ఎంజీఎం, న్యూస్‌లైన్ : నాలుగు జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ధర్మాస్పత్రిలో జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు హల్‌చల్ చేశారు. ఈనెల 19న(ఆదివారం) హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆస్పత్రికి చేరుకున్న జేసీ ముందుగా అత్యవసర వార్డు, తర్వాత ఓపీ విభాగం, బ్లడ్‌బ్యాంక్, ఏఆర్‌టీ సెంటర్, ఏపీఎంఎస్‌ఐడీసీ నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు, మెడల్ డయాగ్నస్టిక్ సెంటర్‌ను పరిశీలించారు.
అనంత రం రోగులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. సాయంత్రం 6.00 గంటల తర్వాత సూపరిం టెండెంట్ చాంబర్‌లో సూపరింటెండెంట్ మనోహర్, ఆర్‌ఎంఓ నాగేశ్వర్‌రావు, హేమంత్, శివకుమార్, హెచ్‌ఓడీ కరుణాకర్‌రెడ్డి, బలరాం, డైటీషియన్ వీరమల్లు తదితరులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించారు.
ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులపై ఆగ్రహం
ఆస్పత్రిలో 1.10 కోట్లతో ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారు లు చేపట్టిన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం ఆస్పత్రిని సందర్శించినప్పుడు చేపట్టిన పనుల వివరాలు తెలుపాలని కోరారు.
ఓపీ విభాగంలో రోగుల సౌకర్యార్థం రక్త సేకరణ గదిలో చేపట్టిన టాయ్‌లెట్ల నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిన విషయాన్ని గ్రహించిన ఆమె ఈఈ దేవేందర్‌పై మండిపడ్డారు. నాసిరకంగా పనులు నిర్వహిస్తే ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆస్పత్రిలో చేపట్టిన నిర్మాణాలపై సూపరింటెండెంట్‌తో చర్చించి తుది నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
ఆస్పత్రిలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన మెడల్ డయాగ్నస్టిక్స్ నిర్వహణపై జేసీ నిప్పులు చెరిగారు. ఇన్‌పేషంట్ల రిపోర్టులు సెంటర్‌లోనే దర్శనమివ్వడం, ఈనెల 7న తీసిన స్కానింగ్ రిపోర్టులు వార్డుకు చేరకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ రోగులకు ఇచ్చిన ప్రాధాన్యం ఎంజీఎం ఇన్‌పే షంట్లకు ఇవ్వడం లేదని పలువురు రోగులతోపాటు వైద్యసిబ్బంది సైతం ఆమెకు వివరించారు.
మెడల్ నిర్వహణతీరును పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఎన్ని స్కానింగ్‌లు తీస్తున్నారో పరిశీలించాలని చెప్పారు. వేయ్యి పడకల ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న డైట్(భోజనాన్ని) ఎలా ఉంటుందని జేసీ పౌసుమిబసు సూపరింటెండెంట్ మనోహర్, ఆర్‌ఎంఓ నాగేశ్వర్‌రావు, హేమంత్, శివకుమార్‌లతోకలిసి రుచిచూశారు. డైట్‌లో అందుబాటులో ఉంచిన సరుకులను సైతం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఏడీ తీరుపై అసహనం
ఆస్పత్రి అసిస్టెండ్ డెరైక్టర్ విధులు నిర్వహిస్తున్న తీరుపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. అతను పలువురు సిబ్బం దికి సంబంధించిన సెలవులు, ఆయ సంతోషమ్మ వేతన చెల్లింపు విషయంలో అతడి ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనాథ శిశువుల తరలింపు కోసం ఐసీడీఎస్ పీడీకి ఆదేశాలు
ఎంజీఎంలో 9 మంది అనాథ శిశువులు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం మెరుగుపడడంతోపాటు సుమారు ఆరు నెలలుగా ఎంజీఎంలోనే ఉండడంతో ఆస్పత్రి సిబ్బందికి ఇబ్బంది మారింది. ఆ చిన్నారులను శిశు గృహాలకు తరలించాలని ఏన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడంతో సంబంధిత సిబ్బంది జేసీకి వివరిం చారు. దీంతో ఆమె అనాథ పిల్లలను తరలించాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఎంజీఎంలో జేసీ హల్‌చల్
Published Sat, Jan 18 2014 6:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement