
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నించడమే నచ్చని సీఎం కేసీఆర్‌కు ఒక మహిళ పోరాటం చేస్తే నచ్చుతుందా అని వైఎస్ షర్మిల ప్రశ్నిం చారు. కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాల ని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడంపై స్పందించారు.
సీతక్క డిమాండ్‌కు ఎలాంటి పరిష్కారం చూపకుండానే ప్రభుత్వం, పోలీసులు కలిసి ఆమె దీక్షను భగ్నం చేశారని మంగళవారం షర్మిల ఆరోపించారు. దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. మహిళా వ్యతిరేకిగా పాలన కొనసాగిస్తున్న కేసీఆర్‌కు రేపు ఆ మహిళల ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమాలే బుద్ధి చెబుతాయని షర్మిల పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలపై పాలకులకు పట్టింపు లేకపోయినా, ఒక మహిళగా సీతక్క ప్రజల తరఫున నిలిచి వారి ఆరోగ్యం కోసం దీక్ష చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment