ప్రభుత్వం అణచివేత ధోరణి మానుకోవాలి
► భీంభరత్‌ను విడుదల చేయాలి
► టఫ్ జిల్లా కన్వీనర్ సుగుణ
ఉట్నూర్ : ఆటపాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని క్షేత్ర స్థారుులో ప్రజల వరకు తీసుకెళ్లిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయాన్ని సీజ్ చేయడం సరికాదని, ప్రభుత్వం అణచివేత ధోరణి మానుకోవాలని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) జిల్లా కన్వీనర్ ఆత్ర సుగుణ అన్నారు. శనివారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఆటపాటల ద్వారా విమలక్క ప్రజలను చైతన్యవంతం చేసిన విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. కార్యాలయం సీజ్ చేయడాన్ని రద్దు చేస్తూ అకారణంగా అరెస్టు చేసిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కార్యదర్శి భీంభరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ నేతవత్ రాందాస్, ఆదివాసీ జిల్లాల సాధన సమితి రాష్ట్ర కో కన్వీనర్ వినాయక్‌రావ్, నాయకులు రాజేందర్, సారుుదా, ఎమ్‌ఆర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.