అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
మిర్యాలగూడ: అనుమానాస్పద స్థితిలో ఒక మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ఇందిరమ్మకాలనీలో లేఆవుట్-1లో బుధవారం జరిగింది. వివరాలు.. పట్టణానికి చెందిన శ్రీనివాస్ ఒక ప్రైవేట్ కళాశాలలో క్లర్క్ గా పని చేస్తున్నాడు. కాగా, అతని భార్య పద్మ(30) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
అయితే, భర్త, ఆడపడుచులే తమ కుమార్తెను హత్య చేసి ఉరి వేసి ఉంటారని పద్మ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం కోసం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.