కేటీఆర్‌ తన నైజం చాటుకున్నాడు: మంత్రి సీతక్క | Minister Seethakka Serious Comments On KTR | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌ తన నైజం చాటుకున్నాడు: మంత్రి సీతక్క

Oct 2 2024 6:03 PM | Updated on Oct 2 2024 6:17 PM

Minister Seethakka Serious Comments On KTR

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మహిళా మంత్రులను పదేపదే కించపరుస్తూ కేటీఆర్‌ తన దొర దురహంకారాన్ని కేటీఆర్‌ చాటుకుంటున్నాడు అంటూ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పండుగ పూట మహిళ పట్ల కేటీఆర్‌ చీప్‌ కామెంట్స్‌ చేస్తారా? అంటూ మండిపడ్డారు.

మంత్రి సీతక్క బుధవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజే మహిళా మంత్రులను కించపరిచి కేటీఆర్ తన నైజం చాటుకున్నాడు. ఎంగిలిపూల బతుకమ్మ రోజే కేటీఆర్ గలీజ్ మాటలు వినాల్సి రావటం మన దురదృష్టం. మా నోళ్లను ఫినాయిల్‌తో కడగాలని మాట్లాడిన కుసంస్కారి కేటీఆర్. పండగల పూట మహిళ పట్ల చీప్ కామెంట్ చేసే కేటీఆర్ నోటినే యాసిడ్‌తో కడగాలి. పండగల పూట మహిళలు, మహిళా మంత్రులను కించపరచడం కేటీఆర్‌కు ఫ్యాషన్ అయింది.

రాఖీ పండగ రోజు బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్‌లు చేసుకోవచ్చు అన్నాడు. బతుకమ్మ మొదటి రోజు చిట్ చాట్ పేరుతో మా గురించి చాలా చులకనగా మాట్లాడారు. అదే విషయం మీడియా ముఖంగా చెప్పి ఉంటే మహిళలే మీకు బుద్ధి చెప్పేవారు. మహిళా మంత్రులను పదే పదే కించపరుస్తూ తన దొర దురంకారాన్ని కేటీఆర్ చాటుకుంటున్నాడు. చాటుమాటుగా నాలుగు గోడల మధ్య మాట్లాడటం కాదు.. ధైర్యముంటే బహిరంగంగా మాట్లాడాలి.

నేనెప్పుడూ వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు. దూషణలకు, బూతులకు బ్రాండ్ అంబాసిడరే మీరు. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించినట్లు ఆధారాలు చూపిస్తావా?. రాజకీయాల్లో మేము ఉండకూడదన్న లక్ష్యంతోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా మాపై పదే పదే అభ్యంతరకర కామెంట్స్ చేయిస్తున్నారు. కనీసం సొంత సోషల్ మీడియాను కట్టడి చేయాలన్న సభ్యత కేటీఆర్‌కు లేదు. నువ్వు ఇలానే రెచ్చిపోతే రేపు మీ కుటుంబ సభ్యులు తలదించుకోవాల్సి వస్తుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: వాళ్లు ఆడబిడ్డలు కాదా.. మంత్రి కొండా సురేఖకు సబిత కౌంటర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement