RRR: MLA Seethakka Shocking Reaction After Watching RRR Movie, Comments Viral - Sakshi
Sakshi News home page

MLA Seethakka: డివైడ్‌ కోసం ఆ మూవీ.. ఏకం కోసం ఈ చిత్రం.. RRRపై ఎమ్మెల్యే సీతక్క రియాక్షన్‌

Published Tue, Mar 29 2022 10:49 AM | Last Updated on Tue, Mar 29 2022 11:17 AM

MLA Seethakka Reaction On RRR Movie - Sakshi

MLA Seethakka Shocking Comments On The Kashmir Files Movie: భారత్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా ఇంకా కొనసాగుతుంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌లు హీరోలుగా, దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. భారీ అంచనాల మధ్య గత శుక్రవారం(మార్చి 25)ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద దుమ్ము రేపుతోంది. మూడు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లని రాబట్టి తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి చాటింది. ఇక ఈ సినిమా చూసిన వారు తమ అభిప్రాయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు సైతం ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై స్పందించారు. తన అనుచరులతో కనిసి సినిమా వీక్షించిన సీతక్క... ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’చిత్రాన్ని విమర్శిస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.‘దేశాన్ని విడదీయాలనకుంటే ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చూడండి.. ఐక్యం చేయాలకుంటే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాన్ని వీక్షించండి’అని సీతక్క ట్వీట్‌ చేశారు. తారక్‌, చరణ్‌ అద్భుతంగా నటించారని కొనియాడారు. అలాగే ఈ చిత్రానికి అన్ని రాష్ట్రాల్లోనూ పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సీతక్క చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement