నిబంధనలకు నీళ్లు!
Published Wed, Dec 25 2013 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 1:55 AM
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రాస్పత్రిలోని బ్లడ్‌బ్యాంక్ (రక్తనిధి కేంద్రం) అధికారులు నిబంధనలను పట్టించుకోవడం లేదు. రక్తనిధి కేంద్రంలో రక్తం నిల్వలు ఉన్నా... బోర్డులో లేనట్టు చూపిస్తున్నారు. దీంతో కేంద్రానికి వస్తున్న రోగుల బంధువులు నిరాశతో వెనుదిరుగుతు న్నారు. వాస్తవానికి బ్లడ్‌బ్యాంక్ బోర్డులో ప్రతిరోజూ కేంద్రంలో ఉన్న రక్త నిల్వల వివరాలు గ్రూపులతో సహా పొందుపరచాలి. అప్పుడే రక్తం నిల్వల వివరాలు తెలుసుకుని రోగుల బంధువులు వాటిని తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది. కానీ అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా రు.
బోర్డులో రక్త నిల్వల వివరాలు పొందుపరచడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా కేంద్రం నుంచి రక్తం ఆక్రమంగా తరలిపోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రక్తనిధి కేంద్రంలో పదుల సంఖ్య లో బ్లడ్ ఉన్నప్పటికీ అధికారులు వాటి వివరాలు బోర్డులో పొందుపరచకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తవుతున్నాయి. ప్రభుత్వ బ్లడ్‌బ్యా ంక్ కనుక ఎక్కువ శాతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగులకు మాత్రమే రక్తం అందించాలి. కానీ ఇక్కడి అధికారులు ప్రైవేటు బ్లడ్ బ్యాం క్‌లకు ఎక్కువగా రక్తం అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నారుు. ముఖ్యంగా పట్టణంలోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి ఇక్కడి రక్తం ఎక్కువగా తరలిస్తున్నట్టు సమాచారం. రక్తం అవసరమైన వారందరికీ రక్తం ఇవ్వాల్సి ఉన్నా... అధికారులు పట్టించకోవడం లేదు.
అడిగిన వారందరికీ రక్తం ఎలా ఇవ్వగలమని బ్లడ్ బాంక్‌కు చెందిన ఓ ఉద్యోగి ప్రశ్నించడం గమనార్హం. వాస్తవానికి అవసరమైన వారందరికీ రక్తం అందించాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ శాఖ పిడి ఐదు నెలలు క్రితం ఆదేశాలు జారీ చేశారు. కానీ అవేవీ ఇక్కడ అమలు కావడం లేదు. ఈ విషయమై జిల్లా ఎయిడ్స్ నియంత్రణ శాఖాధికారి డి. సుధాకర్ పట్నాయక్ వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా రక్తం వివరాలు గ్రూపుతో సహా బోర్డులో పొందుపరచాలన్నారు. కేంద్రాస్పత్రి బ్లడ్‌బ్యాంక్‌లో వివరాలు పొందుపరచాలని పలుమార్లు అధికారులకు చెప్పామని తెలిపారు. అయినా వారి వైఖరిలో మార్పు రాలేదని, దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Advertisement
Advertisement