vemulawada Rajana Temple
-
వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగులపై ఏసీబీ నిఘా
-
కేటీఆర్.. బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేయ్: సీతక్క వార్నింగ్
రాజన్న సిరిసిల్ల, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కేటీఆర్‌కు మైండ్ బ్లాకైందని విమర్శలు గుప్పించారు. తమ అహంకారమే బీఆర్ఎస్ ఓటమికి కారణమైందని దుయ్యబట్టారు. అధికారం లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారని, అందుకే విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలోని వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని గురువారం మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లు గడీల పాలన చేసిందని విమర్శించారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా ప్రమాణ స్వీకారం చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేసేందుకు కేటీఆర్‌కు బుద్దుందా అని ప్రశ్నించిన సీతక్క ఆయన కుళ్లు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ‘ప్రజలు మావైపే ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే జీర్ణించు కోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారు. సర్పంచుల వేల బిల్లులు పెండింగ్ పెట్టింది ఎవరు..? గత ప్రభుత్వం కాదా..? మేము సక్రమంగా పని చేస్తేనే మళ్ళీ అధికారం ఇస్తారు. చేయకపోతే అవకాశం ఇవ్వరు. కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేయ్. ప్రజలు గుర్తిస్తారు. లేదంటే మిమ్మల్ని ఎప్పటికీ ప్రజలు తిరస్కరిస్తూనే ఉంటారు. రాజన్న మా ఇలా వేల్పు. కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకున్నాం. ఆదివాసీ కుటుంబాలకు సమ్మక్క కంటే ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజన్న ఆలయం అభివృద్ధిలో వివక్షకు గురైంది. మా ప్రభుత్వంలో తప్పకుండా అభివృద్ధి చేస్తాం.’ అని సీతక్క పేర్కొన్నారు. చదవండి: పాతిక కేసులు పెట్టుకోండి: రాహుల్ -
రాజన్నకు 50, అంజన్నకు 100 కోట్ల రూపాయల నిధుల విడుదల
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. దేవాలయ అభివృద్ధికోసం ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద ఈ నిధులను మంజూరు చేస్తూ ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె, రామకృష్ణా రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయానికి రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల భక్తులూ అధికసంఖ్యలో వస్తుంటారు. ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు విడుదల చేస్తామని గత డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న ఆలయాలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యం దక్కినట్లయ్యింది. మొన్న రాజన్న ఆలయానికి రూ.50 కోట్లు కేటాయించిన సర్కారు.. తాజాగా కొండగట్టుకు రూ.100 కోట్లు ప్రకటించింది. దీంతో ఆలయాల అభివృద్ధికి ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న ఘడియలు వచ్చినట్లయ్యింది. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించిన సీఎం గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి అశేష భక్తజనం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. pic.twitter.com/spGZ3N4NUb — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 8, 2023 ఎములాడ జంక్షన్ల సుందరీకరణ.. రాజన్న గుడి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ 18 జూన్ 2015న స్వయంగా గుడి, పట్టణం కలియ తిరిగారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, ఇందుకు ఏటా రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని ప్రకటించారు. ముందుగా రూ.71 కోట్లు మంజూరు చేశారు. అనంతరం వీటీడీఏ ఏర్పాటు చేసి కమిటీనీ ప్రకటించారు. చైర్మన్‌గా సీఎం కేసీఆర్, వైస్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పురుషోత్తంరెడ్డిని నియమించారు. నిధులను వీటీడీఏ ద్వారానే ఖర్చు చేయాలని జీవో విడుదల చేశారు. వేములవాడ రాజన్న ఆలయం ఆ మేరకు ఆలయ అధికారులు రూ.410 కోట్లతో భక్తుల సౌకర్యాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. గతేడాది, ఈసారి బడ్జెట్లో రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. తాజా నిధులతో బద్దిపోచమ్మ గుడి వద్ద సేకరించిన భూమికి ప్రహరీ, బోనాల మంటపం నిర్మిస్తామని వీటీడీఏ వైస్ చైర్మన్ వెల్లడించారు. నగరమంతా ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గుడి ట్యాంక్‌బండ్‌పై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ పనులు చేపడతామని, నందికమాన్ నుంచి వేములవాడకు చేరుకునే రోడ్డు సుందరీకరణ, జంక్షన్లు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గోదావరినదిలో పడవల పోటీ(ఫైల్) కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక కాళేశ్వరం.. దాని అనుబంధ ప్రాజెక్టుల వద్ద పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పేరిట బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించింది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, గోదావరిఖని వంతెన, కోటిలింగాల బ్యాక్ వాటర్, లోయర్, మధ్య, ఎగువ మానేరు డ్యామ్‌ల వద్ద పర్యాటక అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నారు. అయితే ఉమ్మడి జిల్లాను పర్యాటక క్షేత్రంగా మలచాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎప్పటిలోగా నెరవేరుతుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. కొండగట్టు కొండగట్టుకు మాస్టర్‌ప్లాన్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి బడ్జెట్లో రూ.100 కోట్లు మంజూరు చేశారు. గత డిసెంబరు 7న జగిత్యాల సభలో స్వామివారికి రూ.100 కోట్లు ఇస్తామన్న సీఎం.. సరిగ్గా 50 రోజులకు తన మాట నిలబెట్టుకున్నారు. రానున్న 50 ఏళ్లలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాల్సి ఉందని, ప్రత్యేక ప్రణాళికతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. నాంపల్లి గుట్ట నాంపల్లి గుట్టకు రోప్‌వే వేములవాడను తీర్చిదిద్దే క్రమంలో మంత్రి కేటీఆర్ సూచనల మేరకు నాంపల్లిగుట్టపై రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం జరగనుంది. వేములవాడకు వచ్చే కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వేట్రాక్ నాంపల్లి గుట్టను ఆనుకుంటూ వెళ్లనుంది. దీంతో హైదరాబాద్, మేడ్చల్, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఇక్కడి పరిసరాలను తీర్చిదిద్దనున్నారు. ఈ పనులపై కేటీఆర్ ఇప్పటికే సమీక్షించారు కూడా. -
సామాన్య భక్తురాలిగా వచ్చి.. కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని..
సాక్షి, వేములవాడ: వేములవాడ రాజన్న దర్శనానికి వస్తున్న భక్తులు వాహనాల పార్కింగ్ పేరిట దోపిడీకి గురవుతున్న వైనంపై వచ్చిన ఫిర్యాదులపై ఈవో రమాదేవి స్పందించారు. గురువారం ఉదయం సామాన్య భక్తురాలిగా వచ్చిన ఈవో పార్కింగ్ టెండర్ కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వేములవాడలో రాజన్న ఆలయ టీటీడీ ధర్మశాలల పార్కింగ్ స్థలంలో వాహనాలు నిలుపుకునేందుకు రూ.30 పార్కింగ్ ఫీజు వసూలు చేయాలి. కానీ కాంట్రాక్టర్ రూ.100 వసూలు చేస్తున్నట్లు ఈవో రమాదేవికి ఫిర్యాదులు అందాయి. దీంతో గురువారం సామన్య భక్తురాలిగా ఓ ప్రైవేట్ వాహనంలో వచ్చిన ఈవో రూ.100 పార్కింగ్ ఫీజు చెల్లించి, కాంట్రాక్టర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఈవో రమాదేవి మాట్లాడుతూ.. పబ్బ లచ్చయ్య, పబ్బ శ్రీనాథ్‌లకు చెందిన పార్కింగ్ ఫీజు, టెంకాయ టెండర్లను రద్దు చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి జాతర మహోత్సవాలు ముగిసే వరకు ఉచిత పార్కింగ్, నాంపల్లి గుట్టపైకి ఉచితంగా వెళ్లేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. చదవండి: హైదరాబాదీలకు ఊరట.. నగరంలో మరో రైల్వే టర్మినల్ రూ.30కి బదులు రూ.100 వసూలు వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలకు టీటీడీ ధర్మశాలల ఖాళీ ప్రదేశంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఇందుకు టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ రూ.30 చొప్పున వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ సదరు కాంట్రాక్టర్ దేవస్థానం అధికారులు ముద్రించిన రూ.30 టికెట్ల స్థానంలో రూ.100 టికెట్లు ముద్రించి అందినంత దండుకుంటున్నారు. టెంకాయ టెండర్ రద్దు భక్తులకు ఉచితంగా టెంకాయకొట్టే నిబంధనలు అమలులో ఉండగా, రాజన్న ఆలయంలో భక్తుల నుంచి బలవంతంగా రూ.10 వసూలు చేస్తున్నట్లు ఈవో గురువారం గుర్తించారు. వెంటనే సంబంధిత టెండర్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. భక్తులెవరూ డబ్బులు ఇవ్వవద్దని కోరారు. చదవండి: కరీంనగర్: గజానికి రూ.37,400.. ఎకరానికి 3.30కోట్లు -
రాజన్న సన్నిధిలో లఘు దర్శనమే
సాక్షి, వేములవాడ: ఈనెల 31నుంచి ప్రారంభం కానున్న సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులు ముందుగా ఎములాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకునే సంప్రదాయం ఉంది. ఈ క్రమంలో ఆదివారం 50వేల మందిపైగా భక్తులు తరలివచ్చారు. దీంతో రాజన్న క్షేత్రం కిటకిటలాడింది. భక్తుల రద్దీని గమనించిన ఆలయ అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేసి లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రద్దీ మరింత పెరుగుతుండడంతో రాత్రంతా దర్శనాలను కొనసాగించనున్నట్లు మైక్ ద్వారా ప్రకటించారు. సోమవారం వీఐపీ దర్శనాలను బ్రేక్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు తలనీలాలు, కోడె మొక్కులు, ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం బద్ది పోశవ్వకు బోనాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ.38 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. Appearances before the short RAJANNA -
జేబు దొంగలు దొరికారు..
- పోలీసుల అదుపులో ఐదుగురు.. - సీసీ కెమెరాతో చిక్కిన వైనం - దొంగల్లో బాలుడు వేములవాడ అర్బన్ : వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం ఐదుగురు దొంగలు పర్సులు కొట్టేస్తూ ఎస్పీఎఫ్ పోలీసులకు చిక్కారు. ఎస్పీఎఫ్ సిబ్బంది, పోలీసుల కథనం ప్రకారం.. సోమవారం ఉదయం నుంచే పలువురు భక్తుల డబ్బులు, సెల్ఫోన్లు దొంగతనానికి గురైనట్లు ఎస్పీఎఫ్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీఎఫ్ సిబ్బంది హెడ్‌కానిస్టేబుల్ మహేందర్, గణేశ్ నేతృత్వంలో బృందాలుగా విడిపోయి దొంగలను పట్టుకునే పనిలోపడ్డారు. అప్పటికే అనుమానం కలిగిన కొందరిని ప్రశ్నించి వదిలిపెట్టారు. అయినా దొంగల బెడద పెరుగుతూనే వచ్చింది. ఈలోగా ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన ఎంపీటీసీ ఆమేటి లక్ష్మి భర్త విజయ్‌కుమార్ తన పర్సును క్యూలైన్లో ఎవరో కొట్టేశారని ఎస్పీఎఫ్ పోలీసులకు సమాచారమిచ్చాడు. ఓ బాలుడు తనను వెంబడించి జేబులోని డబ్బులు తీశాడని క్లూ ఇచ్చాడు. దీంతో వారంతా కలిసి సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. అందులో ఓ బాలుడు పర్సు కొట్టేసినట్లు నిర్ధారించుకున్నారు. ఈక్రమంలో పరుగులు తీస్తున్న బాలుడిని ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకుని ప్రశ్నించారు. దీంతో అసలు రంగు బయటపడింది. సిద్దిపేటకు చెందిన ఈ బాలుడితోపాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీధర్, నగేశ్, రాకేశ్ దొంగతనాలు చేరుుస్తున్నట్లు తేలింది. శాస్త్రీనగర్‌లోని లాడ్జి వెళ్లి తనిఖీ చేయగా ఈ ముగ్గురు దొరికినట్లు ఎస్పీఎఫ్ సిబ్బంది తెలిపారు. రెండురోజులుగా లాడ్జిలోనే మకాం వేసి ఈ బాలుడితో దొంగతనాలు చేయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారివద్ద నుంచి తొమ్మిది సెల్ఫోన్లు, కొంత నగదు స్వాధీనపరుచుకున్నట్లు పోలీసులు తెలిపారు. సుల్తానాబాద్‌కు చెందిన సతీశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాలుడు జేబు దొంగతనాలు చేస్తూ ఇప్పటికే పలుమార్లు పోలీసులకు చిక్కినట్లు తెలిసింది.