Bharat Bhim
-
ప్రభుత్వం అణచివేత ధోరణి మానుకోవాలి
► భీంభరత్‌ను విడుదల చేయాలి ► టఫ్ జిల్లా కన్వీనర్ సుగుణ ఉట్నూర్ : ఆటపాటల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని క్షేత్ర స్థారుులో ప్రజల వరకు తీసుకెళ్లిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయాన్ని సీజ్ చేయడం సరికాదని, ప్రభుత్వం అణచివేత ధోరణి మానుకోవాలని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్(టఫ్) జిల్లా కన్వీనర్ ఆత్ర సుగుణ అన్నారు. శనివారం స్థానిక ప్రెస్‌భవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సాధన ఉద్యమంలో ఆటపాటల ద్వారా విమలక్క ప్రజలను చైతన్యవంతం చేసిన విషయాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. కార్యాలయం సీజ్ చేయడాన్ని రద్దు చేస్తూ అకారణంగా అరెస్టు చేసిన తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ కార్యదర్శి భీంభరత్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల జేఏసీ కన్వీనర్ నేతవత్ రాందాస్, ఆదివాసీ జిల్లాల సాధన సమితి రాష్ట్ర కో కన్వీనర్ వినాయక్‌రావ్, నాయకులు రాజేందర్, సారుుదా, ఎమ్ఆర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నా భర్తను కోర్టులో హాజరు పరచండి
భీం భరత్ భార్య జ్యోతి డిమాండ్ హైదరాబాద్: తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ సభ్యుడు భీం భరత్‌ను పోలీసులు తక్షణ మే కోర్టులో హాజరుపర్చాలని ఆయన సతీమణి జ్యోతి డిమాండ్ చేశారు. దోమలగూడలోని టఫ్ కార్యాలయంలో విమలక్కతో కలసి శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజేంద్రనగర్ సమీపంలోని ఉప్పరపల్లిలో తమ ఇంటికి శుక్రవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు వచ్చి తన భర్తను బయటకు తీసుకెళ్లారని తెలిపారు. అర్ధరాత్రి దాటాక మరోసారి తలుపులు పగిలేవిధంగా చప్పుడు చేసి పోలీసులమంటూ లోపలికి వచ్చి తన చేతిలోని మొబైల్ లాక్కొన్నారని తెలిపారు. అరుణ్ అనే సంబంధం లేని పేరు ప్రస్తావిస్తూ ఇల్లంతా గాలించారని ఆమె చెప్పారు. వచ్చిన వారిలో ఒకరు తాను అచ్చంపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు అని చెప్పారని తెలిపారు. తన భర్తను తీసుకెళ్లిన పోలీసులు ఆయనకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా తక్షణమే కోర్టులో హాజరు పరచాలని ఆమె డిమాండ్ చేశారు. -
హోంమంత్రి ని కలవనున్న విమలక్క
తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ సంయుక్త కార్యదర్శి భీం భరత్ అక్రమ అరెస్ట్‌కు సంబంధించిన విషయం పై చర్చించడానికి ఈ రోజు విమలక్క తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలవనున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహించిన విమలక్క మినిస్టర్ క్వాటర్స్‌లో హోంమంత్రిని కలిసి ఈ విషయం పై చర్చించనున్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొననున్నారు.