ఏసీటీవో పద్మ హల్‌చల్‌ | acto padma arrest in tiruvuru | Sakshi
Sakshi News home page

ఏసీటీవో పద్మ హల్‌చల్‌

Published Fri, Apr 7 2017 11:02 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

acto padma arrest in tiruvuru

విజయవాడ: కృష్ణా జిల్లా తిరువూరులో ఏసీటీవో పద్మ హల్‌చల్‌ చేశారు. ఓ సిమెంట్‌ షాప్‌ వద్ద తనిఖీలు చేయాలంటూ హంగామా సృష్టించారు.

సిమెంట్‌ షాపు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పద్మ వారిపై రాళ్లు రువ్వడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. అయితే గత కొంతకాలంగా పద్మ మానసిక పరిస్థితి సరిగా లేదని బంధువులు వెల్లడిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌ నుంచి అమరావతికి సైకిల్‌ తొక్కి ఆంధ్రా ఉద్యోగుల్లో పద్మ స్పూర్తి నింపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement