
ద్వారకాతిరుమల: ఆడపిల్లను కన్నందుకు అత్తింటి వివక్షతతో బతుకీడుస్తున్న గురజాల పద్మ కథ మళ్లీ మొదటికొచ్చింది. అత్తింటి ఆదరణ నోచుకోక పలుమార్లు తిరస్కారానికి గురై బిడ్డతో సహా రోడ్డున పడ్డ పద్మ మరోసారి అత్తింటి నుంచి గెంటివేయబడింది. శనివారం ఉదయం పద్మను ఆమె అత్త ఆదిలక్ష్మి కొట్టి, బిడ్డతో సహా ఇంటి నుంచి నెట్టేసింది. విషయం తెలి సిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, గోపాలపురం ని యోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు తదితరులు బాధితురాలు పద్మకు వెన్నుదన్నుగా నిలిచారు. పద్మ ఉంటున్న మలసానికుంట గ్రామంలో ఆమె అత్తింటికి వెళ్లి అత్త ఆదిలక్ష్మికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి పద్మను, ఆమె బిడ్డను ఇంటిలోకి పంపిం చారు. అనంతరం బాధితురాలు పద్మ వైఎస్సార్ సీపీ నేతల అండతో ద్వారకాతిరుమల పోలీస్టేషన్‌కు చేరుకుని అత్తమామలు ఆదిలక్ష్మి, ఆంజనేయులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.
నచ్చజెప్పినా వినలేదు
వైఎస్సార్ సీపీ నేతలు పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, తలారి వెంకట్రావు, పార్టీ మండల కన్వీ నర్ ప్రతాపనేని వాసు, నేతలు బుసనబోయిన సత్యనారాయణ, సర్పంచ్ బత్తు ల విజయ్‌శేఖర్, అఖిలభారత యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు సాయిల స్వాతి, జిల్లా యాదవ సంఘ ఉపాధ్యక్షుడు ఉక్కుసూరి గోపాలకృష్ణ తదితరులు పద్మ అత్త ఆదిలక్ష్మితో మాట్లాడారు. అయినా ఆదిలక్ష్మి వినకపోవడంతో బలవంతంగా తలుపులు తెరిచారు.
వెంటనే చర్యలు తీసుకోవాలి
పసిబిడ్డతో సహా పద్మను చిత్రహింసలకు గురిచేస్తున్న అత్తమామలు, పట్టించుకోని భర్తను వెంటనే అరెస్ట్ చేయాలని పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, తలారి వెంకట్రావు డిమాం డ్ చేశారు. తమ పార్టీ తరఫున పద్మకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. చంటి బిడ్డతో ఒంటరిగా ఇంట్లో ఉంటున్న తనను అత్తింటి వారు తన్ని తరిమేస్తున్నారని పద్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. భర్త, అత్తమామలు తమను కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతోంది.
కేసులు పెడితే ఎలా ఉండనిస్తాం
కేసులు పెట్టిన అమ్మాయి మా ఇంట్లో ఉండటానికి కుదరదని పద్మ అత్త ఆదిలక్ష్మి అంటోంది. తమను ఇష్టానుసారంగా తిడుతూ, మీ అంతు చూస్తానని బెదిరి స్తోందని ఆదిలక్ష్మి ఆరోపించింది. పెట్టిన కేసులు తేలకుండా ఇంట్లో ఎలా ఉం టుందని ఆదిలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment