నాన్న మార్గంలోనే నడుస్తా: రామ్ చరణ్ | 500 kfc employees donates bolood in chiranjeevi blood bank | Sakshi
Sakshi News home page

నాన్న మార్గంలోనే నడుస్తా: రామ్ చరణ్

Published Thu, Oct 8 2015 5:48 PM | Last Updated on Sun, Jul 14 2019 1:57 PM

నాన్న మార్గంలోనే నడుస్తా: రామ్ చరణ్ - Sakshi

నాన్న మార్గంలోనే నడుస్తా: రామ్ చరణ్

హైదరాబాద్: సేవా కార్యక్రమాల్లో నాన్న మెగా స్టార్ చిరంజీవి చూపిన మార్గంలోనే నడుస్తానని నటుడు రామ్ చరణ్ తేజ్ అన్నారు. బ్రూస్ లీ సినిమా సందేశాత్మకంగా ఉంటుందని, సినిమా విడుదలకు ఒక రోజు ముందు అంధ విద్యార్థులతో కలిసి చూడనున్నట్లు ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో కేఎఫ్సీకి చెందిన 500 మంది ఉద్యోగులు గురువారం రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాంచరణ్ మాట్లాడుతూ..ఒక సంస్థకి చెందిన ఉద్యోగులు ఇలా సేవాకార్యక్రమంలో వచ్చి పాల్గొనడం మంచి పరిణామమన్నారు.

మీ ప్రొడక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడొస్తుందన్న ప్రశ్నకి బదులిస్తూ..ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ (గబ్బర్ సింగ్ 2) సినిమాతో పవన్ బిజీగా ఉన్నారని, ఆ చిత్రం పూర్తయిన తర్వాత చూద్దామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement