ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో ఓ మహిళ బస్సులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో ఓ మహిళ బస్సులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్రకు చెందిన గయాబాయి కూతురైన పద్మిన శేగర్ గర్భవతి. ఆమెను తీసుకుని మావలలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉట్నూర్ వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కారు. సీతాగోంది గ్రామం దాటాక పద్మినకు పురిటి నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో ప్రయాణికులు 108 అంబులెన్సుకు సమాచారం ఇచ్చినా అది రావడం ఆలస్యం అయింది.
నొప్పులు భరించలేకపోవడంతో డ్రైవర్ అక్కడే బస్సును నిలిపి వేశాడు. మహిళా కండక్టర్, తోటి మహిళలు పురుడు పోయగా పద్మిన మగబిడ్డకు జన్మనిచ్చింది. గుడిహత్నూర్ బస్టాండ్ చేరిన బస్సును నేరుగా స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అప్పటికే సమాచారం అందుకున్న బస్టాండ్ కంట్రోలర్ మొయినొద్దీన్ వైద్యులకు సమాచారమిచ్చి తక్షణ వైద్య సేవలందేలా చూశారు.