
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురికి చోటు కల్పించింది.
మహారాష్ట్రలోని 5 డివిజన్లకు 11 మందిని నియమించగా.. వీరిలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క ఉన్నారు. ఝార్ఖండ్‌కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు తారిక్ అన్వర్, అధిర్ రంజన్ చౌదరిని నియమించారు.
కాగా మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు ఒకే దశలో, జార్ఖండ్‌కు రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 20న మహారాష్ట్రకు, నవంబర్ 13న, 20న జార్ఖండ్‌కు ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment