కొత్తగూడ: ములుగు ఎమ్మెల్యే సీతక్క మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించారు. శనివారం పాఠశాలను సందర్శించిన ఆమె.. అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పదో తరగతి సాంఘిక శాస్త్రంలోని ‘ఎవరి అభివృద్ధి?’ అనే పాఠాన్ని విద్యార్థులకు బోధించారు. ప్రజల అభిప్రాయం మేరకు అభివృద్ధి సాధించినప్పుడే సమసమాజం సాధ్యమవుతుందని విద్యార్థులకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment