yakayya
-
కొడుకే కాలయముడు
ఇల్లెందు రూరల్: స్థలం విషయమై జరిగిన ఘర్షణలో కన్నకొడుకే కాలయముడయ్యాడు. రోకలిబండతో మోది తల్లిని హత్య చేశాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మొదుగులగూడెంలో శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై సీఐ కరుణాకర్, స్థానికులు తెలిపిన వివరాలివి. మొదుగులగూడెంకు చెందిన మెరుగు పద్మ (60)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు వేణు ఆత్మహత్య చేసుకోగా.. పెద్ద కుమారుడు యాకయ్య ఎనిమిదేళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లా విస్సంపల్లి వలస వెళ్లి ఉంటున్నాడు. తరచూ తల్లితో ఘర్షణ పడే యాకయ్య.. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రెండు రోజుల క్రితం భార్యతో మొదుగులగూడెం వచ్చాడు. ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి జాగాలో గృహలక్ష్మి పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న పద్మ.. పక్కనే ఉన్న స్థలంలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవాలని యాకయ్యకు సూచించింది. కానీ గౌడ సంఘం తరపున బొజ్జాయిగూడెంలో మంజూరు చేసిన స్థలమే కావాలని యాకయ్య కోరాడు. ఆ స్థలం ఆడబిడ్డ ఉమారాణికి ఇస్తానని తల్లి చెప్పడంతో ఘర్షణకు దిగి వెళ్లిపోయాడు. మళ్లీ శుక్రవారం మధ్యాహ్నం కూడా భార్య కవితతో కలిసి మొదుగులగూడెం వచి్చన యాకయ్య తల్లితో ఘర్షణ పడ్డాడు. ఈక్రమంలోనే ఇంట్లోని రోకలిబండతో తలపై బలంగా మోదగా పద్మకు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. -
వ్యక్తి దారుణ హత్య
మహబూబాబాద్ జిల్లా: దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల శివారు ఏపూరి గ్రామంలో దారుణ హత్య జరిగింది. గోడ్డలి యాకయ్య అనే వ్యక్తిని అతని ఇంటి వద్ద కర్రలతో కొట్టి చంపారు. దుండగులు మృతుడి జేబులో నక్సల్స్ పేరీట లేఖ వదిలి వెళ్లారు. యాకయ్య పల్లెల్లో ఒంటరి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నాడని, ఇతని వల్ల మహిళలకు గ్రామాల్లో రక్షణ లేకుండా పోతోందని తెలిపారు. అంతే కాకుండా భూకబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు చేస్తూ అమాయక పేద ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని, అందువల్లే ప్రజా కోర్టులో శిక్షిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఎవరైనా ప్రజలపై , మహిళలపై అరాచకాలకు పాల్పడితే ఇదే శిక్షకు గురికాక తప్పదని సీపీఐ(ఎం ఎల్) పార్టీ పేరిట కామ్రేడ్ జగదీశ్ ఆ లేఖ ద్వారా తెలియజేశారు. -
ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను
బయటకు వెళ్లడం లేదు మిలటరీ వారు రక్షణగా ఉన్నారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం ఇరాక్ నుంచి ఫోన్లో మాట్లాడిన వల్లెపు యాకయ్య వర్ధన్నపేట: ఇరాక్‌లో ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న బాగ్దాద్ పట్టణానికి సుమారు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బస్రా జిల్లా ధర్మ పట్టణంలోని బల్కాస్ అల్కామా కంపనీలో తాను క్షేమంగా ఉన్నానని వర్ధన్నపేట మండల కేంద్రానికి చెందిన వల్లెపు యూకయ్య తెలిపారు. ఆయన సోమవారం ఇరాక్ నుంచి ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడాడు. తాను బల్కాస్ అల్కామా కంపనీలో వర్కర్లకు వంట చేసి పెడుతుంటానని చెప్పాడు. వారం రోజులుగా ఇరాక్‌లో అంతర్యుద్ధం జరుగుతుండడంతో తాము బయటకు వెళ్లకుండా ఇక్కడి పోలీసులు, మిలటరీ వారు మా ప్రాంతంలో రక్షణగా ఉన్నారని తెలిపాడు. ప్రస్తుతం ఇక్కడ 40 మంది కూలీలము ఉన్నామని, తాను పనిచేసే కంపెనీ ప్రభుత్వ భవనాల నిర్మాణం చేస్తుందని, ప్రస్తుతం పనులన్నీ నిలిపి వేసి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని చెప్పాడు. కంపెనీ పక్కనే సబ్‌స్టేషన్ ఉందని, అక్కడి నుంచి చుట్టూ ఇరాక్ సైన్యం కట్టుదిట్టమైన ఏర్పాట్లతో రక్షణగా ఉందని, ఏ సమయంలోనైనా సబ్‌స్టేషన్‌పై దాడి చేయవచ్చనే అనుమానంతో వారు కాపాలా కాస్తున్నారని చెప్పాడు. తాను నాలుగు సంవత్సరాలు దుబాయ్‌లో పనిచేశానని, అక్కడ జీతం తక్కువగా వస్తుండడంతో ఇంటికి తిరిగి వచ్చానని, అరుుతే ఇరాక్‌కు వెళితే అక్కడ డబ్బులు బాగా వస్తాయని చెప్పడంతో నాలుగు నెలల క్రితం రూ.రెండు లక్షలు అప్పు చేసి ఏజెంటు ద్వారా వీసా తీసుకుని వచ్చానని యూకయ్య వివరించాడు. పనిలో చేరిన నాలుగు నెలల్లోనే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. నెలకు 550 డాలర్లు వస్తుండగా ఖర్చులు పోను ఇంటికి రూ.25 వేలవరకు పంపుతున్నానని, ఇప్పుడు అప్పు తీరే మార్గం గురించి ఆలోచిస్తున్నానని చెప్పాడు. యుద్ధం ఇక్కడి వరకు వస్తే తమ పరిస్థితి ఏమిటోనని ఆందోళనగా ఉందని అన్నాడు.