కేటీఆర్.. బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేయ్: సీతక్క వార్నింగ్‌ | Minister Seethakka Warning To KTR After Visiting Rajanna Temple | Sakshi
Sakshi News home page

కేటీఆర్.. బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేయ్: సీతక్క వార్నింగ్‌

Published Thu, Jan 25 2024 9:58 AM | Last Updated on Thu, Jan 25 2024 12:40 PM

Minister Seethakka Warning To KTR After Visits Rajanna Temple - Sakshi

రాజన్న సిరిసిల్ల, సాక్షి: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తెలంగాణ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కేటీఆర్‌కు మైండ్‌ బ్లాకైందని విమర్శలు గుప్పించారు. తమ అహంకారమే బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమైందని దుయ్యబట్టారు. అధికారం లేకుండా కేటీఆర్‌ ఉండలేకపోతున్నారని, అందుకే విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. 

సిరిసిల్లలోని వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని గురువారం మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లు గడీల పాలన చేసిందని విమర్శించారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా ప్రమాణ స్వీకారం చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేసేందుకు  కేటీఆర్‌కు బుద్దుందా అని ప్రశ్నించిన సీతక్క  ఆయన కుళ్లు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

‘ప్రజలు మావైపే ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే జీర్ణించు కోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారు. సర్పంచుల వేల బిల్లులు పెండింగ్ పెట్టింది ఎవరు..? గత ప్రభుత్వం కాదా..? మేము సక్రమంగా పని చేస్తేనే మళ్ళీ అధికారం ఇస్తారు. చేయకపోతే అవకాశం ఇవ్వరు. కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేయ్. ప్రజలు గుర్తిస్తారు. లేదంటే మిమ్మల్ని ఎప్పటికీ ప్రజలు తిరస్కరిస్తూనే ఉంటారు.

రాజన్న మా ఇలా వేల్పు. కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకున్నాం. ఆదివాసీ కుటుంబాలకు సమ్మక్క కంటే ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రాజన్న ఆలయం అభివృద్ధిలో వివక్షకు గురైంది. మా ప్రభుత్వంలో తప్పకుండా అభివృద్ధి చేస్తాం.’ అని సీతక్క పేర్కొన్నారు.
చదవండి: పాతిక కేసులు పెట్టుకోండి: రాహుల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement