దేవరాపల్లి : గుండెకు రంధ్రం పడి చావుబతుకుల్లో ఉన్న బాలికకు వైఎస్సార్‌సీపీ నాయకులు అండగా నిలిచారు. మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన కంటిపాము నాగేశ్వరరావు, అరుణ దంపతుల కుమార్తె లోహిత (9)కు చిన్నతనం నుంచే గుండెకు రంధ్రం పడడంతో ప్రస్తుతం మృత్యు ఒడిలో కొట్టుమిట్టాడుతోంది.
విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రూరల్ ప్రచార కమిటీ కన్వీనర్ పోతల ప్రసాద్ స్పందించి బాలిక శస్త్రచికిత్సకు అవసరమైన ‘ఎ’ పాజిటివ్ రక్తం 9 యూనిట్లను ఎ.ఎస్.రాజా బ్లడ్ బ్యాంక్ నుంచి సేకరించిన రక్తాన్ని తండ్రి నాగేశ్వరరావుకు సోమవారం అందజేశారు.
ఆ బాలికను ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ యువరాజ్‌తో, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలునాయుడుతో మాట్లాడామని, బాలిక వైద్యసేవలకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారని ప్రసాద్ పేర్కొన్నారు. కాగా ఈనెల 28వ తేదీన ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో బాలికకు శస్త్రచికిత్స చేయడానికి వైద్యులు అంగీకరించారని తెలిపారు.
చిన్నారి చికిత్సకు వైఎస్సార్ సీపీ చేయూత
Published Tue, Jul 22 2014 1:01 AM | Last Updated on Tue, May 29 2018 4:15 PM
Advertisement
Advertisement