కంటికి రెప్పలా, అల్లారుముద్దుగా పెంచుకున్న తన ఇద్దరు చెల్లెళ్ళకు జరిగిన తీరని అన్యాయానికి ఓ అన్న విధించిన శిక్ష నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జాగ్రత్త బిడ్డా’. బహుముఖ ప్రతిభాశాలి "కృష్ణ మోహన్"ను దర్శకుడిగా వెండితెరకు పరిచయం చేస్తూ... కె.ఎస్.బి.క్రియేషన్స్ - ఎమ్.ఎమ్.ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై... విశ్రాంత పోలీస్ అధికారి శ్రీకాంత్ కరణం - ఎమ్.వై.గిరిబాబు సంయుక్తంగా ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీని నిర్మించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘జాగ్రత్త బిడ్డా’ ఈనెల 23న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది.
‘మినిమం గ్యారంటీ మూవీస్" (ఎమ్.జి.ఎమ్) ద్వారా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ములుగు ఎమ్మెల్యే - ఫైర్ బ్రాండ్ సీతక్క ‘జాగ్రత్త బిడ్డా’ ట్రైలర్ విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
‘డి.జె.టిల్లు, బలగం’ చిత్రాల కోవలో.. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ సందేశాత్మక చిత్రం మంచి విజయం సాధించాలని అభిలషించారు. అనంతరం జరిగిన పత్రికా సమావేశంలో తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, సాయి వెంకట్ లతోపాటు చిత్రబృందం పాల్గొని, సీరియస్ ఇష్ష్యూ బ్యాక్ డ్రాప్ లో గ్రిప్పింగ్ నేరేషన్ తో రూపొందిన ‘జాగ్రత్త బిడ్డా’ ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment