నిద్రిస్తున్న మహిళను బైక్ ఢీకొనడంతో ఆమె తీవ్ర గాయాలతో మృతి చెందింది. ఖమ్మం జిల్లా బయ్యారం మండలం కారుకొండ వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కనే పెసరకుప్ప వేసుకుని బానోతు పద్మ (36) నిద్రిస్తోంది. ఓ బైక్ వచ్చి ఆమెను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.