కొడుకులు గెంటేశారు.. ‘సహృదయం’ చేరదీసింది! | A mother situation in warengal | Sakshi
Sakshi News home page

కొడుకులు గెంటేశారు.. ‘సహృదయం’ చేరదీసింది!

Published Mon, Aug 7 2017 2:15 AM | Last Updated on Sun, Sep 17 2017 5:14 PM

కొడుకులు గెంటేశారు.. ‘సహృదయం’ చేరదీసింది!

కొడుకులు గెంటేశారు.. ‘సహృదయం’ చేరదీసింది!

హసన్‌పర్తి(వర్ధన్నపేట): వృద్ధాప్యంలో పోషిస్తారని కలలుకన్న ఆ తల్లిని కుమారులు ఇంట్లోనుంచి గెంటేశారు. దీంతో 30 కిలోమీటర్లు నడిచి వరంగల్‌ మహానగరం దాటాక కారు ఢీకొనడంతో ఓ చెట్టు కింద అచేతన స్థితిలో పడిపోయింది. ఓ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సాయంతో సహృదయ అనాథాశ్రమ నిర్వాహ కులు ఆమెను ఆశ్రమానికి తరలించారు.

వరంగల్‌ వెంక ట్రామ థియేటర్‌ ప్రాంతానికి చెందిన కూనమళ్ల సుగుణ, పరశురాములు దంపతులకు కుమారులు రమేశ్, సురేశ్‌ ఉన్నారు. పరశురాములు అగ్రికల్చర్‌ విభాగంలో పనిచేసేవాడు. ఐదేళ్ల ముందే ఉద్యోగం నుంచి తప్పుకొని పెద్ద కుమారుడు రమేశ్‌కు ఉద్యోగం ఇప్పించాడు. పరశురాములు మృతిచెందాక సుగుణకు ఇబ్బందులు మొదలయ్యాయి. కొడుకులు ఆమె బాగోగులు పట్టించు కోవడం మానేశారు. వారం క్రితం కొడుకులు, కోడళ్లు కలసి తనను ఇంటినుంచి వెళ్లగొట్టారని ఆ వృద్ధురాలు సుగుణ ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement