు. ఇదీ విశిష్టత ఏకాదశ రుద్రులను కనుమ రోజు దర్శించుకుంటే ముక్తి కలుగుతుందని, పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఏటా సంక్రాంతి మర్నాడు అంబాజీపేట మండలం మొసలపల్లి శివారు జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థానికి 410 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. లోకకళ్యాణం కోసం పెద్దాపురం సంస్ధానాధీశుడు రాజా వత్సవాయి జగన్నాథరాజు (జగ్గన్న) హయాంలో 17వ శతాబ్ధంలో తొలిసారిగా ఇక్కడ నిర్వహించారు. ప్రభల ఉత్సవానికి మరో స్థల పురాణం కూడా ఉంది. 17వ శతాబ్ధంలో శివభక్తుడైన జగ్గన్న ఇక్కడున్న పెద్ద మర్రిచెట్టు కింద నిత్యం ధ్యానం చేసుకునేవాడట. పూజలపై పెద్దాపురం సంస్ధానాధీశులు అభ్యంతరం తెలపడంతో జగ్గన్న నేరుగా హైదరాబాద్‌లో ఉండే నవాబును కలిసి ఆయన మెప్పు పొందారట. నవాబు 8 పుట్లు (64 ఎకరాలు) భూమిని దానంగా ఇచ్చి అక్కడే శివ పూజ చేసుకునేందుకు జగ్గన్నకు అనుమతి ఇచ్చారు. కాలక్రమేణ ఆ ప్రాంతం జగ్గన్నతోటగా ప్రసిద్ధికెక్కినట్లు స్థల పురాణం చెబుతోంది. జగన్నాధ మహారాజుకు పరమేశ్వరుడు కలలో కనిపించి ప్రభల తీర్థం నిర్వహించమని, ఆదేశించడంతో జగ్గన్నతోట ప్రభల తీర్ధంగా పేరు వచ్చినట్లు ప్రచారం కూడా ఉంది. -
కోటప్పకొండలో వైఎస్సార్సీపీ ప్రభ
-
ప్రాణాలను పణంగా పెట్టి తీశాం
కీకారణ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి తగడు చిత్రాన్ని తెరకెక్కించామని ఆ చిత్ర దర్శకుడు ఎం.తంగదురై వెల్లడించారు. రాగదేవి ప్రొడక్షన్స్ పతాకంపై రాజేంద్రన్ కుప్పసామి నిర్మించిన చిత్రం తగడు. ప్రభ, అజయ్, సనంశెట్టి, దీపక్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.చార్లస్ మిల్విన్ సంగీతాన్ని, ఇళయకంభన్ పాటల్ని అందించారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఏదైనా ఒక విషయాన్ని కొత్తగా చేసి సాధించాలన్న లక్ష్యంతో తపించే ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులకు ఒక సీడీ దొరుకుతుందన్నారు. అందులోని సమాచారం ప్రకారం వివరాలు శోధించడానికి నడుం బిగించి అడవుల్లోకి వెళతారన్నారు. అక్కడ వారు ఎదుర్కొన్న సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు? వారి లక్ష్యాన్ని సాధించారా? అన్న పలు ఆసక్తికరమైన సంఘటనలతో కూడిన చిత్రం తగడు అని తెలిపారు. కారరణ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి చిత్రాన్ని పూర్తి చేశామని తెలిపారు.అయితే చిత్రం చూసిన తరువాత కష్టానికి తప్పకుండా మంచి ఫలితం దక్కుతుందనే నమ్మకం కలిగిందని, ఈ నెల 19న తగడు చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
స్త్రీలు చూడాల్సిన చిత్రం ప్రభ
చిత్రాల నిర్మాణం అన్నది ప్రవాహం లాంటిది. ఇప్పుడు వారానికి నాలుగైదు చిత్రాలు తెరపైకి వస్తున్నాయి. అయితే వాటిలో విజయం సాధించేది కొన్నే. అందులోనూ కాస్త సందేశంతో కూడిన ప్రయోజనకరమైన చిత్రాలు చాలా తక్కువగానే చెప్పాలి. అలా ఒక చక్కని ఇతివృత్తంతో కమర్షియల్ అంశాలు జోడించి రూపొందిస్తున్న చిత్రం ప్రభ అంటున్నారు. ఆ చిత్ర దర్శక నిర్మాత నందన్. దర్శకుడు ధరణి వద్ద శిష్యరికం చేసిన ఈయన తమిళ తిరై పతాకంపై సొంతంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నటి స్వాశిన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విజయ్‌రామ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో పలువురు నూతన తారాగణం నటిస్తున్నారు. రజనిపాణి, ఎస్.మురుగన్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ఎస్జే జనని సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శక, నిర్మాత తెలుపుతూ ప్రభ మహిళ ఇతివృత్తంతో రూపొందుతున్న చిత్రం అన్నారు. స్త్రీలు, తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రం ఇదని అన్నారు. స్త్రీలు సమస్యల్లో చిక్కుకున్నప్పుడు ఇతరుల సాయం కోరుతారన్నారు. అలా కాకుండా తమ సమస్యలను తామే ఎదుర్కొని పోరాడి గెలవాలని చెప్పే చిత్రం ప్రభ అని అన్నారు. నటి స్వాశిక నవనాగరికత మహిళకు ప్రతినిధిగా ప్రధాన పాత్రలో నటించారని, చిత్రంలో సాహసోపేతంగా ఫైట్స్ కూడా చేశారని తెలిపారు. ఈ చిత్రం ఆమెతో పాటు యూనిట్ అందరికీ టర్నింగ్ ఇచ్చేదిగా ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.