
స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐ , పద్మ (ఫైల్)
కథలాపూర్(వేములవాడ): కట్టుకున్న భర్తే సంతానం కలగడం లేదన్న కారణంతో భార్యను కడతేర్చిన ఘటన కథలా పూర్ మండలంలోని తాండ్య్రాలలో చోటుచేసుకుంది. పో లీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని గంభీర్‌పూర్‌కు చెందిన పద్మ(36)కు తాండ్య్రాలకు చెందిన గంగుల మల్లయ్యతో పదేళ్ల కిందట వివాహం జరిగింది. దంపతులిద్దరూ వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నారు. కాగా ఇన్నేళ్లయినా సంతానం కలగడం లేదని మల్లయ్య తరచూ పద్మను వేధింపులకు గురిచేసేవాడు. (చుక్కేసి.. చిక్కేసి!)
ఈ క్రమంలో సోమవారం రాత్రి గొడవ జరిగింది. ఆవేశంతో మల్లయ్య రోకలితో ఆమె తలపై కొట్టాడు. అనంతరం చీరతో ఉరేసి, పరారయ్యారు. పద్మ మృతి విషయం మంగళవారం ఉదయం వె లుగులోకి వచ్చింది. సంఘటన స్థలాన్ని కోరుట్ల సీఐ రాజశేఖర్‌రాజు, కథలాపూర్ ఎస్సై పృథ్వీధర్‌గౌడ్ పరిశీలించారు. గ్రామస్తులను, బంధువులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి సోదరుడు హన్మాండ్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment