అధికారులతో మాట్లాడుతున్న మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: అధికారం కోల్పోయి కూడా కేటీఆర్ అహంకారంతో బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారని, తమ ప్రభుత్వంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని పంచాయతీరాజ్, స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను గురువారం దర్శించుకున్న అనంతరం మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడారు. తొమ్మిదేళ్ల గడీల పాలన నుంచి విముక్తి పొందేందుకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఇంకా ప్రమాణస్వీకారం చేయడం లేదని, అధికారం ఉంటేనే ప్రజల్లోకి వచ్చే ఆలోచనలో తండ్రీకొడుకులు ఉన్నారని ఎద్దేవా చేశారు.
ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటిస్తే.. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులు పెట్టింది గత ప్రభుత్వం కాదా?.. అని సీతక్క ప్రశ్నించారు. ప్రజాసంక్షేమాన్ని గాలి కొదిలేసి తమకిష్టమైన పనులు చేసుకుంటూ రాష్ట్రా న్ని దివాళా తీయించారని మండిపడ్డారు. వేముల వాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రతి నెల 5వ తేదీలోగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు అందేలా చూస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment