ACTO
-
ఏసీటీవో పద్మ హల్చల్
విజయవాడ: కృష్ణా జిల్లా తిరువూరులో ఏసీటీవో పద్మ హల్చల్ చేశారు. ఓ సిమెంట్ షాప్ వద్ద తనిఖీలు చేయాలంటూ హంగామా సృష్టించారు. సిమెంట్ షాపు నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పద్మ వారిపై రాళ్లు రువ్వడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా స్టేషన్‌కు తరలించారు. అయితే గత కొంతకాలంగా పద్మ మానసిక పరిస్థితి సరిగా లేదని బంధువులు వెల్లడిస్తున్నారు. గతంలో హైదరాబాద్ నుంచి అమరావతికి సైకిల్ తొక్కి ఆంధ్రా ఉద్యోగుల్లో పద్మ స్పూర్తి నింపిన విషయం తెలిసిందే. -
ఏసీటీవో పద్మ హల్చల్
-
సీఐడీ కస్టడీకి బోధన్ స్కామ్ నిందితులు
సాక్షి, హైదరాబాద్: కమర్షియల్ ట్యాక్స్ చలాన్ల కుంభకోణంలో కోర్టులో లొంగిపోయిన ముగ్గురు నిందితులను సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. బోధన్ సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏసీటీవో, ఓ సీనియర్, మరో జూనియర్ అసిస్టెంట్ గత వారం కోర్టులో లొంగిపోయారు. వారిని విచారించి కేసుకు సంబంధించి మిగిలిన నిందితుల పాత్రను నిరూపించాల్సి ఉందని, కాబట్టి వారిని కస్టడీకి అప్పగించాలని సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు వారం రోజుల పాటు ఆ ముగ్గురిని విచారించేందుకు కోర్టు అనుమతిచ్చిందని సీఐడీ ఐజీ సౌమ్యామిశ్రా తెలిపారు. కేసులో కీలకంగా ఉన్న ప్రైవేట్ ట్యాక్స్ కన్సల్టెంట్ శివరాజు, అతడి కుమారుడు సునీల్ కోసం సీఐడీ బృందాలు వేటసాగిస్తున్నాయి. -
ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పించాలి
► వాణిజ్య పన్నుల నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముజాహిద్‌హుస్సేన్ కరీమాబాద్ : ప్రభుత్వం ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పించాలని వాణిజ్య పన్నుల నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ముజాహిద్‌హుస్సేన్ కోరారు. శనివారం హన్మకొండ అశోక కాన్ఫరెన్స్ హాల్లో డివిజన్ అధ్యక్షుడు కె.గోపీకిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముజాహిద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్–2 ఉద్యోగులకు నేరుగా ఏసీటీఓలు గానూ, అలాగే కిందిస్థాయి సిబ్బంది పదోన్నతుల ద్వారా ఏసీటీఓలుగా నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రూప్–2 ద్వారా నియామకమయ్యే సబ్రిజిస్ట్రార్లు, డీటీలు, కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్ స్పెక్టర్లు, ఎస్టీఓలకు గెజిటెడ్ హోదా ఇచ్చినట్లుగా ఏసీటీఓలకూ అవకాశం ఇవ్వాలని కోరారు. ఏసీటీఓలకు గెజిటెడ్ హోదా కల్పించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి భారం ఏర్పడదని ముజాహిద్ వివరించారు. ఏసీటీఓలు సుమారు 30 నుంచి 35 ఏళ్లుగా విధులు నిర్వర్తించినప్పటికీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లుగానే ఉద్యోగవిరమణ చేయాల్సి వస్తోందన్నారు. సమావేశంలో గోపీకిషోర్, అజయ్‌కుమార్, మసూద్, రమేష్, జగదీష్‌కుమార్, సామ్యూల్, సుమలత, నాగమణి, వినయ్, మమత, అనుకిరణ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీటీఓకు రూ.10 కోట్ల అక్రమ ఆస్తులు
నల్గొండ : నల్గొండ జిల్లా అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ సాయికిశోర్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలు రావడంతో గురువారం ఉదయం నల్గొండ, హైదరాబాద్ లలో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. రూ.10 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు కలిగిఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ సోదాల్లో పలు విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సాయికిశోర్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తరలించారు. -
ఏసీబీకి చిక్కిన ఏసీటీఓ
రాజమండ్రి క్రైం: బేకరీ నిర్మాణానికి అనుమతి కోసం అభ్యర్ధిస్తున్న వ్యక్తి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఓ కమర్షియల్ టాక్స్ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడిలో గురువారం చోటుచేసుకుంది. వివారాలు.. గ్రామానికి చెందిన నకల సురేష్ బేకరీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కమర్షియల్ టాక్స్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్యాపురం సర్కిల్ కార్యాలయంలో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రసజ్ఞ శ్రీ బేకరీ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో సురేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు రసజ్ఞ శ్రీ లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో అతనికి సహకరించింన జూనియర్ అసిస్టెంట్ రామ్మోహనరావును కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.