
సాక్షి, హైదరాబాద్: మణిపూర్‌లో జరుగుతున్న దారుణ ఘటనలపై ప్రధాని మోదీ తీరు బాధాకరమని ములుగు ఎమ్మెల్యే సీతక్క పేర్కొన్నారు. అక్కడ దారుణాలు జరుగుతున్నా, తనకేమీ తెలియనట్టు మాట్లాడటం శోచనీయమన్నారు.
గాంధీభవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. మణిపూర్ ఘటనపై 79రోజుల తర్వాత మోదీ మౌనం వీడారన్నారు. కుకీతెగపై దాడులు, హత్యాచారాలు బాధాకరమ ని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో రాహుల్ పర్యటనను బీజేపీ సర్కారు అడ్డుకుందని, మనదేశంలోనే జరుగుతున్న సంఘటనలా అని భయపడేట్టుగా మణిపూర్‌లో పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీవి ఓటు బ్యాంకు రాజకీయాలు. మణిపూర్ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఇదే సమయంలో డబుల్ బెడ్‌రూం సమస్య పేరుతో బీజేపీ, బీఆర్‌ఎస్ డ్రామాలకు తెరతీశాయని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment