కరీంనగర్ హెల్త్: ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవం సందర్భంగా చల్మెడ ఆనందరావు వైద్యవిజ్ఞాన సంస్థ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అప్నా, ఫాగ్సీ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. చల్మెడ ఆసుపత్రి చైర్మన్ లక్ష్మీనర్సింహరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఐఎంఏ హాల్ నుంచి తెలంగాణ చౌక్‌మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వ్యాధిని ముందస్తుగా గుర్తించడం ద్వారా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేసుకోవచ్చన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్ అలీం మాట్లాడుతూ క్యాన్సర్ అనేక రకాలు ఉంటుందని, అవగాహన లేకే ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. రొమ్ము క్యాన్సర్ వంశ పారంపర్యగా వస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ కరీంనగర్ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు నరేంద్ర, రమణ్‌కుమార్, ఫాగ్సీ కరీంనగర్ శాఖ అధ్యక్షురాలు విజయలక్ష్మి, కార్యదర్శి చంద్రమతి, ట్రెసరర్ రజనీప్రియదర్శిని, రాష్ట్ర ఎథికల్ కమిటీ సభ్యుడు బీఎన్.రావు, ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్యాన్సర్‌ను తరిమేద్దాం
Published Thu, Feb 5 2015 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM
Advertisement