కేజీఎస్‌ను తనిఖీ చేసిన ఇన్‌చార్జ్ డీఎం హెచ్‌ఓ
చేగుంట : మండల కేంద్రంలోని కేజీఎస్ ఆస్పత్రిని జిల్లా ఇన్‌చార్జ్ వైద్యాధికారి పద్మ బుధవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. గతంలో కేజీఎస్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స వికటించి మహిళ మృతి చెందిన ఘటనలో ఆస్పత్రి స్కానింగ్ సెంటర్, ఆపరేషన్ థియేటర్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆస్పత్రి నిర్వాహకులు సీజ్ చేసిన గదుల పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆమె ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సమయంలో ఆస్పత్రిలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడం, రోగులకు సేవలందించే నర్సులు లేకపోవడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. క నీసం ఓపీలు కూడా చూసేవారు కరువయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి వాటిలో లోపాలు గుర్తించి అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జోగిపేటలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆస్పత్రి, వైద్యులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు పద్మ తెలిపారు. ఆమె వెంట వసంత్‌రావ్ ఉన్నారు.