తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వరంగల్‌కు ప్రత్యేక గౌరవం దక్కుతుందని జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ అన్నారు.
జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ
బచ్చన్నపేట : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వరంగల్‌కు ప్రత్యేక గౌరవం దక్కుతుందని జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ అన్నారు. స్థానిక మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి సోమవారం ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాటి రుద్రమదేవి పౌరుషం నుంచి నేటి కేసీఆర్ పాలన వరకు చరిత్రలో ఈ గడ్డకు సముచిత స్థానం ఉందన్నారు. కేసీఆర్ కంటున్న బంగారు తెలంగాణ కలను సాకారం చేసేందుకు ముఖ్యంగా అధికారులు కష్టపడి పని చేయాలని అన్నారు.
అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పని చేసినప్పుడే ముందుకు వెళతామన్నారు. అంతకుముందు జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు ఎమ్యెల్యే, ఎమ్యెల్సీలను ఎంపీపీ పస్తం మహేష్, ఎంపీటీసీలు అరుణ, సుజాత, శ్రీనివాస్, ప్రభాకర్, అరుణ, విజయలక్ష్మి, సునీత, సర్పంచ్‌లు పుష్ప, సతీష్‌రెడ్డి, ఆంజనేయులు, బాల్‌నారాయణ, రజిత, నవీన, మమత, బాల్‌నర్సయ్య, బాలమణి, బొడ్డు కిష్టయ్య, చంద్రకళ తదితరులు సన్మానించారు.