మంచానికే పరిమితమైన పద్మ
టవర్‌సర్కిల్(కరీంనగర్): రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది.. ఏ పూటకు ఆ పూట గడవడమే కష్టమవుతున్న తరుణంలో ఆ ఇంటి ఇల్లాలిని క్యాన్సర్ వ్యాధి మంచానికే పరిమితం చేసింది. వైద్యం చేయించుకునే స్థోమత లేకపోవడంతో ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్‌లోని భగత్‌నగర్‌కు చెందిన ఎలగందుల పద్మది ఈ దయనీయ పరిస్థితి.నగరపాలక సంస్థ పరిధిలోని 30వ డివిజన్ భగత్‌నగర్ చౌరస్తా సమీపంలో నివసించే ఎలగందుల నర్సయ్య లాండ్రీషాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా డు. అరకొర సంపాదనే అయినా భార్య, ఇద్దరు కుమారులు, కూతురుతో హాయిగా సాగిపోతున్న జీవనంలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. నర్సయ్య భార్య పద్మ(52) గతేడాది అక్టోబర్‌లో రొమ్ము క్యాన్సర్ బారిన పడింది. నాలుగుసార్లు కీమో థెరపీ చేశాక సర్జరీ చేస్తామని వైద్యులు తెలిపారు. కానీ రెండుసార్లు చేశాకే ఆమె శరీరం తట్టుకోలేని స్థితికి చేరింది. ఆసుపత్రికి తీసుకెళ్తే ఊపిరితిత్తులు, కాలేయం, జీర్ణాశయంలో అల్సర్ తయారై ఇన్‌ఫెక్షన్ సోకిన ట్లు వైద్యులు నిర్ధారించారు. పెడిసిటీ తీసుకో వాలని హైదరాబాద్‌కు పంపించారు. పరీ క్షించిన అక్కడి వైద్యులు కీమో థెరపీ ద్వారానే మిగతా అవయవాలకు ఇన్‌ఫెక్షన్ సోకినట్లు వెల్లడించారు. ఈక్రమంలోనే ఆమె మూడుసార్లు గుండె జబ్బుకు గురైంది. బరువు తగ్గడంతో కీమో థెరపీ, సర్జరీ చేసే పరిస్థితి లేదని వైద్యులు చేతులెత్తేశారు. దీంతో ఆమె నెల రోజులుగా ఇంట్లోనే మంచానికి అంకితమైంది.
ఆయుర్వేదమే దిక్కు..
అల్లోపతి వైద్యానికి పద్మ శరీరం సహకరించదని తేలిపోయింది. ఆయుర్వేదం ద్వారా బతికించేందుకు కొద్దిగా చాన్స్ ఉందని వైద్యులు చెప్పడంతో వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ప్ర తి నెలా రూ.15 వేల ఖర్చు అవుతోందని, త మకు అంత స్థోమత లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. దాతలు స్పందించి, పద్మను బతికించాలని వేడుకుంటున్నారు. «
దాతలు సంప్రదించాల్సిన చిరునామా :
ఎలగందుల నర్సయ్య, ఫోన్ : 96181 79595
ఆంధ్రాబ్యాంకు అకౌంట్ నంబర్ : 159110100118360
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : ఏఎన్‌డీబీ0001591
Comments
Please login to add a commentAdd a comment