ఇల్లెందు రూరల్: స్థలం విషయమై జరిగిన ఘర్షణలో కన్నకొడుకే కాలయముడయ్యాడు. రోకలిబండతో మోది తల్లిని హత్య చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మొదుగులగూడెంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై సీఐ కరుణాకర్, స్థానికులు తెలిపిన వివరాలివి. మొదుగులగూడెంకు చెందిన మెరుగు పద్మ (60)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు వేణు ఆత్మహత్య చేసుకోగా.. పెద్ద కుమారుడు యాకయ్య ఎనిమిదేళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లా విస్సంపల్లి వలస వెళ్లి ఉంటున్నాడు.
తరచూ తల్లితో ఘర్షణ పడే యాకయ్య.. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజుల క్రితం భార్యతో మొదుగులగూడెం వచ్చాడు. ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి జాగాలో గృహలక్ష్మి పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న పద్మ.. పక్కనే ఉన్న స్థలంలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవాలని యాకయ్యకు సూచించింది. కానీ గౌడ సంఘం తరపున బొజ్జాయిగూడెంలో మంజూరు చేసిన స్థలమే కావాలని యాకయ్య కోరాడు.
ఆ స్థలం ఆడబిడ్డ ఉమారాణికి ఇస్తానని తల్లి చెప్పడంతో ఘర్షణకు దిగి వెళ్లిపోయాడు. మళ్లీ శుక్రవారం మధ్యాహ్నం కూడా భార్య కవితతో కలిసి మొదుగులగూడెం వచి్చన యాకయ్య తల్లితో ఘర్షణ పడ్డాడు. ఈక్రమంలోనే ఇంట్లోని రోకలిబండతో తలపై బలంగా మోదగా పద్మకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment