నా భర్తను కోర్టులో హాజరు పరచండి | My husband must appear in court | Sakshi
Sakshi News home page

నా భర్తను కోర్టులో హాజరు పరచండి

Published Sun, Apr 3 2016 12:53 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

నా భర్తను కోర్టులో హాజరు పరచండి - Sakshi

నా భర్తను కోర్టులో హాజరు పరచండి

భీం భరత్ భార్య జ్యోతి డిమాండ్

 హైదరాబాద్: తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర కమిటీ సభ్యుడు భీం భరత్‌ను పోలీసులు తక్షణ మే కోర్టులో హాజరుపర్చాలని ఆయన సతీమణి జ్యోతి డిమాండ్ చేశారు. దోమలగూడలోని టఫ్ కార్యాలయంలో విమలక్కతో కలసి శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజేంద్రనగర్ సమీపంలోని ఉప్పరపల్లిలో తమ ఇంటికి శుక్రవారం రాత్రి ముగ్గురు వ్యక్తులు వచ్చి తన భర్తను బయటకు తీసుకెళ్లారని తెలిపారు.

అర్ధరాత్రి దాటాక మరోసారి తలుపులు పగిలేవిధంగా చప్పుడు చేసి పోలీసులమంటూ లోపలికి వచ్చి తన చేతిలోని మొబైల్ లాక్కొన్నారని తెలిపారు. అరుణ్ అనే సంబంధం లేని పేరు ప్రస్తావిస్తూ ఇల్లంతా గాలించారని ఆమె చెప్పారు. వచ్చిన వారిలో ఒకరు తాను అచ్చంపేట ఎస్‌ఐ వెంకటేశ్వర్లు అని చెప్పారని తెలిపారు. తన భర్తను తీసుకెళ్లిన పోలీసులు ఆయనకు ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా తక్షణమే కోర్టులో హాజరు పరచాలని ఆమె డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement